తెలంగాణ రాజకీయాలు.. ఓవర్ టూ ఢిల్లీ !

Publish Date:Apr 4, 2025

Advertisement

తెలంగాణ రాజకీయాలు ఇప్పడు ఢిల్లీ చేరుకున్నాయా?  జంతర్ - మంతర్ నుంచి పార్లమెంట్ వరకు తెలంగాణ రాజకీయాలకు వేదికగా మారుతున్నాయా? అంటే  మంగళవారం (ఏప్రిల్ 1)  దేశ రాజధాని ఢిల్లీ వేదికగా చోటు చేసుకున్న విభిన్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అవును రాష్ట్రంలో రాజకీయ వేడిని పుట్టిస్తున్న బీసీ రిజర్వేషన్, హెచ్‌సీయూ భూమల విక్రయం, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, మంత్రివర్గ విస్తరణకి సంబందించిన అనేక కీలక అంశాలు బుధవారం ( ఏప్రిల్ 2)  ఢిల్లీలో సందడి చేశాయి. 

ఓ వంక లోక్ సభలో అత్యంత కీలకమైన, అంతకు మించి అత్యంత వివాదస్పదమైన వక్ఫ్ సవరణ బిల్లు పై వాడివేడి చర్చ జరుగతున్న సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  జంతర్ మంతర్ నుంచి ‘మోదీ దిగిరావాలని’ డిమాండ్ చేశారు. లేదంటే దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం, దేశాన్ని జాగృతం చేస్తాం, బీజేపీని బూడిద చేస్తాం అంటూ గర్జించారు. హెచ్చరించారు. అయితే  రేవంత్ రెడ్డి గర్జించింది వక్ఫ్ సవరణ బిల్లు విషయంగా కాదు.  విద్య, ఉద్యోగాలతోపాటు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లులను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతూ బుధవారం (ఏప్రిల్ 2) ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిర్వహించిన  బీసీ పోరుగర్జన సభలో రేవంత్‌ రెడ్డి ఈ గర్జన చేశారు. రేవంత్ రెడ్డి గర్జనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాజ్యసభ రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు  లక్ష్మణ్  అంతే గట్టిగా కౌంటర్ ఇచ్చారు.  మీ మంత్రి వర్గంలో 46 శాతం బీసీలు ఉన్నారా?  అంటూ  కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అంతే  కాదు  బీసీలకు 42 రిజర్వేషన్ కల్పిస్తామని బిల్లు చేసి మరీ అసెంబ్లీకి ఇచ్చిన హామీ నుంచి తప్పించుకునేందుకే ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి బీసీ సంఘాల ముసుగులో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారని కిషన్ రెడ్డి  కౌంటర్ ఆరోపణ చేశారు.

రేవంత్ రెడ్డి గర్జన, కిషన్ రెడ్డి కౌంటర్ స్పందన.. ఇతర పరస్పర ఆరోపణల పర్యవసానాలు, ఫలితాలు ఎలా ఉంటాయి అనేది పక్కన పెడితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జంతర్ మంతర్  వద్ద గర్జన చేస్తున్న సమయంలోనే లేదంటే కొంచెం అటూ ఇటుగా రాజ్యసభలో  హెచ్‌సీయూ భూమల అమ్మకం వ్యవహారం రాజ్యసభలో ప్రకంపనలు సృష్టించింది. బీఆర్ఎస్ పక్ష నేత కేఆర్ సురేష్ రెడ్డి  రాష్ట్రంలో  రోజు రోజుకు రాజకీయ వేడిని పెంచుతున్న హెచ్‌సీయూ భూమల విక్రయం  అంశాన్ని సభలో ప్రస్తావించారు. రాజ్యసభ జీరో అవర్లో ఈ అంశాన్ని ప్రస్తావించిన సురేష్ రెడ్డి, అరుదైన పశుపక్షాదులకు ఆవాసంగా ఉన్న కంచ గచ్చిబౌలి  లోని 400 ఎకరాల భూమి విక్రయానికి వ్యతిరేకంగా విద్యార్ధులు చేస్తున్న ఆందోళనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రభుత్వం  అమానుషంగా, అత్యంత క్రూరంగా అణచి వేస్తోందని ఆరోపించారు. అలాగే  బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న భూముల విక్రయ నిర్ణయం వలన విద్యార్ధుల భవిష్యత్ దెబ్బతినడమే కాకుండా, పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తుందని అన్నారు. అంతకు ముందు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి వినతి పత్రం సమర్పించింది. 

