వివేకా హత్య.. దస్తగిరి మళ్లీ అరెస్ట్..!

Publish Date:Nov 1, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి   జగన్ సొంత చిన్నాన్న  వివేకా దారుణ హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరిని ఉమ్మడి కడప జిల్లాలోని ఎర్రగుంట్ల పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. ఓ ప్రేమికుల జంటను బెదిరించారనే ఆరోపణల నేపథ్యంలో ఆతడినీ, అతడి బంధువులను మంగళవారం (అక్టోబర్ 31) పోలీసులు అదుపులోకి తీసుకొని.. వారిపై కిడ్నాప్‌తోపాటు  ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు నమోదు చేసి.. కమలాపురం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ వారికి రిమాండ్ విధించడంతో  కడప జైలుకు తరలించారు.  2019, మార్చి 14 అర్థరాత్రి పులివెందుల్లోని సొంత గృహంలో వైయస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారు. 

అనంతరం చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో వివేకా కుమార్తె  సునీత.. న్యాయ స్థానాన్ని ఆశ్రయించి.. తన తండ్రి హత్య కేసు సీబీఐతో విచారణ జరిపించాలని కోరగా.. అందుకు న్యాయస్థానం సమ్మతించింది. వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. అలా ఈ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లిన తర్వాత... దర్యాప్తులో భాగంగా ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న షేక్ దస్తగిరి అప్రూవర్‌గా మారారు. ఈ వివేకా హత్య కేసులో పాత్రదారులు, సూత్రదారుల పేర్లు బహిర్గతం చేయడమే కాకుండా.. ఈ హత్య కేసులో సీఎం  జగన్ సోదరుడు కడప ఎంపీ   అవినాష్ రెడ్డితోపాటు ఆయన తండ్రి   భాస్కరరెడ్డి సూత్రధారులుగా ఉన్నారని, అలాగే ఈ హత్య ద్వారా కోట్లాది రూపాయిల సూపారీ సైతం చేతులు మారిందని తెలిపారు. దీంతో దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా  సీబీఐ  దర్యాప్తు చేపట్టి.. పలువురు నిందితులను అరెస్ట్ చేసింది. 

అందులోభాగంగా   భాస్కరరెడ్డినీ అరెస్టు చేసింది. అయితే ఈ కేసులో ఎ8 గా ఉన్న   అవినాష్ రెడ్డి మాత్రం తెలంగాణ హైకోర్టు నుంచి ముందుస్తుగానే బెయిల్ తెచ్చుకున్నారు. మరోవైపు ఆయనను సీబీఐ అదుపులోకి తీసుకోనే క్రమంలో.. పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. అదే సమయంలో ఏపీ సీఎం  జగన్... పలుమార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లి రావడంతో.. ఈ కేసు దర్యాప్తు దాదాపుగా నెమ్మదించింది. మరోవైపు వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి.. బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఆతడి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే ఓ ప్రచారం   స్థానికంగా గతంలోనే జోరందుకొంది. 

అలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలంటూ అతడికి సీబీఐ అధికారులు సూచించారన్న ప్రచారం కూడా సాగింది. ఈ నేపథ్యంలో  షేక్ దస్తగిరి మళ్లీ.. అరెస్ట్ కావడంతో.. ఆతడి ప్రాణాలకు ఎటు వైపు నుంచి ముప్పు పొంచి ఉందో అనే అనుమానం సీమ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది. మరోవైపు ఎంపీ   అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కావాలనే తన భర్తను ఈ కేసులో ఇరికించారని షేక్ దస్తగిరి భార్య  ఆరోపించారు. 

అలాగే అప్రూవర్‌గా మారి బయట ఉన్న షేక్ దస్తగిరి బెయిల్ రద్దు చేయాలంటూ ఈ ఏడాది జులైలో హైకోర్టులో   వివేకా పీఏ కృష్ణారెడ్డి,   అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి పిటిషన్లు వేసిన విషయం విదితమే. అదీకాక   వివేకా హత్య కేసులో అరెస్ట్ అయి బయట ఉన్న  అవినాష్ రెడ్డి తండ్రి   భాస్కరరెడ్డికి సీబీఐ కోర్టు ఇచ్చిన ఎస్కార్ట్ బెయిల్‌ గడువు నవంబర్ 1వ తేదీతో ముగియనుంది. అలాంటి వేళ.. షేక్ దస్తగిరి అరెస్ట్ కావడం పట్ల .. పలు సందేహాలు  వ్యక్తమవుతున్నాయి.

By
en-us Political News

  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.