కామారెడ్డి బరిలో రాములమ్మ.. కేసీఆర్ కు చుక్కలేనా?

Publish Date:Aug 25, 2023

Advertisement

 తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు విపక్షాలను డిఫెన్స్ లో పడేయాలన్న ఉద్దేశంతో సొంత పార్టీలో చెలరేగే అసమ్మతి జ్వాలల గురించి కూడా పెద్దగా పట్టించుకోకుండా తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసేశారు. మిగిలిన పార్టీల కంటే ముందుగా 105 మంది పార్టీ అభ్యర్థుల జాబితాలు విడుదల చేసేశారు. తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి అన్నట్లుగా కొన్ని నియోజవకర్గాలలో వెల్లువెత్తుతున్న అసంతృప్తి, అసమ్మతి జ్వాలలను చల్లార్చుకునే బాధ్యతను కూడా తాను ప్రకటించిన అభ్యర్థుల భుజస్కంధాలపైనే పెట్టేశారు.

టికెట్లు దక్కని అభ్యర్థులు ఇప్పటికే తమ దారి ఎటు అన్నది తేటతెల్లం చేసేశారు. రేఖా నాయక్ అయితే ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి దరఖాస్తు కూడా చేసేశారు. మరి కొందరు పార్టీ మారేందుకు రెడీ అయిపోయారు. ఈ వ్యవహారమంతా పక్కన పెడితే కేసీఆర్ స్వయంగా గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించేశారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ మొదలెట్టి.. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఒక చోటు కాదు ఏకంగా రెండు చోట్ల నుంచి పోటీ చేయడానికి కేసీఆర్ నిర్ణయించుకోవడంతోనే జాతీయ రాజకీయాలలో ఆయన పాత్ర నామమాత్రంగానే ఉండబోతున్నదని చెప్పకనే చెప్పేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సరే అదలా ఉంటే.. ఇప్పుడు ఆయన పోటీ చేయనున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలు హాట్ సీట్లుగా మారాయి. గజ్వేల్ లో ఓటమి భయంతోనే ఆయన కామారెడ్డి నుంచీ కూడా పోటీలో దిగుతున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే గజ్వేల్ లో ఆయన ప్రత్యర్థిగా తాను నిలబడతాననీ, అందుకు పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పిస్తాననీ  మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ ప్రకటించేశారు. అసలు కేసీఆర్ మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకోవడానికి గజ్వేల్ లో ఈటల పోటీ సవాలే కారణమని పరిశీలకులు అంటున్నారు.

ఇక బీఆర్ఎస్ కు గట్టిపట్టున్న కామారెడ్డిని ఆయన ఎంచుకోవడంలోనే సేఫ్ గేమ్ ఆడుతున్నారని అవగతమైపోయిందని చెబుతున్నారు. కామారెడ్డిలో కూడా కేసీఆర్ విజయం నల్లేరుమీద బండి నడకేం కాదని బీజేపీ అంటున్నది. కామారెడ్డిలో కేసీఆర్ కు ప్రత్యర్థిగా బలమైన అభ్యర్థిని రంగంలోనికి దింపాలని నిర్ణయించింది.  ఆ బలమైన అభ్యర్థి మరెవరో కాదు రాములమ్మ విజయశాంతి అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా  మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు  షబ్బీర్ అలీ  ఎలాగూ నిలబడతారు. ఇక ఇక్కడ బీజేపీ  మాత్రం స్థానిక నేతలన కాదని విజయశాంతిని బరిలో నిలపాలని నిర్ణయించిందని చెబుతున్నారు.  గతంలో మెదక్ ఎంపీగా బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) నుంచి గెలిచిన విజయశాంతి మరోసారి అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా అదృష్ఠాన్ని పరీక్షించుకోవాలని బావిస్తున్నప్పటికీ.. పార్టీ  కామారెడ్డి నియోజకవర్గం నుంచి కేసీఆర్ కు ప్రత్యర్థిగా తాను రంగంలోకి దిగడం పై విజయశాంతి స్పందించారు.

తాను ఎక్కడ నుంచి పోటీలోకి దిగాలన్నది పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. కామారెడ్డి నుంచి పోటీ చేయమని పార్టీ ఆదేశిస్తే అక్కడ నుంచే రంగంలోకి దిగుతానని స్పష్టం చేశారు. ఎవరిని ఎక్కడ నుంచి పోటీకి దించాలో అధినాయకత్వం నిర్ణయిస్తుంది, ఆ నిర్ణయాన్ని అంతా శిరసావహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.   ఆమె మాటలను బట్టి కామారెడ్డిలో కేసీఆర్ ను ఢీ కొనేందుకు ఆమె సానుకూలంగా ఉన్నారని చెప్పక తప్పదు.  

By
en-us Political News

  
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.