విజయసాయిరెడ్డి కాషాయ మంత్రం .. జగన్‌కి గండం?

Publish Date:Mar 7, 2025

Advertisement

రాజకీయాలకు అలవాటు పడిన నాయకులు వాటిని వదులుకోలేరు.. పొలిటికల్ రిటైర్‌మెంట్ అని ఆవేశంలో నిర్ణయం తీసుకున్నా.. ఆ తర్వాత మళ్లీ పాలిటిక్స్ వైపే చూస్తుంటారు.  వైసీపీలో జగన్ తర్వాత జగన్‌లా ఒక వెలుగు వెలిగిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం చేసి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అయితే ఆయన కొత్త పొలిటికల్ ఫ్లాట్‌ఫాం కోసం బీజేపీ ముఖ్యనేతలతో టచ్‌లోకి వెళ్లారన్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

 వైసీపీలో జగన్ తర్వాత విజయసాయిరెడ్డి అనే రేంజ్ ఉండేది. వైసీపీ అధికారంలోకి రాకముందు కూడా పార్టీలో విజయసాయిరెడ్డి పెత్తనం కొనసాగింది. అంతెందుకు వైసీపీ ఆవిర్భవించిన కొత్తల్లో జగన్‌ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినప్పుడు  ఆడిటర్ అయిన విజయసాయిరెడ్డి కూడా ఆయనతో కలిసి 16 నెలలు రిమాండ్ ఖైదీగా జైలు జీవితం అనుభవించారు.

అయితే గత  ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, ఆ తర్వాత విజయసాయి రెడ్డి సైలెంట్ అయిపోవడం, ఇటీవల పార్టీకి గుడ్‌పై చెప్పి.. రాజకీయాలకే గుడ్‌పై చెబుతున్నానని చెప్పడం అన్నీ జరిగిపోయాయి. తాజాగా ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్లబోతున్నారు అనే ప్రచారం మొదలైంది.
ఏపీ విభజన తర్వాత.. కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి.. రాజకీయాలను వదిలేసి.. వ్యవసాయం చేసుకోవడం ప్రారంభించారు. అదే విధంగా వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పిన విజయసాయి రెడ్డి.. నిజంగానే పొలానికి వెళ్లి.. అక్కడ ఫొటోలు దిగి.. తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు  కూడా పెట్టారు.

వైసీపీలో నంబర్ టూగా వ్యవహరించి పార్టీ పునాదుల వేయడం దగ్గర నుంచి పనిచేసిన విజయసాయిరెడ్డి అంటే కేరాఫ్ వైసీపీ అనే ఎవరైనా అంటారు. అంతటి అనుబంధం ఆయనకు ఆ పార్టీతో ఉంది. అంతే కాదు వైఎస్ కుటుంబంతో మూడు తరాల బంధం ఉంది. వైసీపీకి ఆయన ఒక పిల్లర్ గా నిలబడ్డారు. అటువంటి సాయిరెడ్డి వైసీపీని వీడిపోతారు అని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. వైసీపీలో విజయసాయిరెడ్డి స్థానం శాశ్వతం అనుకున్నారు. ఆయనకు అదే పార్టీ తప్ప మరో అప్షన్ ఉండదని అందరూ భావించారు.

అయితే విజయసాయిరెడ్డి మారిన రాజకీయ పరిస్థితుల్లో 2025 కొత్త ఏడాది వస్తూనే వైసీపీకి గట్టి షాక్ ఇచ్చేశారు. ఆయన జనవరి నాలుగవ వారంలో వైసీపీకి రాజీనామా చేశారు. అంతే కాదు రాజకీయాలకే దూరం అన్నారు. వ్యవసాయమే ఇక తన వ్యాపకం అన్నారు.  ఇక ఇదే తన జీవితంలో అసలైన లక్ష్యమని అన్నారు. కట్ చేస్తే ఆయన తాజాగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ హైదరాబాద్ వచ్చిన వేళ ఆయనకు స్వాగతం పలుకుతూ కనిపించారు. దాంతో ఆయన రాజకీయం వీడాలనుకున్నా వీడేది కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆ క్రమంలో మరో వార్త జోరుగా ప్రచారంలోకి వస్తోంది. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరిపోతారంటున్నారు. వైసీపీ నుంచి రెండో సారి రాజ్యసభకు ఎంపికై ఆ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డికి బీజేపీతో మంచి సంబంధాలున్నాయి. ఆయన 2016లో రాజ్యసభకు తొలిసారి ఎంపికైనప్పటి నుంచి కేంద్ర పెద్దలతో  మంచి సంబంధాలు కొనసాగించారు. ప్రధాని మోడీ సైతం ఆయన పేరు గుర్తు పెట్టుకుని పలుకవరించేవారు. అంతే కాదు అత్యంత శక్తివంతమైన నేతగా గుర్తింపు ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా అయితే ఆయనకు అపాయింట్మెంట్లు అడిగిన వెంటనే ఇచ్చేవారు.

అందుకే విజయసాయిరెడ్డి తాను రాజ్యసభ నుంచి తప్పుకుంటున్నపుడు ప్రత్యేకించి మోడీ, అమిత్ షాలకు స్పెషల్‌గా థాంక్స్ చెప్పారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే బీజేపీలోకి విజయసాయిరెడ్డి వెళ్తారని అంటున్నారు. దానికి ఒక డేట్ టైం ముహూర్తం కూడా నిర్ణయించారు అని అంటున్నారు. ఈ ఏడాది జూన్ నెలలో ఆయన కాషాయ తీర్ధం పుచ్చుకుంటారంట.   నిజానికి బీజేపీ పెద్దలతో ఈ రోజుకీ ఆయన రిలేషన్స్ కొనసాగిస్తున్నారని అంటున్నారు. 
విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు రాగానే బీజేపీలో చేర్చుకునేందుకు ఆయనకు ఆహ్వానం అందిందన్న టాక్ వినిపిస్తుంది. అయితే వెంటనే చేరితే వైసీపీని, జగన్‌ని వెన్నుపోటు పొడిచి వచ్చారు అన్న అపవాదు వస్తుందన్న ఆలోచనతోనే విజయసాయిరెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్ అన్న ప్రకటన ఇచ్చారని అంటున్నారు. అందుకే కొన్ని నెలలు ఆగి తన భవిషత్తు ప్రణాళికపై క్లారిటీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారంట. ఇక విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారన్నది టీడీపీ కూటమి పెద్దలకు కూడా ఒక ఐడియా ఉందన్న ప్రచారం ఉంది. 

విజయసాయిరెడ్డి కనుక బీజేపీలో చేరితే జగన్ కి సరికొత్త సవాల్ ఎదురవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. జగన్ ఏ1గా ఉన్న ఆక్రమాస్తుల కేసుల్లో విజయసాయిరెడ్డి ఏ2 నిందితుడిగా ఉన్నారు. ఆ కేసుల విచారణ పురోగతిపై ఈడీ, సీబీఐలపై కోర్టుల నుంచి వత్తిడి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సాయిరెడ్డి కాషాయ కండువా కప్పుకుని అప్రూవర్‌గా మారితే ఇక ఏపీ పాలిటిక్స్‌లో పెనుమార్పులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.