ఏపీలో చంద్రోదయం.. దేశానికి వెలుగుల ప్రసారం

Publish Date:Nov 15, 2024

Advertisement

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఓ ప్రముఖ పత్రిక  చేసిన సర్వేలో జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచి సంచలనం రేపారు.  ప్రస్తుతం ఆయన జాతీయ రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేకపోయినా ఐదో స్థానంలో నిలవడం విశేషం. కేవలం 16 ఎంపీ స్థానాలు గల తెలుగుదేశం అధినేత  జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో  ఉన్నారంటే అది మామూలు విషయం కాదు.  ఆయన విధానాలు నిత్యనూతనంగా అటు అధికారుల,ఇటు ప్రజల మన్నలు పొదే విధంగా ఉంటాయి. ఎన్డీఏ ప్రభుత్వభాగస్వామిగా ఉన్నా రాజకీయాల్లో ఆయనే ఇప్పటి నాయకులకన్నా సీనియర్. ప్రధానిమోదీ కంటే ముందుగానే రాజకీయాలలోకి వచ్చిన చంద్రబాబు అప్పటి నుంచీ కూడా  క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు.

ఆయన ముఖ్యమంత్రి గా ఎంత క్రియాశీలకంగా ఉంటారో ప్రతిపక్ష నేతగా కూడా అలాగే వ్యవహరించేవారు. ఏడుపదులు దాటిన వయస్సులో కూడా చంద్రబాబు  ఎండనక వాననక 2024 ఏపీ ఎన్నికల్లో  ప్రచారం చేశారు. ఓ పత్రిక ఇటీవల నిర్వహించిన జాతీయ సర్వేలో మొదటి నాలుగు స్థానాల్లో మోదీ, ఆరెస్సెస్ నేత భగవత్, అమిత్ షా, రాహుల్ గాంధీ ఉన్నారు. వీరు నలుగురు జాతీయ రాజకీయాలలో కీలకంగా ఉన్నారు.  ప్రపంచంలో భారత్ ను ప్రముఖంగా గుర్తించడంలో మోదీ విదేశాంగ విధానం ఆయనను మొదటి స్థానంలో నిలిపింది. సొంత బలంతో మూడోసారి  విజయ తీరాలకు బీజేపీని చేర్చ లేకపోయినా ప్రపంచ కీలక నేతలతో  మోడీ నెరిసిన సంబంధాలు భారత్ ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. అలాగే అమిత్ షా స్ట్రాటజీ బీజేపీని ఇప్పటికీ జాతీయంగా, రాష్ట్రాలలోనూ అధికారానికి దగ్గరగా తీసుకు వెళుతున్నది. హర్యానా ఉదంతమే తాజా ఉదాహరణ. ఇక రాహుల్ గాంధీ  విధానం కాంగ్రెస్ ను రెండు రాష్ట్రాల లో అధికారంలో తేవడంతో పాటు పార్టీకి జవసత్వాలు కల్పించడంతో  నాలుగో స్థానంలో నిలిచారు. చంద్రబాబు గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాల్లోనే తలమునకలుగా ఉన్నారు.

రాష్ట్రంలో గత ఐదేళ్లుగా వైసీపీ రాక్షస పాలనపై అలుపెరుగని పోరాటం చేస్తూ తన దృష్టిని పూర్తిగా రాష్ట్రంపైనే కేంద్రీకరించారు.   అంతకు ముందు ఐదేళ్లు రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నా రాష్ట్ర విభజన  సమస్యల కారణంగా  ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి సారించలేదు.  రాజధాని అమరావతిని  రూపుదిద్దేపనిలో రికార్డు స్థాయిలో భూమి సేకరించి అభివృద్ధి బాటలు వేసారు. 2019లో ఊహించని పరాజయంతో  విపక్షానికే పరిమితమైన తెలుగుదేశం పార్టీని 2024 ఎన్నికలలో ఘన విజయం సాధించేలా నడిపించడంలో పెట్టినా అవిశ్రాంతంగా శ్రమించారు.  పడిలేచిన కెరటంలా 2024లో తిరిగి అధికారం సాధించి,మళ్లీ అమరావతి అభివృద్ధి పై దృష్టి పెట్టారు.  వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్టు  చేసి 52 రోజులు జైలులో పెట్టినా ఏ మాత్రం ధైర్యం కోల్పోలేదు.  
చంద్రబాబు వ్యూహరచనలలో మేటి.  ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా ఆనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.ముఖ్యంగా జాతీయంగా మోదీని, స్థానికంగా జగన్ ను దీటుగా ఎదుర్కొని నిలిచారు.

2019 ఎన్నికల ముందు ప్రధాని మోదీతో ప్రత్యేక హోదా విషయంలో విభేధించడం ద్వారా ఆయన వ్వూహాలు బెడిసి కొట్టినా, 2024 నాటికి తిరిగి పడి లేచిన కెరటం లాగా మోదీతో సఖ్యత నెరపి అఖండ విజయం సాధించడంతో పాటు ఎన్డీయేలో కీలకంగా మారారు.  అయినా జాతీయ రాజకీయాల జోలికి వెళ్ల కుండా కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలపడం, అమరావతి,పోలవరం పూర్తి  లక్ష్యంగా ముందుకు పోతున్నారు. జాతీయ వ్యవహారాల్లో తలదూర్చిక రాష్ట్రమే ప్రయారిటీగా పనులు చేసుకుంటూ పోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించినట్లు బాబు అనుకుంటే దేశానికి కొత్త ప్రధాని వస్తారన్న మాటలలో నిజం ఉంది.కాని తాను నమ్మిన స్నేహితులను మోసం చేయలేని తత్వం ఆయనను ఎక్కడో నిలబెట్టింది.  తన కున్న 16 స్థానాలతో ఎన్డీఏ ను మూడోసారి అధికారంలో నిలబెట్టారు.  1996లో అటు బీజేపీ,ఇటు కాంగ్రెస్ ను కాదని యూనైటేడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం ఆయన రాజకీయ చాణక్యానికి ఒక మచ్చుతునక. అబ్దుల్ కలాం లాంటి గొప్ప దార్శనికుడిని రాష్ట్రపతిని చేసిన ఘనత ఆయనదే. వాజపేయి ప్రధానిగా ఎన్డీఏ లో బాబు కీలకంగా వ్వవహరించిన అనుభవం మరచిపోలేం.  ఏదిఏమైనా ఈ శతాబ్దపు ప్రముఖరాజకీయ నాయకులలో చంద్రబాబు స్థానం ముందు వరుసలోనే ఉంటుందనడంలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. 

By
en-us Political News

  
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.