ఆ జగన్ ఆయన కాదబ్బా! వైఎస్సార్సీపీ ఫేక్ ప్రచారానికి కిరాక్ ఆర్పీ స్ట్రాంగ్ కౌంటర్!

Publish Date:Jun 25, 2026

Advertisement

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ రజతోత్సవ వేడుకల వేదికగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఆసుపత్రి వ్యవస్థాపక దినోత్సవంలో క్యాన్సర్ నుండి కోలుకున్న స్వప్న అనే యువతి మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ వైసీపీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న తప్పుడు ప్రచారాలపై ప్రముఖ నటుడు కిరాక్ ఆర్పీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  

 సాక్ష్యాలతో సహా   వీడియోను ఆధారంతో అసలు వాస్తవాలను బహిర్గతం చేశారు. ఇటీవల జరిగిన బసవతారకం ఆసుపత్రి 25 ఏళ్ల వార్షికోత్సవానికి నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు విశిష్ట అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గతంలో క్యాన్సర్‌తో బాధపడి ఈ ఆసుపత్రిలో ఉచిత వైద్యం పొంది పూర్తిగా కోలుకున్న స్వప్న అనే అమ్మాయి వేదికపైకి  వచ్చి తన కృతజ్ఞతలు తెలిపింది.  నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు మా ఊరిలో  జగన్ సార్ మా ఇంటికి వచ్చి, బాలకృష్ణ సార్‌తో మాట్లాడించి నన్ను ఈ ఆసుపత్రిలో చేర్పించారు అని ఆమె పేర్కొంది.అయితే, ఆ అమ్మాయి నోట 'జగన్ సార్' అనే మాట రాగానే..  అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనంటూ వైఎసీపీ  సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి తెరలేపింది.

ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడింది వైఎస్ జగనేనంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రెడిట్ చోరీపై కిరాక్ ఆర్పీ సాక్ష్యాలను చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆ అమ్మాయి చెప్పిన  జగన్ సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని, ఆయన అనంతపురానికి చెందిన  అనంతపురం జగన్  అని ఆర్పీ స్పష్టం చేశారు. నందమూరి కుటుంబానికి, ముఖ్యంగా నందమూరి బాలకృష్ణకు ఆయన దశాబ్దాలుగా వీరాభిమానిగా ఉన్నారని తెలిపారు.  

ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా బాలయ్య చేసే సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటుంటారని వివరించారు.గతంలో అనంతపురం జిల్లాలో సదరు బాలిక క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఈ అభిమాని జగన్.. స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి  పరామర్శించారు. ఆ వెంటనే బాలకృష్ణకు ఫోన్ చేసి విషయం చెప్పగా.. బాలయ్య చొరవ తీసుకుని ఆ అమ్మాయిని బసవతారకం ఆసుపత్రిలో చేర్పించి ఉచితంగా వైద్యం అందించారు. దీనికి సంబంధించిన పాత ఫోటోలను, బాలయ్య ఆ పాపను ఆసుపత్రిలో పరామర్శించిన విజువల్స్‌ను ఆర్పీ  చూపించారు. సొంత చెల్లిని, కన్నతల్లిని దూరం పెట్టి, బాబాయి మరణంపై రాజకీయం చేసిన వ్యక్తికి.. ఇలాంటి మానవతా కార్యక్రమాలతో ఏం సంబంధం ఉంటుందని ఆర్పీ ప్రశ్నించారు.

ఏ చిన్న మంచి పని జరిగినా, వేరే వాళ్లు తెచ్చిన కంపెనీలైనా తమ ఖాతాలో వేసుకుని క్రెడిట్ కొట్టేయాలనుకోవడం  వైసీపీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. రేపు ప్రపంచంలో  జగన్ అనే పేరున్న వాళ్లు ఏ మంచి పని చేసినా అది వైఎస్ జగనే చేశాడంటూ క్లెయిమ్ చేసుకునేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ నిజాలు తెలుసుకోకుండా కేవలం పేరు ఒక్కటే చూసి వైసీపీ సోషల్ మీడియా బృందంక్రెడిట్ చోరీకి పాల్పడటం   సిగ్గుచేటని ఆర్పీ విమర్శించారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని, వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హితవు పలికారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

By
en-us Political News

  
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.