ప్రేమలో బ్రేకప్ అయ్యాక బాధపడకూడదంటే ఇలా చేయండి..!

Publish Date:Jun 18, 2024

Advertisement

ఈ జనరేషన్ వాళ్లకు ప్రేమ అనేది చాలా కామన్ విషయం. అది కూడా ప్రేమించడం, విడిపోవడం, ఆ తరువాత మళ్లీ ఇంకొక వ్యక్తితో ప్రేమలో పడటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఎంతమందిని ప్రేమించినా, విడిపోయినా ప్రేమలో ఉన్నప్పుడు  ఎన్నో విషయాలు పంచుకుంటారు,  వాళ్లతో సమయం గడపడానికి ఎంతో సాహసం కూడా చేస్తారు. కష్టం, సంతోషం,  బాధ, చేదు సంఘటనలు,  చిలిపి గొడవలు, ఒకరి పట్ల ఒకరు చూపించుకున్న ఆప్యాయత ఇవన్నీ ప్రతి ప్రేమ జంట మధ్య జరిగేవే. మరికొందరు ఇంకాస్త ముందడుగు వేసి చాలా ఓపెన్ అయిపోతారు కూడా. కానీ ప్రేమ విఫలం అయ్యాక, ఇద్దరూ దూరం అయ్యాక  జరిగేది చాలా బాధాకరం. ఆ బాధ నుండి బయటపడలేక సతమతం అయ్యేవారు చాలామంది ఉంటారు.  ఈ బాధను అధిగమించడానికి ఏం చేయాలో తెలుసుకుంటే..


అంగీకారం..

విడిపోయిన తర్వాత చాలా మంది తమ భాగస్వామి తమను విడిచిపెట్టారని అంగీకరించలేరు.   పాత విషయాలలోనే చిక్కుకుపోతారు. దీనివల్ల బ్రేకప్ అయిన తరువాత కూడా  విడిపోయిన వ్యక్తి గురించే ఆలోచిస్తూ, బాధపడుతూ ఉంటారు. కానీ బ్రేకప్ అయ్యాక ఇక ఇద్దరి మధ్య  సంబంధం ముగిసిపోయిందని మనస్ఫూర్తిగా అంగీకరించాలి.   అవన్నీ వదిలిపెట్టాల్సిన విషయాలని అర్థం చేసుకుని జరగాల్సిన వాటి గుంరిచి ఫోకస్ పెట్టాలి.


స్నేహితులు..

బ్రేకప్ తరువాత బాధ నుండి బయటపడానికి స్నేహితులే గొప్ప మార్గం. బెస్ట్ ఫ్రెండ్స్ తప్ప  బాధను ఎవ్వరూ అంతగా అర్థం చేసుకోరు. స్నేహితులు అందరూ ఒక్కచోట చేరితే వారితో సమయం గడుపుతూ తమ జీవితంలో బ్రేకప్ లాంటి చేదు దశ ఒకటి ఏర్పడిందనే విషయమే గుర్తుండదు. అబ్బాయిలకు అయినా అమ్మాయిలకు అయినా ఇది చక్కని మార్గం.  అందుకే బ్రేకప్ పెయిన్ మర్చిపోవడానికి స్నేహితులను కలవాలి.


భవిష్యత్ లక్ష్యాలు..

ఎంతసేపు ప్రేమించిన వ్యక్తి గురించి, గతంలో వారితో గడిపిన సమయం గురించి,  జరిగిన గొడవల గురించి, విడిపోయిన సంఘటన గురించి పదే పదే తలచుకుని బాధపడటం వల్ల సమయం వృథా అవుతుందే తప్ప భవిష్యత్తుకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదు.  ఒక వ్యక్తి జీవితంలో నుండి వెళ్లిపోయారని అర్థం చేసుకుని భవిష్యత్తు మీద, లక్ష్యాల మీద దృష్టి పెట్టడం మంచిది.  ఇది భవిష్యత్తును ఎంతో అందంగా మారుస్తుంది. జీవితంలో ఉన్నతంగా నిలబడేలా చేస్తుంది.


సెల్ఫ్ ప్రొటెక్షన్..


చాలామంది బ్రేకప్ తరువాత ఇక బ్రతికి ఉండటం ఎందుకు అని ఆలోచిస్తారు.  వదిలేసిన వ్యక్తి లేకుండా ఎలా బ్రతకడం అని అనుకుంటారు. ఈ ఆలోచన నుండే సూసైడ్ వైపు వెళతారు. కానీ  విడిపోయిన వ్యక్తి కారణంగా ప్రాణాలు తీసుకోవడం ఎప్పటికీ సరైనది కాదు.  జీవితంలో ఎవరున్నా లేకపోయినా తనకు  తాను ఉండాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి.  తన గురించి తాను కేర్ తీసుకోవాలి. తనని తాను ప్రేమించుకోవాలి. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ప్రొటెక్షన్ కలిగిన వారు ఎవరూ ఇతరుల కారణంగా చావును ఎంచుకోరు.


                                 *రూపశ్రీ.

By
en-us Political News

  
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది,  ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం..
పెళ్లి ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వేడుక. భారతీయులకు అయితే పెళ్లి అనేది జీవితంలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు.  కానీ నేటికాలంలో ఆ వైవాహిక బంధం మసకబారింది. కొత్తగా పెళ్లైనవాళ్లు ఏడాది కూడా గడపకుండానే...
ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో విజయవంతంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. దీనికి మంచి విద్య, మంచి విలువలు చాలా అవసరం. ఇవన్నీ ఉన్నా సరే.. కొంతమంది అమ్మాయిలు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు...
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా..
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా..
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే...
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.