ఆసియా క‌ప్‌... కోచ్‌గా ద్రావిడ్ స్థానంలో ల‌క్ష్మ‌ణ్‌  

Publish Date:Aug 25, 2022

Advertisement

 ఏద‌యినా స‌మ‌స్య త‌లెత్తిన‌పుడు ప‌రిష్కార‌మార్గం ఆలోచిస్తే నెమ్మదిమీద తెలుస్తుంది. క్రికెట్ ప‌రంగా చూస్తే భార‌త జ‌ట్టుకు అలాంటి అనేక సంద‌ర్భాల్లో గొప్ప ప్ర‌శాంత‌త‌ను, విజ‌యాన్ని ఇచ్చిన‌వాడు వి.వి.ఎస్. ల‌క్ష్మ‌ణ్‌. ఇది యావ‌త్ క్రికెట్ లోకం అంగీక‌రిస్తుంది. గ‌వాస్క‌ర్‌, క‌పిల్‌, అజ‌రుద్దీన్ వంటి సీనియ‌ర్లు కూడా ల‌క్ష్మ‌ణ్ గురించి ఇలానే చెప్ప‌డం ల‌క్ష్మ‌ణ్ ప్ర‌త్యేక‌త‌. కానీ వివిఎస్ మాత్రం మ‌హా సింపుల్‌గా ఉంటాడు. అదంతా వారి అభిమానం త‌ప్ప మ‌రోటి కాదంటాడు. అత‌నికి వాస్త‌వానికి భార‌త్ జ‌ట్టులో ప్ర‌పంచ‌క‌ప్ పోటీల్లో స్థానం క‌ల్పించ‌క‌పోవ‌డ‌మ‌నే అన్యాయం జ‌రిగింది. కానీ అత‌ను మాత్రం దాన్ని అంత సీరియ‌స్‌గా తీసుకోలేదు. కార‌ణం తాను భార‌త్ జ‌ట్టులో ఉండాల‌నుకుంటున్నాడేగాని టోర్నీ ప్రాధాన్యం కాద‌న్నాడు. 

ఇలాంటి వాడు ఆ త‌ర్వాత కోచ్ అవ‌తారం ఎత్త‌డం జ‌ట్టుకు ఎంతో మేలే జ‌రిగింది. ఎందుకంటే ఆట‌లో ద్రావిడ్‌తో స‌మానుడు, ప్ర‌వ‌ర్త‌న‌లో, ఇత‌రు ల‌ను, ప‌రిస్థితుల‌ను ద్రావిడ్‌లా కూల్‌గా అర్ధంచేసుకుని ముంద‌డుగు వేయ‌గ‌ల స‌మ‌ర్ధుడు. అందుకే మిస్ట‌ర్ కూల్ ధోనీ కూడా వివిఎస్ మీద గౌర‌వాన్నే వ్య‌క్తం చేశాడు  అనేక ప‌ర్యాయాలు. చిత్ర‌మేమంటే, ఇపుడు మ‌ళ్లీ అత‌ని అవ‌స‌రం జ‌ట్టుకు ఎంతో కావ ల‌సి వ‌చ్చింది. 

కోవిడ్ పాజిటివ్ పరీక్ష తర్వాత రాహుల్ ద్రవిడ్ కోలుకోలేకపోయినందున రాబోయే ఆసియా కప్ 2022 కోసం వివిఎస్‌ లక్ష్మణ్ తాత్కాలిక ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగించామని, అతని టెస్ట్ ఫలితాలు ప్రతికూలంగా వచ్చిన తర్వాతే ద్రవిడ్ బాధ్యతలు స్వీకరిస్తారని బిసిసిఐ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. యూఏఇ లో జరగబోయే ఆసియా కప్ 2022 కోసం భారత క్రికెట్ జట్టు తాత్కాలిక ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానంలో ప్రస్తుత జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఏ) హెడ్, మాజీ బ్యాట్స్‌మెన్  లక్ష్మణ్ ను తీసుకున్నారు. 

ఐర్లాండ్‌లో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 కోసం లక్ష్మణ్ భారత ప్రధాన కోచ్‌గా అడుగు పెట్టాడు. అతని నేతృత్వంలోని మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించడంతో పాటు పలువురు యువ ఆటగాళ్లు తమ దైన ముద్ర వేయగలిగారు. భారత ప్రధాన కోచ్‌గా లక్ష్మణ్ ఆకట్టుకోవడానికి గల 3 కారణాలను ఇక్కడ చూద్దాం. లక్ష్మణ్ ఆటగాళ్ల కు నిర్దిష్ట పాత్రను, మైదానంలో తమను తాము వ్యక్తీకరించే స్వేచ్ఛను ఇచ్చినట్లు అనిపించింది. యువ ఆట గాళ్ళు తమకు తాము గా మంచి ఖాతాని అందించగలిగారు, ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనే భారత జ‌ట్టుకీ  ఇది మంచి సూచన. ల‌క్ష్మ‌ణ్ నేతృత్వంలో కుర్రాళ్లు మ‌రింత ప‌దునుగా త‌యార‌వుతార‌నే న‌మ్మ‌కం ఉంది. వాళ్ల‌కు వారి లోపాలు తెలియ‌జేయ‌డం, వాటిని అధిగ‌మించేందుకు వెన్నుద‌న్నుగా నిల‌వ‌డంలో మంచి సూచ‌న‌ల‌తో కుర్రాళ్ల‌ను ఉర‌క‌లు వేయించ‌డంలో దిట్ట‌గా లక్ష్మ‌ణ్‌ను  ప్లేయ‌ర్లు పేర్కొంటారు. టీమ్ ను ల‌క్ష్మ‌ణ్  నిర్వహించగలిగిన విధానం పట్ల బీసీసీఐ సంతోషి స్తుంది. అతను ఐర్లాండ్‌లో హార్దిక్ పాండ్యాతో కలిసి  ప‌ని చేశాడు, ఇంగ్లాండ్‌పై రోహిత్ శర్మతో జతకట్టాడు. విదేశీ పరిస్థితుల్లో ఆ జట్టు ఆడే విధానంలో నిలకడ ఉంది.

లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగించడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు, అతను హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ఐర్లాండ్‌కు వెళ్లే భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు, ఇక్కడ జట్టు రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టును 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాకుండా, రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో టెస్ట్ జట్టు ఆడినందున అతను జట్టు తో పాటు ఉన్నాడు. కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ గెలిచిన మొదటి టీ20 తర్వాత లక్ష్మణ్ ఇంగ్లాండ్‌ను విడిచి పెట్టాడు.

ల‌క్ష్మ‌ణ్‌కు టీమ్ ప‌టిష్టంగా, ఎలాంటి విభేదాల‌కు అవ‌కాశం లేని విధంగా ముందుకు న‌డిపించ‌డంలో కెప్టెన్ అభిప్రాయానికీ అంతే గౌర‌వం ఇస్తూ, టీమ్‌లో చిన్న ప్లేయ‌ర్‌తో స‌హా అంద‌రి మాటా వింటూ త‌గిన స‌ల‌హాలిస్తూ వారిని స‌మ‌ష్టిగా విజ‌యం సాధించే దిశ‌గా ముంద‌డుగు వేయించ‌డం ల‌క్ష్మ‌ణ్‌కి బాగా ఎరుకే. అందుకే భార‌త్ క్రికెట్ అధికారులు జ‌ట్టుకు ద్రావిడ్ స్థానం భ‌ర్తీ చేయ‌గ‌లి గినవాడిగా ల‌క్ష్మ‌ణ్‌కు అవ‌కాశం ఇచ్చారు. 

By
en-us Political News

  
మొత్తంగా ముచ్చటగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ తన కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని అంటున్నారు. మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోడీ సోమవారం (జూన్ 29) క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు.
జగన్ కోసం ముద్రగడ తన సొంత సామాజిక వర్గం వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. జగన్ కనీసం ఆయనను పరామర్శిండానికి కూడా రాకపోవడంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు.
ఆ అమ్మాయి నోట జగన్ సార్ అనే మాట రాగానే.. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనంటూ వైఎసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడింది వైఎస్ జగనేనంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రెడిట్ చోరీపై కిరాక్ ఆర్పీ సాక్ష్యాలను చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
  బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు.
ఈ శిలాఫలకంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు ఎక్కడా కనిపించలేదు. ఈ వింత పరిస్థితిని గమనించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ఉత్సాహంగా కార్యక్రమానికి వచ్చిన ఆయన, ఆ శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో నిరాశకు లోనయ్యారు.
కాంగ్రెస్ నేతల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి..
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని మలుపులు చోటుచేసుకుంటూనే ఉంటాయి
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ.. డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు.
ఎన్నికల బరిలో కేసీఆర్, బీఆర్ఎస్ కూటమిని ఢీకొట్టడం ఎవరికైనా పెద్ద సవాలే. గతంలో కేసీఆర్ వాడే ఘాటైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై ఆయనకు మాత్రమే పేటెంట్ హక్కు ఉందనే భావన ఉండేది. కానీ రేవంత్ రెడ్డి రాకతో.. ఆ ముద్రను పూర్తిగా చెరిపివేశారు. కేసీఆర్, కేటీఆర్ ల కంటే మరింత దూకుడుగా, ఘాటుగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే.. ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.