వక్ఫ్ బిల్లుకు ఆమోదం.. దేశ రాజకీయాల్లో మలుపు ?

Publish Date:Apr 4, 2025

Advertisement

అనుకున్నదే జరిగింది. వక్ఫ్‌ సవరణ బిల్లు-2024ను, 24 గంటల తేడాతో  పార్లమెంట్ ఉభయ   సభలు ఆమోదించాయి. అర్థరాత్రి ఆమోదం పొందిన బిల్లుల జాబితాలో, వక్ఫ్‌ సవరణ బిల్లు-2024- (యూనిఫైడ్‌ వక్ఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఎంపవర్‌మెంట్‌, ఎఫిషియన్సీ అండ్‌ డెవల్‌పమెంట్‌- యూఎంఈఈడీ-ఉమీద్‌) బిల్లు కూడా చేరింది. అవును. సుదీర్ఘ చర్చ అనంతరం బుధవారం (ఏప్రిల్ 2) అర్ధరాత్రి దాటాక లోక్‌సభ ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుకు, గురువారం (ఏప్రిల్3) అర్థరాత్రి దాటిన తర్వాత రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రపతి ఆమోదం మాత్రమే మిగిలుంది. ఆ ఒక్క గడప దాటేస్తే.. బిల్లు చట్టమవుతుంది. ఆ తర్వాత  ఏమవుతుంది? ముఖ్యంగా దేశ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. దేశ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయి అనేది ఇప్పడు దేశం ముందున్న పెద్ద ప్రశ్నగా రాజకీయ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

ఇక విషయంలోకి వస్తే.. పార్లమెంట్ ఉభయ సభల్లో ఒక బిల్లు పై ఇంత సుదీర్ఘ చర్చ జరగడం ఇటీవలి కాలంలో ఇదే ప్రప్రథమం కావచ్చు. బిల్లుకు అనుకూలంగా అధికార ఎన్డీఎ కూటమి, వ్యతిరేకంగా విపక్ష, ఇండియా కూటమి గట్టిగా నిలబడ్డాయి. పటిష్ట వాదనలు వినిపించాయి. ఉభయ సభల్లోనూ అధికార, ప్రతిపక్ష పార్టీల ముఖ్యనాయకులు అందరూ, చర్చలో పాల్గొన్నారు. ఎవరి అభిప్రాయాలు వారు బలంగా వినిపించారు. అయితే ఇంత సుదీర్ఘంగా జరిగిన చర్చలో లోక్ సభలో సభా నాయకుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పెదవి విప్పలేదు. ప్రధానమంత్రి  మోదీ అయితే అసలు సభలోనే అడుగు పెట్ట లేదు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ  చర్చ ప్రారంభంలో కొంత సేపు సభలో ఉన్నారు. మధ్యలో వెళ్ళిపోయి  మళ్ళీ ఓటింగ్ సమయానికి వచ్చారు. అంతే కాదు  సభలో ఉన్న సమయంలోనూ రాహుల్ గాంధీ ముభావంగానే ఉన్నారు. ఎదుకనో ఏమో కానీ  ప్రధాన చర్చలో పాల్గొనలేదు. లోక్ సభలో   గొగొయ్ ప్రధాన ప్రసంగం చేశారు. చివరకు, అర్థరాత్రి దాటిన తర్వాత ఓటింగ్ సమయానికి వచ్చిన సమయంలోనూ అయన నైట్ డ్రెస్  లో మొక్కుబడిగా సభకు వచ్చారనీ. ఇది ఆయన నిరాసక్తతకు మరో నిదర్శనంగా కొందరు పేర్కొన్నారు. అలాగే  ఇటు చర్చ జరుగుతుంటే.. ఆయన అటు తిరిగి ఫోన్  చూసుకోవడం గురించి కూడా కొందరు ప్రస్తావించారు. చివరకు మీడియా బ్రీఫ్ లోనూ రాహుల్ గాంధీ కనిపించక పోవడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆశ్చర్యం వ్యక్త పరుస్తున్నాయి. 

