వక్ఫ్ బిల్లుకు లోక్ సభ ఆమోదం!

Publish Date:Apr 3, 2025

Advertisement

 కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రతిపాదించి, ప్రవేశపెట్టిన  వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. దీనిపై బీఏసీలో ఎనిమిది గంటల చర్చకు అంగీకారం కుదిరినప్పటికీ, అధికార, విపక్ష కూటముల మధ్య తీవ్ర వాగ్వివాదాలలో చర్చ సుదీర్ఘంగా సాగింది. దాదాపు  12 గంటలకు పైగా చర్చ జరిగింది.  చర్చ అనంతరం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ చేపట్టారు. ఈ ఓటింగ్ లో బిల్లుకు అనుకూలంగా 288 మంది సభ్యులు, వ్యతిరేకంగా 232 మంది ఓటు వేశారు. దీంతో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు లోక్ సభ ఆమోదం పొందినట్లుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. 

వాస్తవానికి ఈ బిల్లును గతంలోనే  కేంద్రం ప్రతిపాదించింది. అప్పట్లో ఈ బిల్లులోని కొన్ని అంశాలపై పలు పార్టీల సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ బిల్లులో సవరణల కోసం జేపీసీని నియమించింది. పలు దఫాలుగా భేటీలు నిర్వహించిన జేపీసీ ఆయా పార్టీలు చేసిన సూచనలలో కొన్నిటిని ఆమోందింది. ఈ సవరణలలో తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన నాలుగు సవరణలకు గాను జేపీసీ మూడింటిని ఆమోదించింది.  అనంతరం వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం గురువారం (ఏప్రిల్ 2) లోక్ సభలో ప్రవేశ పెట్టింది. ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ చేపట్టగా ఎన్డీయే పక్షాలన్నీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశాయి. దీంతో బిల్లు లోక్ సభ ఆమోదం పొందింది.

అయితే ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవలసిన అవసరమేంటంటే.. వైసీపీ సభ్యులు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పార్టీ కాకపోయినప్పటికీ ఇప్పటి వరకూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన వైసీపీ తొలి సారిగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక రాజ్యసభలో వైసీపీ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే బిల్లు ఆమోదం విషయంలో ఒకింత ఇబ్బందులను కేంద్ర సర్కార్ ఎదుర్కొనే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. అలాగే అనూహ్యంగా ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా ఏకతాటిపై నిలబడి లోక్ సభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేశాయి.  

