Publish Date:Mar 28, 2025
యాంకర్ విష్ణు ప్రియకు శుక్రవారం తెలంగాణ హైకోర్టులో ఊరట లభించలేదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న విష్ణు ప్రియపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరు కావాలని విష్ణు ప్రియకు పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆమె ఈ నెల 20న విచారణకు హాజరయ్యారు. మరోసారి 25న విచారణకు రావాలని పోలీసులు విష్ణు ప్రియకు నోటీసులు ఇచ్చారు. పంజాగుట్ట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని విష్ణు ప్రియ హైకోర్టునాశ్రయించారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తన క్లయింట్ విష్ణు ప్రియపై పోలీసులు అక్రమ కేసు బనాయించి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు విష్ణు ప్రియ అడ్వకేట్ కోర్టులో వాదించారు. విష్ణు ప్రియపై నమోదైన కేసును కొట్టివేయడానికి న్యాయస్థానం జోక్యం చేసుకోదని పోలీసు విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు తీర్పు చెప్పింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న విష్ణు ప్రియపై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైన నేపథ్యంలో కోర్టు నాశ్రయించినట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vishnu-priya-gets-no-relief-from-the-high-court-25-195177.html
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.