పెద్దల మాట కొట్టి పడేయకండి..  కుటుంబం అందరూ కలిసి భోజనం చేస్తే జరిగేది ఇదే..!

Publish Date:Jul 30, 2026

Advertisement

పెద్దల మాట కొట్టి పడేయకండి..  కుటుంబం అందరూ కలిసి భోజనం చేస్తే జరిగేది ఇదే..!

ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి కుటుంబంతో ఉండే అనుబంధం చాలా గొప్పది. ఎన్నో విషయాలు కుటుంబం నుండే నేర్చుకుంటారు.  ఒకప్పుడు కుటుంబం మొత్తం కలిసి భోజనం చేసేవారు.  కానీ నేటి వేగవంతమైన జీవితాల కారణంగా ఇంటిల్లిపాది కలిసి భోజనం చేయడం చాలా అరుదుగా మారిపోయింది. పిల్లలు స్కూల్లో,  తల్లిదండ్రులు ఆఫీసులలో.. ఇలా అందరూ కలిసి భోజనం చేసే పరిస్థితులు ఉండటం లేదు.. కనీసం రాత్రి సమయంలో అయినా కలిసి భోజనం చేస్తారా అనుకుంటే.. ఒకరు బయట తినేయడం,  ఇంకొకరు పార్టీలో తినేయడం,  ఇంకొకరు ఆలస్యంగా ఇంటికి రావడం.. ఇలాంటి కారణాల వల్ల కుటుంబంలో అందరూ కలిసి తినే సందర్బం ఉండటం లేదు. అయితే.. పెద్దలు మాత్రం కుటుంబంలో అందరూ కలిసి కనీసం రోజులో  ఒకసారి అయినా భోజనం చేయాలని చెబుతారు. అందరూ కలిసి భోజనం చేయడం ఎందుకు ముఖ్యమూ.. తెలుసుకుంటే..

విద్య ఫలితాలు..

అంతా కలిసి భోజనం చేసే కుటుంబాలలో పిల్లలు చదువులో చాలా చురుగ్గా ఉంటారట. కుటుంబంతో కలిసి భోజనం చేయడం వారిని మానసికంగా మెరుగ్గా ఉంచి,  చదువులో మంచి వికాసం కలిగేలా చేస్తుందట. పిల్లలు చక్కగా చదువుకుంటారట.

లాంగ్వేజ్,  కమ్యూనికేషన్ స్కిల్స్..

పిల్లలు, పెద్దలు కలిసి భోజనం చేసినప్పుడు  పిల్లలలో లాంగ్వేజ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ డవలప్ అవుతాయి. పిల్లలు పెద్దలతో మాట్లాడటం,  కావలసినది అడగడం, వద్దని చెప్పడం,  వంట బాగుందని చెప్పడం.. ఇలా భోజనం సమయంలో చాలా సంఘటనల నుండి పిల్లలు చక్కగా మాట్లాడటం,  చక్కగా కమ్యూనికేట్ చేయడం నేర్చుకుంటారు.

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు..

పెద్దల సమక్షంలో పిల్లలు భోజనం చేయడం వల్ల పిల్లలు తినే విధానం,  ఎలా తినాలి? కావలసిన ఆహారం తినడం, ఆహారం వృధా చేయకపోవడం, శుభ్రంగా తినడం వంటి మంచి ఆహారపు అలవాట్లు అలవడతాయి.  అంతేకాదు.. ఆహారాన్ని కలుపుకునే విధానం కూడా పెద్దల నుండే నేర్చుకుంటారు.

పిల్లలు పెద్దలతో కలిసి తినేటప్పుడు సంపూర్ణ ఆహారం తినే అవకాశం ఉంటుంది.  పండ్లు, కూరగాయలు,  పోషకాలు, ప్రోటీన్.. ఇలా అన్ని రకాలు పిల్లలకు అందుతాయి.

తృప్తిగా తింటారు..

పిల్లలు పెద్దలతో కలిసి తినేటప్పుడు హ్యాపీగా తినడం అలవాటు అవుతుంది. ఇది పిల్లలు తృప్తిగా తినడానికి కారణం అవుతుంది.

