గన్నవరంలో వార్ వన్ సైడేనా? వంశీ ఓటమి ఖాయమేనా?

Publish Date:Aug 30, 2023

Advertisement

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ సీటు తెలుగుదేశం ఖాతాలో పడటం ఖాయమన్న చర్చ నియోజకవర్గంలో సూపర్ స్పీడ్‌తో సవారీ చేస్తోంది. వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావ్.. తెలుగుదేశంలోకి జంప్  చేయడంతో , తెలుగుదేశం అభ్యర్థిగా యార్లగడ్డ విజయం  దాదాపుగా ఖాయమైందనే ఓ టాక్  స్థానికంగా వైరల్ అవుతోంది.  మరోవైపు గన్నవరం నియోజకవర్గంలోని వైసీపీ కీలక నేత దుట్టా రామచంద్రరావు తీరు ఎవరికీ అంతు బట్టని విధంగా ఉండడంతో.. ఆయన వ్యవహారశైలితో ఆ పార్టీ అధిష్టానానికి కొత్త తల నొప్పులు మొదలైయ్యాయనే ఓ చర్చ హల్‌చల్ చేస్తోంది. 

ఎందుకంటే గత ఎన్నికల్లో అంటే 2019లో గన్నవరం నుంచి  తెలుగుదేశం అభ్యర్థిగా  గెలిచిన వల్లభనేని వంశీ.. జగన్ ముఖ్యమంత్రి కావడంతో.. ఆయన పార్టీలోకి వెళ్లిపోయారు. అయితే గతంలో అంటే.. 2014 ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి వల్లభనేని వంశీ  తెలుగుదేశం అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థి దుట్టా రామచంద్రరావుపై గెలుపొందారు. నాటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో.. దుట్టా రామంచంద్రరావుతోపాటు ఆయన వర్గాన్ని.. ఎమ్మెల్యే వంశీ  అండ్ కో ఓ రేంజ్‌లో ఆట ఆడుకొన్నారు.

నాడు వల్లభనేని వంశీ అరాచకాలపై అప్పుడే ప్రతిపక్ష నేత జగన్‌కి దుట్టాతోపాటు ఆయన వర్గం ఫిర్యాదు చేసింది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత .. అతడి సంగతి చూద్దామంటూనే.. వంశీ విషయాన్ని పక్కన పెట్టేశారు జగన్. అంతలో 2019 ఎన్నికలు రావడం.. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా మళ్లీ వంశీ  విజయం సాధించడం ఆ వెంటనే  జగన్ పార్టీలో చేరిపోవడం... చకచకా జరిగిపోయాయి. 

కానీ దుట్టా రామచంద్రరావుకే కాదు.. యార్లగడ్డ వెంకట్రావ్‌కు సైతం   జగన్ ప్రభుత్వం న్యాయం అయితే చేయలేదన్న విషయం అందరికీ తెలిసిందే. మరోవైపు ఫ్యాన్ పార్టీని స్థాపించిన నాటి నుంచి ఆ పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న వారికెవరికీ న్యాయం జరగడం లేదని యార్లగడ్డ వెంకట్రావ్..తన అనుచరలతో జరిపిన ఆత్మీయ సమావేశంలో దుట్టా రామచంద్రరావు అంశాన్నే సోదాహరణగా వివరించారు. ఆ వెంటనే యార్లగడ్డ వెంకట్రావ్  సైకిల్ పార్టీలోకి జంప్ కొట్టేశారు. 

దీంతో యార్లగడ్డ వెంకట్రావ్ అడుగులో అడుగు వేసి దుట్టాతోపాటు ఆయన వర్గం సైతం సైకిలెక్కేయడం ఖాయమని జగన్ భావించారు. ఆ క్రమంలో దుట్టాతోపాటు ఆయన ఫ్యామిలీతో సీఎం వైయస్ జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో దుట్టా రామచంద్రరావు కొంత మెత్తబడ్డట్లే కనిపించినా.. ఆ తర్వాత ఆయన సైతం తన ప్రయత్నాలు తాను చేసుకోవడం ప్రారంభించారు. ఈ విషయాన్ని పసిగట్టిన వైసీపీ  అగ్రనాయకత్వం..   మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరిని రంగంలోకి దింపింది. అందులో భాగంగా దుట్టాతో వల్లభనేని వంశీ మంతనాలు జరిపినా.. ఫలితం లేకుండా పోయింది.  

 గతంలో ఎమ్మెల్యే వంశీతోపాటు ఆయన వర్గం పెట్టిన ఇబ్బందుల కారణంగా.. రానున్న ఎన్నికల్లో ఆతడి విజయం కోసం పని చేయడం తమ వల్ల కాదని.. దుట్టా వర్గం ఇప్పటికే క్లియర్ కట్‌గా ఎంపీ వల్లభనేని బాలశౌరితో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 

ఇటువంటి పరిస్థితుల్లో దుట్టా వర్గం కూడా... రేపో మాపో తెలుగుదేశం గూటికి చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయని..అదే జరిగితే  గన్నవరంలో వార్ వన్ సైడేననీ.. తెలుగుదుశం విజయం గ్యారంటీ అనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఓ వేళ దుట్టాతోపాటు ఆయన వర్గం ఫ్యాన్ పార్టీలోనే ఉన్నా.. ఆ పార్టీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ బరిలోకి దిగితే మాత్రం.. యార్లగడ్డ గెలుపునకే పని చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి. 

By
en-us Political News

  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.