మరో వంక  ఇదే అంశంపై ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ వద్ద బీజేపీ ఎంపీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ తో పాటుగా గోడం నగేష్‌, రఘునందన్‌రావు, డీకే అరుణ, కొండా,బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ హెచ్‌సీయూ భూములను అమ్మితే సహించేంది లేదని, తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హెచ్‌సీయూ భూమల వేలాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 

అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ ఎంపీలు కేంద్ర అటవీ,పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిసి, యూనివర్సిటీ భూములు విక్రయిస్తే పర్యావరణ పరంగా ఎదురయ్యే అనర్ధాలను వివరించారు. అటవీ, వన్య ప్రాణి సంరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. బీజేపే ఎంపీల విజ్ఞప్తి మేరకు  కేంద్ర అటవీ సంరక్షణ శాఖ, వివాదాస్పద కంచ గచ్చిబౌలి భులకు సమబందించిన సమగ్ర నివేదికని తక్షణం పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇలా రాష్ట్ర రాజకీయాలు బుధవారం (ఏప్రిల్ 2) ఢిల్లీలో వేడిని పుట్టించాయి. 

నిజానికి ఇవన్నీ ఒకెత్తు అయితే.. తెలంగాణ రాజకీయం ఢిల్లీలో వీరంగం వేస్తున్న సమయంలోనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెత్తిన దేశ సర్వోన్నత న్యాయస్థానం అక్షింతలు వేసింది. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న సుప్రీం కోర్టు, మళ్ళీ మరోమారు అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని గట్టిగా హెచ్చరించింది.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పై స్పీకర్ నాలుగేళ్లు చర్యలు తీసుకోకున్నా సుప్రీం కోర్టు చేతులు కట్టుకుని కుర్చోవాలా  అని ఘాటుగా వ్యాఖ్యానించింది. 
గత ప్రభుత్వ హయాంలో పార్టీ ఫిరాయించిన వారి విషయంలో ఏమి జరిగిందో, ఇప్పుడూ అదే జరుగుతుంది, అనర్హత వేటు పడదు, ఉప ఎన్నికలు రావు అంటూ  ముఖ్యమంత్రి రెంత్ రెడ్డి, రాష్ట శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో, చేసిన వ్యాఖ్యలను సుప్రీం  కోర్టు తప్పు పట్టింది. నిండు సభలో ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలు చేసింది నిజమే అయితే..  రాజ్యాంగంలోని 10వ షెడ్యూలును అపహాస్యం చేయడం కిందికే వస్తుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

బీఆర్‌ఎస్‌ నుంచి అధికార అధికార కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై బుధవారం సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా  బీఆర్‌ఎస్‌ నేత పాడి కౌశిక్‌రెడ్డి తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ అడ్వొకేట్‌ ఆర్యామ సుందరం.. మార్చి 26న అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఫిరాయింపుల  వ్యవహారం కూడా ఢిల్లీ ఖాతాలో  చేరింది. 

ఇలా ఒక దానివెంట ఒకటి,  రాష్ట్ర రాజకీయాలు,  యాధృచ్ఛికమే అయినా ప్రస్తుతానికి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. అయితే  ఢిల్లీ సీన్ ఢిల్లీలో సాగుతుంటే రాష్ట్రంలోనూ రాజకీయ ఉష్ణోగ్రతలు ఎండలతో పోటీ పడి పరుగులు తీస్తున్నాయి. 