అయితే  ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరాసక్తంగా ఉన్నా.. విపక్ష ఇండియా కూటమి ఐక్యంగా వుంది. ఏక తాటిపై నడిచింది. ఉభయ  సభల్లోనూ ఒక్క ఓటు బీర పోకుండా కాపాడుకుంది. ఆవిధంగా, బిల్లు పాస్  అయినా.. ఒక విధంగా విపక్ష ఇండియా కూటమి,  విజయం  సాధించింది. కూటమి మనుగడ పట్ల వ్యక్తమవుతున్న అనుమానాలను పటాపంచలు చేస్తూ, కూటమి ఎంపీలు, ముక్త కంఠంతో హమ్ ఏక్’ హై అని  నినదించారు.  నిరూపించారు. 

నిజం, నిజంగా, ఇదొక అనూహ్య పరిణామం. లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బయట పడిన విభేదాల నేపధ్యంలో ఇండియా కూటమి ఉన్నట్లా లేనట్లా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్న సమయంలో ఇండియా కూటమి ఏక తాటిపైకి రావడం సామాన్య విషయం కాదు. నిజానికి ఇటీవల కాలంలో ఇండియా కూటమిలో విభేదాలు తార స్థాయికి చేరిన విషయం కాదన లేనిది. చివరకు కొందరు కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు కూడా  లోక్ సభ ఎన్నికలతోనే ఇండియా కూటమి  కథ ముగిసిందనే అభిప్రాయం వ్యక్త పరిచారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జయరాం రమేష్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ- కశ్మీర్ ముఖ్యమంత్రి, ఒమర్ అబ్దుల్లా ,సిపిఎం నేత ప్రకాష్ కరత్, ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  ఇండియా కూటమి  మనుగడ పై అనుమనాలు వ్యక్త పరిచారు.  తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా, కొందరు ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ కూటమి నాయకత్వం నుంచి తప్పుకోవాలని డిమాండ్ లాంటి సూచన చేశారు.

అంతే కాదు  కొందరు  కూటమి నాయకులు,మీడియా విశ్లేషకులు, ఇండియా కూటమికి  శ్రద్ధాంజలి  ఘటించారు. అలా మనుగడ కోల్పోయిందని కొందరు,  అసలు  పోనే పోయిందని,ఇంకొందరు అనుకున్న ఇండియా కూటమికి వక్ఫ్ సవరణ బిల్లు సంజీవనిలా ప్రాణం పోసిందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే  ఈ ఐక్యత ఇలాగే, నిలుస్తుందా? నిలబడుతుందా? పార్లమెంట్  లోపలి సఖ్యత  వెలుపలా కొనసాగుతుందా? ముఖ్యంగా ఎన్నికల రణ క్షేత్రంలో ఎన్డీఎని ఎదురొడ్డి ఐక్యంగా నిలబడుతుందా? అంటే, మాత్రం అనుమానమే అంటున్నారు. అయినా, ప్రస్తుతానికి  అది అనవసర చర్చగానూ పరిశీలకులు భావిస్తున్నారు.

అదొకటి అయితే.. బిల్లుపై చర్చ సందర్భంగా వ్యక్తమైన అభిప్రాయలు, వినవచ్చిన వాస్తవాలు ఆశ్చర్యం గొలిపే విధంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే  నమ్మసక్యం కాకుండా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా, పార్లమెంట్ భవనంతో సహా, ఢిల్లీ లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం (సీజీవో)  సైతం ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసిందని, స్వయంగా మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రికార్డుల అదారంగా చెప్పిన విషయం,ఆశ్చర్య పరిచే విధంగా ఉందని అంటున్నారు. అంతే కాదు.. వక్ఫ్ పేరిట జరుగతున్న దురాక్రమణలు, దుర్వినియోగం గురించి సభ్యులు చేసిన ఆరోపణ లలోని నిజానిజాలు బయట పడాలంటే,అందుకుమరి కొంత సమయం పడుతుందిని అంటు న్నారు.అందుకే, చట్ట రూపం దాలుస్తున్న  వక్ఫ్ సవరణ బిల్లు దేశ రాజకీయాలలో  ఒక మలు పుకు దారి తీసినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.

