అధికార విపక్షాలకు వక్ఫ్ పరీక్ష !

Publish Date:Mar 31, 2025

Advertisement

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. మరో నాలుగు రోజుల్లో  అంటే ఏప్రిల్ 4 తో ఈ సమావేశాలు ముగుస్తాయి. అయితే,ఇంతవరకు జరిగిన కథ ఒకెత్తు  అయితే ఈ చివరి నాలుగు రోజుల కథ మరొక ఎత్తు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అవును  ఇటు అధికార ఎన్డీఎ కూటమి, అటు విపక్ష ఇండియా  కూటమి నాయకులు  వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు  విషయంలో పట్టు బిగిస్తున్నారు. ఇంతదాక ఒక లెక్క ఇక పై మరో లెక్క అంటున్నారు. ఒకరు గెలుస్తాం అంటుంటే  మరొకరు అదే జరిగితే అల్లకల్లోలమే అని హెచ్చరిస్తున్నారు. 

నిజానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు నుంచీ వివాదాస్పద వక్ఫ్‌ సవరణ బిల్లు అంశం  రాజకీయ వర్గాల్లో, రాజకీయ చర్చల్లో రగులుతూనే వుంది. ఎంఐఎం సహా అనేక ముస్లిం సంస్థలు, రాజకీయ పార్టీలు వక్ఫ్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.  మరోవంక  ఎన్డీఎ ప్రభుత్వం, తగ్గేదే లే అంటోంది. పద్దతిగా  పనిచేసుకు పోతోంది. గతంలో విపక్షాల డిమాండ్ చేసిన విధంగా  వక్ఫ్‌ సవరణ బిల్లు పై ఏర్పాటు చేసి  జేపీసీ ఇచ్చిన నివేదికను  సవరణలతోసహ  కేంద్ర మంత్రి వర్గం  ఫిబ్రవరిలో ఆమోదించింది. అప్పుడే  బడ్జెట్ సమావేశాల్లో  వక్ఫ్‌ సవరణ బిల్లును ప్రవేశ పెట్టాలనే నిర్ణయం జరిగిపోయింది. మరో వంక ఇప్పుడు తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత షా, గత శుక్రవారం  ప్రభుత్వం వక్ఫ్‌ సవరణ బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే ప్రవేశ పెడుతుందని  స్పష్టం చేశారు.  

ఈ నేపథ్యంలో ఇప్పడు దేశ  రాజకీయ, మీడియాలో  సవరణ బిల్లుకు ఎవరు అనుకూలం, ఎవరు వ్యతిరేకం అనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్డీఎ భాగస్వామ్య  పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అనే విషయంలో రాజకీయ వర్గాల్లోనే కాదు  సామాన్య జనంలోనూ ఉత్కంఠ వ్యకమవుతోంది. ఆసక్తికర చర్చ జరుగుతోంది.

వక్ఫ్ బిల్లును ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్న నేపధ్యంలో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఆక్సిజన్ అందిస్తున్న తెలుగుదేశం, జనతాదళ్ యునైటెడ్ (జేడీయు), జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్),లోక్ జనశక్తి(ఎల్జీపీ) రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ), ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అనేది ఆసక్తి కరంగా మారింది.  ముఖ్యంగా ఈ సంవత్సరం చివర్లో ఎన్నికలు జరగనున్న బీహార్ లో ముస్లిం సమాజం నుంచి ముఖ్యమంత్రి నితీష్ కుమార్  పై ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్  ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందును బహిష్కరించడంద్వారా ప్రధాన ముస్లిం సంస్థలు జేడీయు పట్ల తమ అసంతృప్తి స్పష్టంగా వ్యక్తం చేశాయి. ఒక విధంగా చూస్తే  ఇఫ్తార్ విందును బహిష్కరించడం ద్వారా ముస్లిం సంస్థలు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు అటో ఇటో తెల్చుకోమని  అల్టిమేటం ఇచ్చాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

అయితే ముస్లిం సంస్థలతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపిం చట్ట సవరణకు ఒప్పించినట్లు  జేడీయు వర్గాలు చెపుతున్నాయి. తాజాగా  ఆదివారం (మార్చి 30) న రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంమక్షంలో  బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్  గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయనని, ఎన్డీఎ, మోదీ  చేయి’ వదలనని, చేతిలో చెయ్యేసి చెప్పినట్లు  చెప్పినట్లు వార్తలొచ్చాయి. అలాగే  ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులకు సంపూర్ణ రక్షణ కల్పిస్తామని  గట్టి హామీ ఇచ్చారు. మిగిలిన ఎన్డీఎ భాగసామ్య పక్షాలు బిల్లుకు మద్దతు తెలిపే విషయంలో కొంచెం అటూ ఇటుగా ఉన్నా, బిల్లును వ్యతిరేకించక పోవచ్చునని అంటున్నారు.  అయితే, అంత మాత్రం చేత ఎన్డీఎలో అంతా బాగుందని కాదు కానీ బిల్లు గట్టెక్కుతుందని బీజేపీ వర్గాలు విశ్వాసంతో ఉన్నాయి.

మరో వంక  ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు కూడా అటూ ఇటూ తేల్చుకోలేకుండానే  ఉన్నాయని అంటున్నారు. నిజానికి  ఇండియా కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలోనూ వక్ఫ్  బిల్లు విషయంలో ఏకాభిప్రాయం లేదని అంటున్నారు. అందుకే  ఇండియా కూటమి పార్టీలు వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయినా ఇటు అధికార ఎన్డీఎ కూటమికి అటు విపక్ష ఇండియా కూటమికి వక్ఫ్ బిల్లు పే..ద్ద.. పరీక్ష.. అంటున్నారు.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.