వైసీపీకి వాకౌట్ ఫ్యాషన్ అయిపోయింది.. నారా లోకేష్

Publish Date:Feb 13, 2026

Advertisement

ఆరోపణలు చేసి పారిపోవడం కాదనీ, చిత్తశుద్ధి ఉంటే సభకు వచ్చి చర్చించాలనీ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వైసీపీకి సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్  శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో జగన్ హయాంలో ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలపై మాట్లాడిన లోకేష్.. జగన్ హయాంలో   రూ.4064.59 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయన్నారు. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే దీనిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే ఆరోపణలు చేయడం పలాయనం చిత్తగించడం వైసీపీకి అలవాటుగా మారిందనీ, అలాగే వాకౌట్ చేయడం ఆ పార్టీకి ఫ్యాషన్ అయిపోయిందని లోకేష్ విమర్శించారు. 

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ముందుగా మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్న కాంటీన్లు మూసివేయబోమని సభలో చెప్పి మాటతప్పారని, ఇప్పుడు వైసీపీ పాలనలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు లేవంటూ నీతులు చెబుతున్నారని ఆక్షేపించారు.  దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ.. మండలిలో  వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు లేవని చెబుతున్నారు. 2020- 2021 ఏడాది క్యూ-4 పెండింగ్ 683.1 కోట్లు, 2023-24 క్యూ-2, క్యూ-3, క్యూ-4 బకాయిలు 1753.98 కోట్లు, 2023-24 ఏడాది గమనిస్తే.. ఎంటీఎఫ్ అరియర్లు  సుమారు రూ.895 కోట్లు బకాయిలు పెట్టారని గణాంకాలతో సహా వివరించారు.

వైసీపీ ప్రభుత్వంలో ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించినట్లు సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వం మారే సమయంలో రూ.645 కోట్ల బకాయిలు చెల్లించలేన్న లోకేష్ తాను రికార్డెడ్ గా చెబుతున్నాననీ,   విద్యాశాఖ మంత్రిగా మాట్లాడేందుకు   హక్కు ఉందన్నారు.  దీనిపై బొత్స స్పందిస్తూ.. వైసీపీ హయాంలో రూ.4వేల కోట్ల బకాయిలు లేవనీ, రెండు వాయిదాలు మాత్రమే బకాయి ఉందనీ  చెప్పి, ఇంటర్ విద్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆరోపించి అందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.  

By
en-us Political News

  
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.