విశాఖవాసుల నుంచి నిరసన

Publish Date:May 2, 2023

Advertisement

విశాఖపట్టణం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అని రెండునెలల క్రితం అనౌన్స్ చేసినప్పటికీ నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తొలగలేదు.
ఏప్రిల్ 23, 2015న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అయితే,  2020లో, రాష్ట్రం ఒక చట్టం ద్వారా అమరావతి, విశాఖపట్నం మరియు కర్నూలు అనే మూడు రాజధాని నగరాలను నోటిఫై చేసింది. ఈ నోటిఫై తర్వాత విశాఖలో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. 
విశాఖలో జనజాగరణ సమితి ఆధ్వర్యంలో 'అమరావతి సత్యం - మూడు రాజధానులు భ్రమ' అనే అంశంపై యువజన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ సంఘాల ప్రతినిధులు, పెద్దఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. విలువైన భూములు దోచుకునేందుకే వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిందని... సదస్సులో పాల్గొన్న యువత అభిప్రాయపడింది. సీఎం జగన్ కు చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని జనజాగరణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చాలనే కొత్త సంప్రదాయానికి తెరలేపడం మంచిది కాదన్నారు. ప్రజలను గందరగోళ పరచకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.
విశాఖలో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంలో వైఎస్ ప్రభుత్వం మనసు మార్చుకుంది. విశాఖ పెట్టుబడులకు ఆహ్వానించింది. రెండ్రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్   సుమ్మిట్లో ముఖ్యమంత్రి వైజాగ్ రాజధాని అని అనౌన్స్ చేశారు. నేను కూడా విశాఖకు వచ్చేస్తానని హామి ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనౌన్స్ చేసే సమయానికి అమరావతి రాజధాని కేసు విషయం సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉంది. సుప్రీంలో కేసు విచారణ దశలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ రాజకీయ కారణాలచేత వైజాగ్ క్యాపిటల్ అని అనౌన్స్ చేశారని ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మెన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. అమరావతి క్యాపిటల్ అని హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. రాజధాని విషయంలో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో జనజారణ సమితి మరోసారి ఆందోళన చేపట్టనుంది. బుధవారం ముఖ్యమంత్రి జగన్ వైజాగ్ , విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు.ఇదే అవకాశంగా తీసుకున్న జనజాగరణ సమితి జగన్ కు వ్యతిరేక ప్లెక్సీలను వైజాగ్ లో అంటించింది. ‘‘రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం, సుస్వాగతం అనే ప్లెక్సీలు వైజాగ్ లో అడుగడుగునా దర్శనమిస్తున్నాయి. 
 

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.