By
en-us Political News

  
ప్రశాంత్ కిషోర్, పీకే .. పేరు చాలు. పరిచయం అవసరం లేదు.పీకే అంటే చాలు, ఆయన ఎవరో, ఆయన ఏమిటో అందరికీ అర్థమైపోతుంది. ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకు అంత మంచి గుర్తింపు వుంది.అయితే అది ఆయన గతం. ప్రస్తుతం ఆయన, వేషం మార్చారు. రాజకీయ అరంగేట్రం చేశారు. సో.. ఇప్పడు పీకే పొలిటీషియన్, రాజకీయ నాయకుడు. జన సురాజ్ పార్టీ (జేఎస్పీ) వ్యవస్థాపక అద్యక్షుడు. ఈ సంవత్సరం చివర్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య భూమికను పోషించేందుకు తహతహ లాడుతున్న రాజకీయ నాయకుడు. ఈ ఎనికల్లో ఎలాగైనా కింగ్, కాదంటే కనీసం కింగ్ మేకర్ కావాలని కలలుకంటున్నారు.
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రద్దుపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ, విశాఖపట్నంల మధ్య నడిచే రెండు విమాన సర్వీసులను రద్దు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. విశాఖపట్నం, విజయవాడల మధ్య ఉదయం నడిచే రెండు విమాన సర్వీసులను రద్దు చేయడం వల్ల ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయని గంటా శ్రీనివాసరావు అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై రాజకీయ వైరంతో ప్రత్యర్థి పెట్టించిన 17 కేసులకు సర్వేపల్లి శాసన సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చట్టాన్ని గౌరవించి కోర్టుకు హాజరౌతుంటే.. వీటికి కారణంగా చెబుతున్న ఆయన ప్రత్యర్థి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వేగం పెంచింది. ఓ వైపు ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజా కసిరెడ్డి కోసం గాలింపు చర్యలు చేపడుతూనే, హైదరాబాద్ లోని ఆయన నివాసం కార్యాలయాలలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిలు పిటిషన్ ను విజయవాడ ఎస్సీఎస్టీ కోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్ధం కేసులో ఫిర్యాదు దారు హర్షవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది.
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు. 7.5 కోట్ల రూపాయల విలువైన గుర్గావ్ ల్యాండ్ స్కామ్ వ్యవహారంలో రాబర్ట్ వాద్రాకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
ఒలింపిక్స్‌ పతకం విజేత, ప్రముఖ వెయిట్‌లిఫ్టర్, తెలుగు తేజం కరణం మల్లీశ్వరి ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. హర్యానాలోని యమునానగర్ లో ఈ భేటీ జరిగింది. కరణం మల్లీశ్వరితో భేటీ గురించి ప్రధాని నరేంద్ర మోడీ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయూ కూటమికి బీహార్ లో షాక్ తగిలింది. ఎన్డీయే కూటమి భాగస్వామ్య పార్టీ అయిన రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ ఎన్డీయే నుంచి వైదొలగింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత, కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్ అధికారికంగా ధృవీకరించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటేన ఖరారైంది. వచ్చే నెల 2న ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి పనుల పున: ప్రారంభ శంకుస్థాపనకు ఆయన హాజరు కానున్నారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసానికి ప్రముఖ నటుడు అల్లు అర్జున్ వెళ్లారు. గత కొంత కాలంగా మెగా, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగిందన్న వార్తల నేపథ్యంలో అల్లు అర్జున్ పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనను కలవడం ఇటు రాజకీయవర్గాలలోనూ, అటు సినీ పరిశ్రమ వర్గాలలోనూ ఆసక్తి రేకెత్తించింది.
అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థినులు గాయపడ్డారు. వారిలో ఓ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. టెక్సాస్లోని డెంటన్ సిటీలో శనివారం తెల్లవారు జామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన దీప్తి వంగవోలు, ఆమె స్నేహితురాలు గాయపడ్డారు.
మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిపై చర్యలు తీసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం రెడీ అయ్యింది, ఈ మేరకు ఆయనపై టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఎస్పీ ఎస్పీ హర్షవర్ధనరావుకు ఫిర్యాదు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.