సెల్ఫ్ రెస్సెక్ట్, సెల్ఫ్ కాన్పిడెన్స్..

పెద్దల దగ్గర కూర్చుని పిల్లలు తామే ఆహారం కలుపుకోవడం, తినడం వంటివి చేయడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం,  ఆత్మగౌరవం పెరుగుతాయి.

బందాలు..

పిల్లలు, పెద్దలు కలిసి భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధం బలంగా మారుతుంది.  అందరూ కలిసి తినే ఆ కొద్ది సమయం అందరినీ కలిపి ఉంచుతుంది.

ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్..

ఒంటరిగా తినేటప్పుడు కోపం,  డిప్రెషన్, ఒత్తిడి వంటి ఎమోషన్స్ తో తినే అవకాశం ఉంటుంది.  పైగా ఒంటరిగా తినేటప్పుడు ఒంటరితనం కూడా చాలా వరకు ప్రభావం చూపిస్తుంది. కానీ అందరూ కలిసి తింటే.. ఒత్తిడి,  ఆందోళన,  డిప్రెషన్ వంటివి ఉండవు.

చెడు అలవాట్లు..

ఒక వయసులోకి వచ్చిన పిల్లలు చాలా వరకు మధ్యం సేవించడం,  స్మోక్ చేయడం,  డ్రగ్స్ వాడటం వంటివి చేసే అలవాటు ఉంటుంది. కానీ అందరూ కలిసి కూర్చుని భోజనం చేస్తే పిల్లలలో చాలా వరకు మానసిక మార్పు కలుగుతుంది.  చెడు అలవాట్లకు దూరంగా ఉండగలుగుతారు.

ఆరోగ్య సమస్యలు..

అందరూ కలిసి భోజనం  చేసేటప్పుడు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తారు. ఎక్కువ ఆహారం తినవద్దని,  ఎక్కువ ఉప్పు, కారం వంటివి తినవద్దని ఒకరికి ఒకరు సలహా ఇచ్చుకోవడం లేదా జాగ్రత్తలు చెప్పడం లాంటివి జరుగుతాయి.  దీని వల్ల ఒబెసిటీ,  దీనికి సంబంధించిన వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

 

                   *రూపశ్రీ.

 

By
en-us Political News

  
నేటి కాలంలో ఇల్లు, కారు, పిల్లల చదువు, వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం లోన్ తీసుకోవడం చాలా సాధారణమైంది.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, తెలివైనవారుగా, క్రమశిక్షణ గలవారుగా , స్వయం సమృద్ధి గలవారుగా ఉండాలని కోరుకుంటారు.
జీవితం అన్నాక సంతోషాలు,  ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు బాధపడటం అందరూ చేసే పనే.. కానీ.. కొందరుంటారు.. చుట్టూ ఉన్నవారు బాధపడితే.. ఏడిస్తే.. వారిని ఓదార్చాలనే ఆలోచనలతో "ఏడిస్తే ఏం ప్రయోజనం?", "
పిల్లలు చదువును ఒత్తిడిగా కాకుండా ఆనందంగా భావించాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. చాలామంది తల్లిదండ్రులు మంచి మార్కులు రావాలని ఆశపడతారు.
ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత అందంగా కనిపిస్తుంది. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో బూజు దులపడం, తుడవడం,  ఇంట్లో ఎక్కడైనా సాలీడు పురుగులు, బొద్దింకలు వంటివి రాకుండా చూడటం చేస్తుంటారు.
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది.
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.
వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.
 పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.
5 Habits Every Father Should Give Up for His Daughter,Every Father Needs to Hear These 5 Parenting Tips,5 Habits to Leave Behind
Signs of a Healthy Family Environment,Healthy Family or Toxic EnvironmentIs Your Family Environment Healthy
పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం , ఆలోచనా విధానం మొదలైన విషయాలలో  తల్లిదండ్రులిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. తల్లి ప్రేమ, శ్రద్ధ పిల్లల భావోద్వేగ పునాదిని బలపరిస్తే.. తండ్రి ప్రవర్తన, క్రమశిక్షణ, మాటతీరు,   జీవనశైలి వంటివి  పిల్లలపై చాలా గట్టి  ప్రభావాన్ని చూపుతాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.