వయనాడ్‌లో ప్రియాంక ఓడిపోతారా?

Publish Date:Jun 15, 2024

Advertisement

కేరళలోని వయనాడ్ పార్లెమెంట్ నియోజకవర్గం నుంచి ప్రియాంకా వధేరా ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నారట. ఇది చాలా అద్భుతమైన విషయమని, ప్రియాంకా వధేరా గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గం ఎక్కడికో వెళ్ళిపోతుందని, అందువల్ల వయనాడ్ ప్రజలందరూ ఎగిరి గంతులు వేసి పండగ చేసుకోవాలి అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు.

ఇంతకీ వయనాడ్ నియోజకవర్గానికి ఎందుకు ఉప ఎన్నిక రాబోతోంది? ఎందుకంటే, ఇక్కడ నుంచి ఎన్నికైన రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేయబోతున్నారు కాబట్టి. రాహుల్ గాంధీ ఈసారి ఎన్నికలలో తన కుటుంబ నియోజకవర్గమైన ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయబరేలి నుంచి కూడా పోటీ చేసి గెలిచారు. గత ఎలక్షన్స్.లో అమేథీ నుంచి ఓడిపోయినట్టుగానే  ఇక్కడ కూడా ఓడిపోతానేమోనే భయంతో సేఫ్ సైడ్‌గా తనకు గతంలో్ విజయాన్ని ఇచ్చిన వయనాడ్ నియోజకవర్గంలో కూడా పోటీ చేశారు. రెండు నియోజకవర్గాల్లో పో్టీ చేసేవారిని ఓడించాలనే జ్ఞానం తెలంగాణలోని కామారెడ్డి ఓటర్లకు బాగా వుంది. అందుకే, కామారెడ్డిని తమ రెండో స్థానంగా ఎంచుకుని పోటీ చేసిన కేసీఆర్, రేవంత్‌రెడ్డిని ఓడించారు. ఈపాటి జ్ఞానం లేకపోవడం వల్ల వయనాడ్ నియోజకవర్గ ప్రజలు రాహుల్ గాంధీని రెండోసారి కూడా గెలిపించారు. అలా గెలిపించిన వయనాడ్‌కి బైబై చెప్పేసి రాహుల్ గాంధీ రాయబరేలి ఎంపీగానే మిగలనున్నారు. వయనాడ్ ప్రజలు ఫీలవకుండా వుండటం కోసం ఉప ఎన్నికలో ఇక్కడ నుంచి ప్రియాంకా రాబర్ట్ వధేరాని నిలపాలని అనుకుంటున్నారు. 

ఇంతకీ రాహుల్ గాంధీ సేఫ్ సైడ్‌గా పోటీ చేయడానికి వయనాడ్ నియోజకవర్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే, వయనాడ్ నియోజకవర్గం ఆంగ్లో ఇండియన్ల ప్రభావం వున్న నియోజకవర్గం. ఇక్కడ ఎక్కువశాతం క్రైస్తవులే వుంటారు. తల్లి వైపు నుంచి క్రైస్తవం వున్న రాహుల్ గాంధీకి ఇంతకంటే సేఫ్ నియోజకవర్గం మరొకటి వుంటుందా? 

రాహుల్ గాంధీని కష్టకాలంలో ఆదుకున్న నియోజకవర్గం వయనాడ్. అలాంటి ఈ నియోజకవర్గం ఒక్కదాంట్లోనే ఈసారి రాహుల్ గాంధీ పోటీ చేసి వుండవచ్చు కదా? అదనంగా రాయబరేలి నుంచి కూడా ఎందుకు పోటీ చేశారు? వయనాడ్‌లో ఓడిపోతానని భయపడ్డారా? అంత నమ్మకంగా తనను గెలిపించిన వయనాడ్ మీద రాహుల్ గాంధీకి ఎందుకు అంత అపనమ్మకం కలిగింది? అలాంటి అపనమ్మకం ఏదో కలిగినప్పుడు, వయనాడ్‌ని వదిలేసి తన కుటుంబ నియోజకవర్గం రాయబరేలి ఒక్కదాంట్లోనే పోటీ చేసినట్టయితే, వయనాడ్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖర్చుల ప్రజాధనం వృధా కాకుండా వుండేది కదా? వయనాడ్‌ నియోజకవర్గం  ఆటలో అరటిపండు నియోజకవర్గంలాగా దేశం ముందు నిలబడి వుండేది కాదు కదా? 

ఇంతా చేసి, ఇప్పుడు మళ్ళీ వయనాడ్ నియోజకవర్గానికి ప్రియాంకని పంపించాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది. తమను అవమానించిన రాహుల్ గాంధీ కుటుంబ సభ్యురాలినే మరోసారి గెలిపించాల్సిన అవసరం వయనాడ్ నియోజకవర్గానికి ఏముంది? రాహుల్ గాంధీ చేసిన పనికి మనసులో కోపం పెట్టుకున్న వయనాడ్ ఓటర్లు ఈసారి ఉప ఎన్నికలో ప్రియాంకని ఓడించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.