రాజకీయ దుమారం రేపుతున్న కల్వకుంట్ల కవిత అరెస్ట్ విజువల్స్.!

Publish Date:Jul 3, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. ఇటీవల బోడుప్పల్ పరిధిలోని ఉప్పల్ భగాయత్ వద్ద చోటు తెలంగాణ రక్షణ సమితి(టీఆర్ఎస్) నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాల కేటాయింపు జరపాలంటూ సాగిన ఈ పోరాటంలో  టీఆర్ఎస్ అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో కవితను మహిళా పోలీసులు అరెస్టు సమయంలో జరిగిన తోపులాటలో ఆమె కిందపడిపోయారు.

ఆ తరువాత ఆమెను అరెస్టు చేసిన తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. కల్వకుంట్ల అరెస్టుకు సంబంధించిన విజువల్స్ లో   మహిళా పోలీసులు కవితను చుట్టుముట్టి లాక్కెళ్లేందుకు ప్రయత్నించడం, ఆ తీవ్ర తోపులాటలో కవితతో పాటు  మహిళా పోలీసులూ కిందపడిపోవడం స్పష్టంగా కనిపించింది.  ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది. నెటిజనులైతే.. పోలీసులు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికంగా, హింసాత్మకంగా ఉందని ఫైర్ అవుతున్నారు.  

కవితను పోలీసులు అరెస్టు చేసిన తీరు పట్ల రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తున్నాయి. కేవలం టీఆర్ఎస్ శ్రేణులే కాదు.. జనసేన, బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా  పోలీసుల తీరును తప్పుపడుతున్నారు.  జనసేన   తెలంగాణ జనరల్ సెక్రటరీ రామ్ తాళ్లూరి కవిత అరెస్టు సందర్భంగా పోలీసుల దురుసు వైఖరిని   తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు, రాజకీయ వైరుధ్యాలు ఉండటం సహజమన్న ఆయన.. ఒక  మహిళా నేత పట్ల  ఇంత అగౌరవంగా, కనీస మర్యాద లేకుండా వ్యవహరించడం ఏ మాత్రం సరికాదని, ఇసుమంతైనా ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.   మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు  బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు  

By
en-us Political News

  
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఎక్కడ చూసినా ఒకే నినాదం కనిపిస్తుంది.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి వైసీపీ 62 పిటిషన్లు వేసింది.!
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ‘అర్నాబ్’ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది.
దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల అంశంలో వైఎస్సార్‌సీపీకి దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
ప్రేమలో పడితే చాలా మంది పిచ్చి పనుల చేస్తుంటారు. నా కోసం ఏం చేస్తావని ప్రియురాలు అడిగితే.. ప్రాణమైనా ఇస్తానని లేదా ఆకాశంలోని చుక్కలైనా తెచ్చిస్తానని సినిమా డైలాగులు చెబుతుంటారు.
చిన్న రీఫండ్ కోసం ప్రయత్నించింది.. చివరకు భారీ మొత్తాన్ని పోగొట్టుకుంది.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.