By
en-us Political News

  
అనీల్ కుమార్ యాదవ్.. పరిచయం అక్కర్లేని పేరు. జగన్ హయాంలో ఓళ్లూపై తెలియకుండా మాట్లాడి, తొడకొట్టి సవాళ్లు విసిరి పాపులర్ అయ్యారు. ప్రత్యర్థులపై నోరెట్టుకుని పడిపోవడమే రాజకీయం అన్నట్లుగా అప్పట్లో ఆయన వ్యవహార శైలి ఉండేది. ఆ తీరు కారణంగానే జగన్ కు దగ్గరయ్యారనీ చెబుతుంటారు. సరే అది పక్కన పెడితే వైసీపీ ఘోర పరాజయం తరువాత అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడా కనిపించలేదు. వినిపించలేదు. మౌనంగా మాయమైపోయారు.
జగన్ మీడియా అసత్య కథనాలపై దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి ఏలూరు జిల్లా మీడియా కార్యాలయంలో వద్ద  నిరసన చేపట్టారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి  ఆఫీస్‌ ముందు టెంట్ వేసుకోని నిరసన వ్యక్తం చేశారు. బాధితుల రక్త తర్పణం’ అంటూ జగన్ మీడియా కథనాన్ని ప్రచురించింది. బాధితుడి పక్షాన వార్త ప్రచురించినందుకు  వాస్తవాలు తెలుసుకోకుండా ఏ విధంగా రాస్తారంటూ  రిపోర్టర్‌పై చింతమనేని ఫైర్‌య్యారు. దాసరి బాబురావు అనే బాధితుడు బ్లేడుతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాధితుడి అండగా చింతమనేని బాధితుల రక్త తర్పణం’ అంటూ జగన్ మీడియా కథనాన్ని ప్రచురించింది
బూరగడ్డ అనిల్ అనంతపురం జైలులోనే ఈ నెల 30 వరకూ ఉంచాలని మొబైల్ కోర్టు న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. అలాగే ఈ నెల 30 వరకూ బోరుగడ్డ అనిల్ ను రాజమండ్రి తరలించకుండా అనంతపురం జిల్లా జైలులోనే రిటైన్ చేయాలని ఆదేశించారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. బూరగడ్డ అనిల్ ను రాజమహేంద్రవరం జైలు నుంచి పీటీ వారంట్ పై అనంతపురం తీసుకు వచ్చారు.
జమ్మూ కశ్మీర్ పహల్‌గామ్ ఉగ్ర దాడికి వ్యతిరేకంగా ట్యాంక్‌బండ్ వద్ద కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతల నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉగ్రవాదానికి, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ధ మృతులను స్మరిస్తూ నివాళులు అర్పించారు. ఉగ్రవాదానికి, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ధ అమరులను స్మరిస్తూ నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ పెహల్గం ఉగ్రదాడిని సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ దాడి సిగ్గుమాలిన చర్యగా సమాజం చూస్తోందన్నారు
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. కోర్టు ఇచ్చిన కస్టడీ ఉత్తర్వులను సెంట్రల్ జైలు అధికారులకు అందించి.. కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల కస్టడీ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ప్రత్యేక వాహనంలో గోరంట్ల మాధవ్‌ను తీసుకుని ఎస్కార్ట్ సిబ్బంది గుంటూరుకు బయలుదేరి వెళ్లారు. రిమాండ్‌ ఖైదీగా ఉన్న గోరంట్లను ఇవాళ, రేపు గుంటూరు పోలీసులు కస్టడీ తీసుకున్నారు.
ఏ దేశ మేగినా, ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం, అన్నారు తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు. కానీ, దేశానికి ముగ్గురు ప్రధానులను ఇచ్చిన, నెహ్రూ గాంధీల కుటుంబం నాలుగో తరం నేత రాహుల్ గాంధీ, అందుకు పూర్తి విరుద్ధంగా ఏదేశం వెళ్ళినా, భారత దేశాన్ని అవమానించడం, అవహేళన చేయడం అలవాటుగా చేసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.
జమ్మూ కశ్మీర్‌  పహల్‌గామ్ ఉగ్ర దాడి బాధితులను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పరామర్శించారు. తమ ఆప్తులను కోల్పోయిన వారు ఆ ఘటలను అమిత్‌షాతో పంచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. విహారయాత్రకు వస్తే తమ వారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారంటూ వారు రోదించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. బాధితులను ఓదార్చలేక అమిత్‌షా సైతం మౌనంగా ఉండిపోయారు. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బుధవారం శ్రీనగర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దకు హెలికాప్టర్ లో చేరుకున్న అమిత్ షా మృతదేహాల వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. కాల్పుల ఘటన జరిగిన తీరును అమిత్ షా వారిని అడిగి తెలుసుకొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి కేటాయించబోయే రాజ్యసభ స్థానం నుంచి.. పార్లమెంటులో అడుగుపెట్టబోయే అదృష్టవంతుడెవరో దాదాపుగా తేలిపోయిందంటున్నారు. వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎంపీ సీటుని.. బీజేపీకి వదిలేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారన్న ప్రచారం జరుగుతోంది.
మొన్నటిదాకా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి ఏకగ్రీవం అయిపోతారనుకున్నారు. అక్కడ వాళ్లకున్న బలం అలాంటిది. కానీ.. ఎప్పుడైతే బీజేపీ తమ అభ్యర్థిని బరిలోకి దించిందో.. అప్పుడు ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో.. ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి మొత్తంగా 112 మంది ఓటర్లు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును ఏపీ సీఐడీ బేగంపేటలోని ఆయన నివాసంలో అరెస్టు చేసి విజయవాడకు తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సస్సెన్షన్ లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు జగన్‌ హయాంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పని చేశారు.
జమ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం లో మంగళవారం (ఏప్రిల్ 22) జరిగిన దాడిలో ఇద్దరు తెలుగువారు మరణించారు. వారిలో ఒకరు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కాగా మరొకరు విశాఖ వాసి అయిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళిగా గుర్తించారు.
జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడింది తామేనని ప్రకటించడం ద్వారా ది రెసిస్టెన్స్ ఫోర్స్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించడంతో ఆ సంస్థ మరో మారు వార్తలలోకి ఎక్కింది. పహల్గాం ఉగ్ర దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
విశాఖ ఐటీ హిల్ లో టీసీఎస్ కి ఎక‌రా 99 పైస‌ల‌కే ఇవ్వ‌డం క‌రెక్టేన‌ని.. క‌ళ్లు మూసుకుని చెప్పొచ్చు. కానీ కొంద‌రూ వైపీపీయులు దీన్నో భూత‌ద్దంలో పెట్టి చూపెడుతూ త‌ప్పు ప‌డుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.