By
en-us Political News

  
చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా ఉంది వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీరు. ఎంపీగా ఉండగా ఆయన తన పనితీరు కంటే న్యూడ్ వీడియోద్వారానే ఎక్కువ మందికి తెలిశారు.
దేనికైనా రెడీ అంటూ బీరాలు.. భారత్‌లో రక్తం పారిస్తామంటూ కారు కూతలు... కన్నుకి కన్ను..పన్నుకు పన్ను అంటూ డైలాగులు.. కట్ చేస్తే ఇంత వాగాడంబరాన్ని ప్రదర్శించిన పాక్ ఆర్మీ చీఫ్ ఇప్పుడు మిస్సింగ్‌.
సింహాచలం అప్పన్నచందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుని ఏడుగురు మరణించిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోడ కూలి ఏడుగురు మరణించిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సింహాద్రి అప్పన్న చందనోత్సవ వేళ జరిగిన అపశ్రుతి అత్యంత విషాదకరం. గోడ కూలడమే ప్రమాదానికి కారణం అయినప్పటికీ.. ఈ దుర్ఘటన అనేక ప్రశ్నలను తెరమీదకు తీసుకువస్తున్నది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (ఏప్రిల్ 30) శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ సాగుతోంది.
ఒక సాధారణ కానిస్టేబుల్ గా జీవితం ప్రారంభించి.. ఐపీఎస్ గా ఎదగడం మామూలు విషయం కాదు. అందరికీ సాధ్యమయ్యే విషయం అసలే కాదు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ఉదయ కృష్ణారెడ్డి.
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులపై గోడ కూలి ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
భవిష్యత్ లో అవసరమైతే మరిన్ని అంశాలను వెల్లడిస్తానంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. లిక్కర్ స్కాంపై తనను అడిగితే పూర్తి వివరాలు చెప్పేస్తానని ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో విజయసాయిరెడ్డిని విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
మెట్రోస్టేషన్లు, రైళ్లలో బెట్టింగ్‌ యాప్‌ల ప్రకటనపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నిషేధిత బెట్టింగ్‌ యాప్‌లపై మెట్రో రైళ్లలో ప్రకటనపై పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ విచారణకు హైదరాబాద్ మెట్రో రైలు తరుపున ఏజీ సుదర్శన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్‌ యాప్‌ల ప్రకటనలు ఇప్పుడు వేయడంలేదన్న ఏజీ పేర్కొన్నారు. మెమో దాఖలు చేసినట్లు తెలిపిన ఏజీ సుదర్శన్ రెడ్డి తెలిపారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. గత ఏడాది డిసెంబర్ 4న పుష్ప-2 రిలీజ్ సందర్భంగా, సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ 5 నెలలుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని, కండిషన్ స్టేబుల్‌గా ఉందని తండ్రి భాస్కర్ తెలిపారు. ఈ ఘటన తర్వాత హీరో అల్లు అర్జున్‌తో సహా థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో బన్నీనీ ఏ11 నిందితుడిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు.
సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్‌గా బి.ఆర్. గవాయ్ ఎన్నికయ్యారు. గవాయ్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. మే 14న సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. సీజేఐ పదవి చేపడుతున్న రెండో దళితుడిగా జస్టిస్ గవాయ్. కాగా, మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్‌ 1985లో లాయర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రాజా భోన్సాలేతో కలిసి పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా పని చేశారు.
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై కీలక వ్యూహరచన జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నాగారంలో భుదాన్ భూములు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ముగ్గురు ఐపీఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై ఈ నెల 24న విచారణ చేపట్టిన న్యాయస్థానం..27 మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ భాస్కర్‌రెడ్డి సింగిల్ బెంచ్‌ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ తాజాగా కొందరు ఐపీఎస్‌ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. వీరిలో ఐపీఎస్‌లు మహేశ్‌భగవత్‌, స్వాతి లక్రా, సౌమ్యా మిశ్రా ఉన్నారు. భూదాన్‌ భూముల్లో అక్రమాలపై విచారణ చేపట్టాలని గవర్నమెంట్‌లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించాలని కోరుతూ మహేశ్వరం మండలానికి చెందిన బిర్ల మల్లేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.