వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలే!

Publish Date:Jul 12, 2023

Advertisement

ఏపీ సీఎం జగన్  తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వారు పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. ఇంత వ్యతిరేకత వ్యక్తమౌతున్నా జగన్ సర్కార్ వాలంటీర్లను ఎందుకు వెనుకేసుకు వస్తోంది? వారి మీద ఈగ వాలినా ఎందుకు సహించడం లేదు. ఎందుకంటే వారు పార్టీ కార్యకర్తలు కనుక. వచ్చే ఎన్నికలలో పార్టీ విజయం కోసం జగన్ పూర్తిగా వాలంటీర్లమీదే ఆధారపడ్డారు కనుక.

ఈ విషయాన్ని మంత్రులు పలు సందర్భాలలో బాహాటంగానే చెప్పారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు అయితే ఒక అడుగుముందుకు వేసి వాలంటీర్లు పార్టీ కార్యకర్తలేనని కుండబద్దలు కొట్టారు. పార్టీకి వ్యతిరేకంగా వాలంటీర్లు ఎవరైనా ఉంటే చెప్పండి.. వారిని తీసేసి మరింత విశ్వాసంగా పార్టీ కోసం పని చేసే వారిని నియమిస్తామని  చెప్పేశారు. 

ఇప్పుడు మనం మననం చేసుకోవలసిందేమిటంటే.. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలేనన్న సంగతి ఈ వ్యవస్థను జగన్ తీసుకువచ్చిన రోజే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు విస్పష్టంగా చెప్పారు.  ఇటీవల వారాహి యాత్రలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా అదే చెప్పారు. నేడో రేపో ఎన్నికల సంఘం కూడా అదే చెబుతుంది. ఉద్యోగులు, వాలంటీర్లు ఒక్కటి ఎంత మాత్రం కాదు. ప్రభుత్వోద్యోగులకు, వాలంటీర్లు నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది. అందులో సందేహం లేదు. ఎందుకంటే ఉద్యోగులు రాజ్యాంగ వ్యవస్థకు చెందిన వారు. వాలంటీర్లు జగన్ సొంత వ్యవస్థకు చెందిన వ్యక్తలు. వీరి నియామకాలకు ఎటువంటి నిబంధనలూ లేవు. అదే ప్రభుత్వోద్యోగులైతే రాత పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి, ఇంటర్వ్యూను ఎదుర్కొని అందులో సెలెక్ట్ కావాలి. అదే వాలంటీర్లకు అయితే ఎలాంటి పరీక్షలూ లేవు. ఇంటర్వ్యూలు అసలే ఉండవు. వారికి ఉండాల్సిన అర్హత అల్లా వైసీపీ నేతల ఆమోదం. ఆ పార్టీ కార్యకర్త అన్న ముద్ర.

ఇప్పటికే ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన వార్డ్ మెంబెర్లు, కౌన్సిలర్ల చేతులు కట్టేసింది జగన్ సర్కార్. ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలిచిన, ప్రజా సేవ చేయడానికి,నాయకత్వ లక్షణాల ఉన్న  వార్డ్ మెంబెర్లు కు జీతాలు కూడా ఇవ్వని ప్రభుత్వం, పార్టీ కార్యకర్తలుకు మాత్రం నెలకు 5000 రూపాయలు ఇచ్చి పార్టీ కోసం వాడుకుంటోంది. వారు చేసేది పార్టీ పని.. తీసుకునేది ప్రభుత్వ జీతం. ఈ  వాలంటర్ల వ్యవస్థ ద్వారా జగన్ సర్కార్ రాష్ట్ర భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టేస్తోంది. జనం సొమ్మును దుర్వినియోగం చేస్తున్నది.  పార్టీ ప్రయోజనాల సంగతి అలా ఉంచితే..  భవిష్యత్తులో ఇంక ప్రభుత్వ ఉద్యోగాలకు ఎసరు పెట్టేశారనే చెప్పాలి.   ఎందుకంటే వాలంటర్లు అనే వ్యవస్థ  ప్రజల మీద కు జగన్ వదిలిన విషపు బాణం.   2024  ఎన్నికలలో  వైసీపీ వచ్చి జగన్మోహన్ రెడ్డి  మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రతీ  ప్రభుత్వ కార్యాలయాలలోని ప్రతీ ఉద్యోగి ప్రక్కన ఒక వైయస్సార్ కార్యకర్త అంటే వాలంటీర్ ఉంటాడు, ఉద్యోగులు ఏం చేయాలో వాళ్లే నిర్దేశిస్తారు.  ఇప్పటికే ప్రజలు వ్యక్తిగత వివరాలు అత్యంత గోప్యంగా వైసీపీకి చేరిపోయాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే..  వ్యవస్థల గోప్యతకు కూడా చెల్లుచీటీ ఖాయమని అంటున్నారు.  ఈ విషయాన్ని అన్యాపదేశంగానైనా మంత్రి అంబటి రాంబాబు ఒక పార్టీ సమావేశంలో వెల్లడించారు. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలేననీ, వైసీపీ కోసం, మరో సారి వైసీపీకి అధికారం దక్కడం కోసం జగన్ ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇదినీ చెప్పారు.  జగన్ రెడ్డి ఆదేశాల మేరకు తాము అంటే వైసీపీ ఎమ్మెల్యేల సిఫారసు మేరకు నియమితులైన వారేనని విస్ఫష్టంగా చెప్పారు. ఏ దాపరికం లేకుండా  వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలేనని చెప్పాశారు. వాలంటీర్లలో ఎవరైనా వైసీపీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహ రిస్తుంటే చెప్పండి.. వారిని తీసేసి కొత్త వారిని పెడతాం అని హామీ కూడా ఇచ్చారు.  

నిజానికి ఇప్పుడేంటి.. గతంలోనే అప్పట్లో వైసీపీలో అత్యంత కీలక పాత్ర వహిస్తున్న ఎంపీ విజయసాయి రెడ్డి వాలంటీర్లలో 90 శాతం మంది వైసీపీ వాళ్లే నని చెప్పారు. వాలంటీర్లు   పార్టీకి కూడా పని చేస్తారని వివరణ కూడా ఇచ్చారు.  ఇక   పవన్ వ్యాఖ్యలకు నిరసనగా వాలంటీర్లు మీడియా ముందుకు వచ్చి వైసీపీ కార్యకర్తలలాగే మాట్లాడారు. తమ కర్తవ్యం, బాధ్యత అంతా కూడా మరో సారి వైసీపీని, జగన్ ను అధికారంలోకి తీసుకురావడమేనని ఎలాంటి దాపరికం లేకుండా చెప్పేశారు. 

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.