సోమరులను చేయకండి.. ముఖ్యమంత్రికి వాలంటీర్ వాత 

Publish Date:Sep 4, 2021

Advertisement

ముఖ్యమంత్రి గారు దయచేసి, పనికిరాని, ప్రయోజనం లేని పథకాలు తీసుకొచ్చి,ప్రజలను సోమరిపోతులను చేయకండి, అది మంచిది కాదు.. ఇది ఏ ప్రతిపక్ష నాయకుడో చేసిన విజ్ఞప్తో, విమర్శో కాదు. ముఖ్యమంత్రి మానస పుత్రిక, గ్రామ వాలంటీర్ వ్యవస్థలో పనిచేసిన అనుభవంతో, ఒక గ్రామ వాలంటీర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేసిన విజ్ఞప్తి. శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌ పేట మండలం రావిచెంద్రి గ్రామ సచివాలయానికి చెందిన గ్రామ వాలంటీరు చిట్టివలస కృష్ణ ఆవేదన తమ వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పెట్టిన లేఖ వైరల్‌ అయింది.

నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాలు, ఎన్నికల విజయాలు లక్యంె గా. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భగంగా అమలు చేస్తున్న నవరత్నాలు సహా వివిధ సంక్షేమ పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారం కావడం మాత్రమే కాకుండా, ప్రజలలో సోమరితనాన్ని పెంచుతున్నాయని ఎప్పటినుంచో ఇటు ప్రతిపక్ష పార్టీలు అటు రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే,ఒంటెద్దు పోకడలకు అలవాటుపడిన జగన్ రెడ్డి ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోలేదు. అప్పులు చేసి మరీ ప్రజల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు బదిలీ చేస్తూ వస్తోంది. దానితో, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పాట్లు తప్పి, రాష్ట్రం అప్పుల ఊబిలో కురుకు పోయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రజల నెత్తిన ఉన్న తలసరి అప్పు లక్ష రూపాయలను దాటి పోయింది. అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదని, త్వరలోనే రాష్ట్ర దివాలా తీయడం ఖాయమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. 

అలాగని  సంక్షేమ పథకాలు వద్దని కాదు, ప్రజల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత, అందులో మరో అభిప్రాయం లేదు. అయితే, ఎట్లో పారేసినా ఎంచి పారేయాలని, అంటారు. గీత దాటి, సంక్షేమమే సర్వస్వం అన్నట్లుగా పేదప్రజలు శాశ్వతంగా చేయిచాపే విధంగా చేయడం మాత్రం సమర్ధనీయం కాదు. సంక్షేమ ఫలాలు అందుకునే వారు,ఎంతోకొంత కాలానికి తమ కాళ్ళ మీద తాము నిలబడేలా పథకాలు ఉండాలే కానీ, ఎప్పటికీ పేదలు పేదలుగానే ఉండేలా, ఉంచేలా పథకాలు ఉండకూడదు.  నిజానికి, సంక్షేమ పథకాల లక్ష్యం కూడా అదే. అందుకే రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్ల విషయంలో కూడా పదేళ్ళ కాలపరిమితిని విధించారు. అయినా  ఇప్పటికీ, రిజర్వేషన్లు, రిజర్వేషన్ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల లక్ష్యం, నిర్వచనం పూర్తిగా మార్చివేసింది. సంక్షేమ పథకాల అసలు లక్ష్యం పేదరిక నిర్మూలన,కానీ, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం పేదరికాన్ని పెంచి,  ఓటు బ్యాంక్’ను సుస్థిరం చేసుకునేందుకు, సక్షేమ పథకాలను ఉపయోగించుకుంటున్నారు. ఆలోచన రహితంగా అమలు చేస్తున్న సంక్షేమా పథకాల వలన,అర్హులైనా పేదల కంటే, అర్హతలు లేని అస్మదీయులు, అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు.ఇదే  విషయాన్ని, వాలేంటీర్ కృష్ణ తమ లేఖలో పేర్కొన్నారు.పదెకరాల భూములు ఉన్నవారికి పింఛను అందుతోంది,కానీ నిరుపేదలు కొందరు పింఛనుకు దూరమయ్యారు. అలాగే, ఆయన తమ లేఖలో, సమస్యల మీద దృష్టిసారించి, యువతకు మంచి ఉద్యోగాలు కల్పించే దిశగా ఆలోచించాలి. నిత్యావసర సరకుల ధరలు తగ్గించాలని చక్కని సూచన కూడా చేశారు. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానసిక పుత్రిక గ్రామ వలెంటీర్ వ్యవస్థ అవినీతి మయం అయిందని సొంత పార్టీ ఎమ్మెల్యేలే విమర్శలు చేస్తున్నారు. సో .. ముఖ్యమంత్రి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుచేసి వాలంటీర్ వ్యవస్థ మీద పునరాలోచాన చేయవలసిన అవసరం ఉందని అధికార వైసీపీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.
 

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.