రిలేషన్ ఏక పక్షంగా సాగుతుంటే మానసిక సమస్యలు వస్తాయా?

Publish Date:Jun 19, 2024

Advertisement

మానసిక సమస్యలు ఇప్పట్లో చాలా ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికాలం యూత్  మానసిక సమస్యలతో చాలా సతమతం అవుతున్నారు. ప్రేమ, వివాహం లాంటి బంధం ఏర్పడిన తరువాత  ఆ బంధం చాలావరకు ఏకపక్షంగా సాగుతూ ఉంటుంది.  ముఖ్యంగా వివాహంలో భార్యాభర్తలు ఇద్దరూ తమ బంధం గురించి ఆలోచించాలి. కానీ దీనికి బదులుగా భార్యాభర్తలలో ఒకరు మాత్రమే తమ బంధం నిలబడాలని తాపత్రయ పడుతున్నా,  ఒకరు మాత్రమే ఏ తప్పు జరిగినా దానికి బాధితులుగా మారుతున్నా, ఒక్కరే బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా ఆ బంధంలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా మానసిక సమస్యలు ఎదుర్కొంటారని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. అసలు తమ బంధం నిజంగానే ఏకపక్షంగా ఉందా? దీన్ని గుర్తించడం ఎలా? తెలుసుకుంటే..


భాగస్వామితో సన్నిహితంగా ఉన్న తర్వాత కూడా  ఇద్దరి మధ్య బంధం అంత ఆరోగ్యకరంగా ఉండకపోవడం.  

ఇద్దరి మధ్య ఏవైనా మాటలు ఉంటాయి. కానీ ఆ మాటల్లో ప్రేమ గురించి, ఇద్దరి మధ్య ఉన్న ఆప్యాయత, అన్యోన్యత గురించి, లేదా భవిష్యత్తు గురించి లోతైన సంభాషణలు ఏమీ ఉండవు.


రిలేషన్ లో ఉన్న వ్యక్తి పైకి భాగస్వామిగా ఉన్నా ప్రతిసారీ తన భాగస్వామి హృదయం  గాయపడే విధంగా మాట్లాడటం,  తప్పులు చేయడం జరుగుతుంది.  ఇవన్నీ చేసి ఆ తరువాత   క్షమాపణలు చెప్పడం లాంటి ట్రిక్స్ ప్లే చేస్తారు.


ఏకపక్షంగా సాగుతున్న రిలేషన్ లో ఉన్న వ్యక్తులు ఎప్పుడూ ఇన్ సెక్యురిటీ ఫీల్ అవుతూ ఉంటారు. లైఫ్ పార్టర్నర్ గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. ఇద్దరి మధ్య బంధం పదునవ్వడానికి,  ఇద్దరి మధ్య ప్రేమ పెరగడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి తరువాత విఫలమవుతూ ఉంటారు.


ఇలా జరిగితే ఏమవుతుంది?


 ఏకపక్షంగా సాగే ఈ రిలేషన్ వల్ల  బంధం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసే భాగస్వామి ఎల్లప్పుడూ ఆందోళనకు గురవుతూ ఉంటారు.  వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. తమ ప్రమేయం లేకుండా జరుగుతున్న తప్పులకు దోషులుగా మారడం వల్ల తమ మీద తమకు నమ్మకం పోవడమే కాదు..  ప్రేమ మీద నమ్మకం కూడా కోల్పోతారు. తమలో లోపాలు వెతుక్కోవడం మొదలుపెడతారు.


ఇలాంటి ఏకపక్ష రిలేషన్ లు  వ్యక్తి ఆరోగ్యాన్ని చాలా దారుణంగా దెబ్బతీస్తాయి. తమ భాగస్వామి తమతో సంతోషంగా ఉంటే చాలనే  ఆలోచనల వల్ల తమను తాము దోషులుగా నిలబెట్టుకుంటారు.  ఇలా మెల్లిగా వారు బలహీనులుగా మారిపోతారు.  ఆందోళన,  నిద్రలేమి,  కళ్ల కింద నల్లని వలయాలు, ఆహారం, ఆరోగ్యం మీద శ్రద్ద లేకపోవడం వంటి వాటివల్ల ముఖం డల్ గా మారిపోతుంది.  ఇది క్రమంగా వారిని డిప్రెషన్ లోకి నెట్టివేస్తుంది.

                                                             *రూపశ్రీ.

By
en-us Political News

  
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది,  ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం..
పెళ్లి ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వేడుక. భారతీయులకు అయితే పెళ్లి అనేది జీవితంలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు.  కానీ నేటికాలంలో ఆ వైవాహిక బంధం మసకబారింది. కొత్తగా పెళ్లైనవాళ్లు ఏడాది కూడా గడపకుండానే...
ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో విజయవంతంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. దీనికి మంచి విద్య, మంచి విలువలు చాలా అవసరం. ఇవన్నీ ఉన్నా సరే.. కొంతమంది అమ్మాయిలు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు...
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా..
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా..
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే...
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.