విశాఖ సీపీ బదలీ వెనుక ఎంపీ హస్తం? !

Publish Date:Sep 6, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో 11 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. జగన్ ప్రభుత్వం మంగళవారం (సెప్టెంబర్ 5) ఆదేశాలు జారీ చేసింది. ఆ బదిలీ అయిన ఐపీఎస్‌ అధికారుల జాబితాలో విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ పేరు కూడా ఉంది. ఆయన బదలీపై ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల్లో వాడి వేడిగా  చర్చ జరుగుతోంది. ఎందుకంటే విశాఖ నగర పోలీస్ కమిషనర్‌గా త్రివిక్రమ్ వర్మ చార్జ్ తీసుకుని  జస్ట్ 5 నెలలు కూడా గడవక  ముందే ఆయనపై బదిలీ వేటు పడడం వెనుక ఎంపీ ఎంవీవీ హస్తం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  ఈ ఏడాది అంటే 2023 ఏప్రిల్‌ 12వ తేదీన త్రివిక్రమ వర్మ విశాఖ నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. 

ఆ కొద్ది రోజులకే అంటే జూన్ రెండో వారంలో విశాఖపట్నం ఎంపీ, వైసీపీ నాయకుడు ఎంవీవీ సత్యనారాయణ  ఫ్యామిలీ కిడ్నాప్ కావడం.. ఆ తర్వాత ఈ కిడ్నాప్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కాగా.. ఈ విషయం ఢిల్లీలోని కేంద్ర పెద్దల వరకు వెళ్లడం..   ఆ క్రమంలో అధికార పార్టీ ప్యామిలీ కిడ్నాప్ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. చివరకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చి.. ఆంధ్రప్రదేశ్‌లో తాను వ్యాపారాలు  చేయలేనని.. తన బిచాణా మొత్తం పక్కనే ఉన్న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు ఎత్తేస్తానంటూ ప్రకటించడంతో.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని స్వయంగా అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిదే  బయట ప్రపంచానికి తెలిపినట్లు అయింది. 

అయితే ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ జరిగినా.. ఆ వ్యవహారాన్ని బయటకు రాకుండా ఆదిలోనే కంట్రోల్ చేయడంలో.. విశాఖ నగర పోలీస్ కమిషనర్‌గా త్రివిక్రమ వర్మ పూర్తిగా విపలమయ్యారని, అందువల్ల ఈ కిడ్నాప్ వ్యవహారం కారణంగా జగన్ ప్రభుత్వ పరువు కొండెక్కిందని,  విశాఖ సీపీ త్రివిక్రమ్ వర్మ కారణంగానే ఇదంతా జరిగిందంటూ.. పార్టీలోని పెద్ద తలకాయిలు అప్పుడు పెదవి విరిచాయనే ఓ చర్చ సైతం అధికార వైసీపీలో నేటికి కొన సాగుతోంది. 

అంతేకాదు.. విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారంపై అధికార వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కేంద్రంలోని పెద్దలకు లేఖలు రాయడం..  దీనిపై లోక్‌సభలోనే రఘురామకృష్ణం రాజుపై ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సీరియస్ కావడం.. దీంతో సభలోని సభ్యులంతా.. ఏం జరిగిందంటూ వీరిద్దరి వ్యవహారంపై ఆరా తీయడంతో.. ఢిల్లీ వేదికగా పార్టీ పరువు గంగలో కలిసింది. ఈ నేపథ్యంలోనే అదును చూసి ఎంపీ చక్రం తిప్పి కమిషనర్ త్రివిక్రమ్ పై బదలీ వేటుకు కారణమయ్యారని అంటున్నారు. 

  అదీ ముఖ్యమంత్రి  జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన  మూడు రోజులకే.. ఇలా 11 మంది ఐపీఎస్‌లను బదిలీ చేయడం పట్ల పోలిటికల్ సర్కిల్‌లో విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఐపీఎస్‌ల బదిలీలు ఉంటాయి కానీ.. ముఖ్మమంత్రి రాష్ట్రంలో లేని సమయంలో.. ఎవరి ఆదేశాలతో ఈ బదిలీలు జరిగాయన్న చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో  జోరందుకుంది.

By
en-us Political News

  
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.