Publish Date:Feb 24, 2012
వరంగల్: వరంగల్ జిల్లా రాజకీయ చరిత్రలో స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గానికి ఒక విశిష్టస్థానం ఉంది. ఈ స్టేషన్ ఒక్క బిజెపికి తప్ప ప్రధాన రాజకీయ పార్టీలన్నింటికీ ప్లాట్ ఫారంగా నిలిచింది. ఇక్కడినుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టినవారిలో ముగ్గురికి క్యాబినెట్ లో బెర్త్ లు లభించాయి. ఒకేస్థానం నుంచి ముగ్గురు మంత్రులు అయిన ఘనత ఒక్క స్టేషన్ ఘనపూర్ కే దక్కుతుంది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఆవిర్భావం తరువాత 1957లో బి. కేసవరెడ్డి (కాంగ్రెస్) మొదటిసారిగా గెలిచారు. 1962లో కమ్యూనిస్టుపార్టీ పక్షాన ఎస్ సివిమోహనరావు గెలుపొందారు.1967లో స్వాత్రంత్య అభ్యర్ధిగా లక్ష్యారెడ్డి గెలిచారు. 1972లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, జిల్లా రాజకీయాలను శాసించిన టి. హయగ్రీవాచారి ఈ నియోజకవర్గంనుంచే అసెంబ్లీలో అడుగుపెట్టి మంత్రి పదవిని అలంకరించారు. ఇది ఎస్సీలకు రిజర్వు అయిన తరువాత 1978, 1983 ఎన్నికల్లో రెండు సార్లు గోకా రామస్వామి కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచి మంత్రివర్గంలో మత్య్సశాఖ మంత్రిగా స్థానం పొందారు. 1985లో టిడిపి ,మొదటిసారిగా స్టేషన్ లో పాగావేసింది. అసెంబ్లీకి వెళ్లడానికి బి. రాజయ్యకు ఓటర్లు గ్ర్రీన్ సిగ్నల్ ఇచ్చారు.1989 ఎన్నికల్లో పరిస్థితి తల్లక్రిందులైంది. తిరిగి కాంగ్రెస్ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్దిగా భువనగిరి ఆరోగ్యం ఎన్నికయ్యారు.1994లో నియోజకవర్గం ప్రజలు టిడిపి సైకిల్ ను తిరిగి స్టేషన్ కు రానిచ్చారు. 1999లో సైతం ఇదేజరిగింది. ఈ రెండుసార్లు కడియం శ్రీహరి విజయం సాధించి మంత్రి పదవులు పొందారు. అయితే 2004 ఎన్నికల్లో టిఆర్ ఎస్ ప్రభంజనంలో భాగంగా ఆ పార్టీ అభ్యర్ధి విజయరామారావు ఈ నియోజకవర్గంలో గెలిచి మంత్రి పదవిని పొందారు. 2008లో ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన ఉదాశీన వైఖరికి నిరసనగా టి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో ఉపఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో విజయరామారావుపై కడియం శ్రీహరి గెలిచారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన టి. రాజయ్య గెలుపొందారు. ఇదే ప్రత్యేక తెలంగాణా అంశం నేపధ్యంగా ఆయన తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో అప్పుడు మళ్ళీ స్టేషన్ కు ఉపఎన్నిక అనివార్యమైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/warangal-24-12151.html
Publish Date:Oct 10, 2026
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు