Publish Date:Apr 30, 2025
నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో పోతిరెడ్డిపాలెం వద్ద ఘోర కారు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్‌లోకి కారు దూసుకెళ్లి ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకట రమణయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా నారాయణ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్‌గా తెలుస్తోంది. పోతిరెడ్డిపాలెం వద్ద కారు బీభత్సం ఘటనలో మృతులు మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న నరేష్, అభిషేక్, జీవన్, యగ్నేష్, అభిసాయిలుగా పోలీసులు ప్రకటించారు. గాయపడిన నవనీత్ అనే విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Publish Date:Apr 30, 2025
విశాఖ జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ అధ్యక్షతన ఈ కమిషన్‌ను నియమించింది. ఇందులో సభ్యులుగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు ఉంటారని పేర్కొంది. అలాగే, ఈ కమిషన్‌కు సివిల్ కోర్టు అధికారాలు కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
Publish Date:Apr 30, 2025
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో అధినేత కేసీఆర్‌కు సభ మొత్తంలో తన పేరు ఎత్తడానికి కూడా ధైర్యం రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం శ్రీమహాత్మ బసవేశ్వర జయంతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నరు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతు 16నెలలుగా కేసీఆర్ ఇంట్లో కూర్చుని జీతం తీసుకుంటున్నారని విమర్శించారు. ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటూ ఇంట్లో నుండి కాలు కదపకుండా అన్ని వసతులు అనుభవిస్తున్నారా అని ప్రశ్నించారు. మీరెవరు? సభకు రాకుండా మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకు ఉందా అని నిలదీశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మొదటి 10 సంవత్సరాలు కోతుల గుంపుకు అప్పజెప్పినట్టు అయిందని మండిపడ్డారు.
Publish Date:Apr 30, 2025
Publish Date:Apr 30, 2025
కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దేశ జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. సామాజిక వర్గాల వారీగా లెక్కలు చేపట్టాలని కాంగ్రెస్ సహ పలు విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Publish Date:Apr 30, 2025
ఏపీ క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనివాస రాజును ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉండనున్నారు. టీటీడీ జాయింట్ ఈవోగా ఎనిమిదేళ్ల పాటు పనిచేసిన ఆయన ఆ తర్వాత రిటైర్డ్ అయ్యారు. ఈవోగా పనిచేయాలని భావించినా అవకాశం రాలేదు.
Publish Date:Apr 30, 2025
హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహించనుండటంపై సీపీఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో తన మేనకోడలికి చెందిన ఓ వాణిజ్య సంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, ఈ విషయంపై మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అందాల పోటీలు నిర్వహించడం ద్వారా పవిత్రమైన స్త్రీ జాతిని అవమానిస్తున్నారని నారాయణ ఆరోపించారు.
Publish Date:Apr 30, 2025
సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న అపశ్రుతిలో ఏడుగురు భక్తులు మరణించిన ఘటనపై మంత్రులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు అధికారులపై ఫైర్ అయ్యారు.
Publish Date:Apr 30, 2025
పహల్గాం ఉగ్రదాడి దేశం మొత్తాని కదిల్చి వేసింది. కుల, మత, ప్రాంత, రాజకీయ విభేదాలకు అతీతంగా ప్రజలందరూ ఉగ్రదాడిని ఖండిస్తున్నారు. పాకిస్థాన్ దుశ్చర్యను ప్రపంచ దేశాలు సైతం ఖండిస్తున్నాయి. మన దేశానికి మద్దతు ప్రకటిస్తున్నాయి. దేశంలోనూ ఎక్కడిక్కడ పాకిస్థాన్ కు వ్యతిరేకంగా స్వచ్చందంగా ప్రజలు ర్యాలీలు నిర్విహిస్తున్నారు.
Publish Date:Apr 30, 2025
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ మధ్యాహ్నాం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఐదు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 92.78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. గురుకులాల్లో 98 శాతం, ఆశ్రమ పాఠశాలల్లో 95 శాతం, ప్రైవేట్ పాఠశాలల్లో 94.12 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
Publish Date:Apr 30, 2025
ఎన్నికల తర్వాత విశాఖలో ఇద్దరు నాయకులు వైసీపీకి గట్టి దెబ్బ కొట్టారు... ఎన్నికల్లో ఓటమి చెందిన వెంటనే క్షణం ఆలోచించకుండా పార్టీ పదవులకు రాజీనామా చేసి వైసీపీకి షాక్ ఇచ్చారు మాజీమంత్రి అవంతి శ్రీనివాస్. వైసిపి నుంచి కార్పొరేటర్ గా గెలిచిన కీలకమైన సమయంలో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసr కోలుకోలేని దెబ్బ కొట్టారు ఆయన కుమార్తె లక్ష్మీ ప్రియాంక.
Publish Date:Apr 30, 2025
కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రత సలహా బోర్డును ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డు ఛైర్మన్‌గా మాజీ రా అండ్ రా చీఫ్ అలోక్ జోషిని ఛైర్మన్‌గా నియమించారు. జాతీయ భద్రతా విషయాల్లో అనుభవం ఉన్న అలోక్ జోషి నాయకత్వంలో ఈ బోర్డు దేశ భద్రతా వ్యూహాలను మరింత బలోపేతం చేయనుంది. ఈ బోర్డులో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు, వీరంతా తమ రంగాల్లో అనుభవజ్ఞులైన రిటైర్డ్ అధికారులు
Publish Date:Apr 30, 2025
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి పెళ్లి వేడుకులు ఘనంగా నిర్వహించారు. నగర శివారు కంకిపాడులో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్ తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు.