బిర్సా ముండా హాకీ స్టేడియం.. నవీన్ పట్నాయక్- బీజేపీ మధ్య చిచ్చు!?
Publish Date:Jan 7, 2023
Advertisement
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వివాదాలకు దూరంగా ఉంటారు. తన పని తాను చేసుకుపోతూ ఉంటారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా ఆయన పని తీరు ఉండటంతో జనం మెచ్చిన సీఎంగా పాతికేళ్లుగా ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన పార్టీ బిజూ జనతాదళ్(బీజేడీ) ఓటమి ఎరుగని పార్టీగా గుర్తింపు పొందింది. గుజరాత్ లో బీజేపీ సర్కార్ తరువాత సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న పార్టీగా బీజేడీ నిలుస్తుంది. పాతికేళ్లయినా రాష్ట్రంలో ఆ పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకత లేదు. పైపెచ్చు అభిమానం రోజు రోజుకూ పెరుగుతోంది. నవీన్ పట్నాయక్ వివాదరహితుడిగా పేరొందారు. అటువంటి నవీన్ పట్నాయక్ కు బీజేపీతో పేచీ వచ్చింది. అయితే ఈ పేచీకి కారణం రాజకీయం కాదు.. ఓ హాకీ స్టేడియం. ఔను హాకీ స్టేడియమే బీజేపీ, బీజేడీ మధ్య మాటల మంటలను రగిల్చింది. ఈ నెల 13 నుంచీ ఎఫ్ఐహెచ్ ఒడిశా మెన్స్ వరల్డ్ హాకీ కప్ టోర్నీ జరగనుంది. వరల్డ్ హాకీ కప్ టోర్నీ కోసం రూర్కెలాలో నవీన్ పట్నాయక్ సర్కారు అత్యాధునిక బిర్సా ముండా హాకీ స్టేడియం నిర్మించింది. ఇదే ప్రపంచంలో అతి పెద్ద హాకీ స్టేడియం అంటూ ఒరిస్సా సర్కారు భారీఎత్తున ప్రచారం చేసుకుంటోంది. అయితే ఈ ప్రచారం ఎందుకో బీజేపీకి రుచించలేదు. దీంతో నవీన్ పట్నాయక్ సర్కార్ ప్రచారాన్ని తిప్పి కొడుతోంది. ప్రతిష్ఠాత్మ టోర్నీకి ముందు ఈ స్టేడియం బీజేపీ, బీజేడీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. బిర్సా ముండా హాకీ స్టేడియం ప్రపంచంలో నాలుగో పెద్ద స్టేడియం మాత్రమేనని బీజేపీ గట్టిగి చెబుతుండగా, టర్నేషనల్ హాకీ ఫెడరేషనే బిర్సా ముండా స్టేడియంను ప్రపంచంలో అతిపెద్ద హాకీ స్టేడియంగా గుర్తించి సర్టిఫికెట్ సైతం ఇచ్చిందని ఒడిస్సా సర్కారు వాదిస్తోంది. అసలింతకీ స్టేడియం విషయంలో బీజేపీ ఎందుకు ఇంతగా స్పందింస్తోందన్న దానికి మాత్రం.. అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం కారణమని అంటున్నారు. మొతేరాలోని సర్దార్ వల్లభాయ్ పటేస్ స్టేడియంను ఆధునీకరించి, 1.3లక్షల మంది కెపాసిటీతో నిర్మించి దానికి నరేంద్రమోడీ పేరు పెట్టారు. ఈ స్టేడియం 2020లో పూర్తయ్యింది. ఈ స్టేడియంకు ముందు వరకూ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) 90 వేల సీటింగ్ కెపాసిటీతో ప్రపంచంలోనే అతి పెద్దదిగా ఉండేది. దాని రికార్డును నరేంద్ర మోడీ స్టేడియం బద్దలు కొట్టి ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందింది. అందుకే ఇప్పుడు ఒడిశా సర్కార్ ప్రపంచంలోనే అతి పెద్ద హాకీ స్టేడియంను నిర్మించామని చెప్పుకోవడం బీజేపీకి రుచించడం లేదు. అందుకే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ బిర్సాముండా హాకీ స్టేడియంను ప్రపంచంలోనే పెద్ద హాకీ స్టేడియంగా గుర్తించినా అంగీకరించడానికి బీజేపీ ససేమిరా అంటోందని బీజేడీ చెబుతోంది.
http://www.teluguone.com/news/content/war-of-words-between-bjd-and-bjp-on-birsa-munda-hockey-stadium-39-149692.html





