నిన్న రాజగోపాల్ రెడ్డి.. నేడు వివేక్.. తెలంగాణలో ఒక్కటొక్కటిగా రాలుతున్న కమలం రేకులు!

Publish Date:Nov 1, 2023

Advertisement

ఎన్నికలకు ముందు బీజేపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మేనిఫెస్టో కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

సరిగ్గా కర్నాటక ఎన్నికల ముందు బీజేపీ ఆ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి అయితే ఎదుర్కొందో.. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. కమలం రేకులు ఒక్కటొక్కటిగా రాలిపోతున్నాయి. పార్టీ సీనియర్ నేతలు ఒక్కరొక్కరుగా బీజేపీకి రాంరాం చెప్పేసి కాంగ్రెస్ ‘హస్తం’ అందుకుంటున్నారు.  

బీజేపీ అభ్యర్థుల ఖరారు కోసం పార్టీ ఎలక్షన్ కమిటీ హస్తినలో సమావేశం జరుగుతున్న సమయంలోనే వివేక్ తన రాజీనామా లేఖను పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. అలా పంపిన నిముషాల వ్యవధిలోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. విజయభేరి సభలో పాల్గొనేందుకు వచ్చిన పార్టీ కీలక నేత రాహుల్ గాంధీని కుటుంబ సమేతంగా కలిశారు. ఆయన సమక్షంలోనే తన కుమారుడితో పాటు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయినా వివేక్ బీజేపీని వీడుతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూనే  ఉంది. అయితే ఆయన పార్టీ వీడి బీఆర్ఎస్ వైపు వెడతారా? కాంగ్రెస్ చేయందుకుంటారా? అన్న విషయంలో మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ లేకపోయింది. అయితే ఆ సందిగ్ధతకు ఫుల్ స్టాప్ పెడుతూ వివేక్ కాంగ్రెస్ గూటికి చేరారు.  

మూడు నాలుగు రోజుల కిందట తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివేక్ తో భేటీ అవ్వడంతో అప్పటి నుంచీ ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారనీ, ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవడం తథ్యమని పరిశీలకులే కాదు, కాంగ్రెస్ శ్రేణులు కూడా భావిస్తూ వచ్చాయి. చివరికి అదే జరిగింది. వివేక తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిసినా బీజేపీ మాత్రం ఆయనను బుజ్జగించడానికి పెద్దగా ప్రయత్నించలేదని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. బలమైన నేత ఎన్నికల ముందు పార్టీ వీడటం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  టీవలే బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో మరింత మంది బీజేపీని వీడి కాంగ్రెస్ పంచన చేరే అవకాశాలున్నాయని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి.  

By
en-us Political News

  
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.