విజయశాంతి.. బీజేపీలో అశాంతి

Publish Date:Jul 28, 2023

Advertisement

విజయశాంతి పరిచయం అక్కర్లేని పేరు. సినీ  పరిశ్రమలో లేడీ అమితాబ్ గా గుర్తింపు పొందిన  నటి. హీరోలకే ప్రాధాన్యముండే ఆ  రంగంలో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే  కాదు.. అప్పట్లో అగ్రహీరోలతో సమానంగా  రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటి. అనంతరం  ఆమె రాజకీయ రంగ ప్రవేశం  చేశారు. రాజకీయాలలో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.   తెలంగాణ రాజకీయాలలో  ఆమె ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు.

కేసీఆర్ విజయశాంతిని తనకు  దేవుడిచ్చిన చెల్లిగా  పేర్కొన్నారు.  అయితే చెల్లి అన్నంత మాత్రాన ఆమె విధానాలతో రాజీపడి ఆగిపోలేదు.  కేసీఆర్‌పై తిరుగుబావుటా ఎగురవేశారు. కేసీఆర్ తో విభేదించిన తరువాత తెలంగాణ ప్రయోజనాల  పరిరక్షణే ధ్యేయమంటూ కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ  పార్టీలో కూడా తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ విషయంలో పెద్దగా పోరాడలేమని భావించిన ఆమె బీజేపీలో చేరారు. అక్కడా ఆమెకు సరైన గుర్తింపు దక్కలేదు.. కేవలం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఓ పదవి కట్టబెట్టి పక్కన పెట్టేశారు.  అయితే విజయశాంతి రాజీపడి సర్దుకు పోయే రకం కాదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి హాజరై అక్కడ తెలంగాణ ఉద్యమ సమయంలో కరుడుగట్టిన సమైక్యవాది అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వేదికపై ఉండటాన్ని సహించలేక మధ్యలోనే వెళ్లిపోయారు. ఆ విషయాన్ని ఆమె దాపరికం లేకుండా మీడియా ముందు కుండ బద్దలు కొట్టారు. అసలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీలో చోటు ఇవ్వడమే కరెక్ట్ కాదని చెప్పారు.

ఒక వేళ పార్టీలో చేర్చుకున్నా ఆయనను ఆంధ్రా వ్యవహారాలకు పరిమితం చేయాలని విశయశాంతి ఎలాంటి మొహమాటాలకూ తావు లేకుండా చెప్పేశారు.   తెలంగాణ ఆవిర్భావాన్ని గట్టిగా వ్యతిరేకించిన   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రి  నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని.. తెలంగాణ పార్టీ ఆఫీసులో జరిగిన సభకు ఆహ్వానించడమేమిటని నిరసన గళం వినిపించారు. ఆయన ఉన్న వేదికపై ఉండటం ఇష్టంలేకే ఆ కార్యక్రమం నుంచి మధ్యలోనే వెళ్లిపోయాను అంటూ ఆమె చేసిన ట్వీట్ బీజేపీకి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లుగా మారిందనడంలో సందేహం లేదు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మనే కాదు.. అందుకు సహకరించిన ఈ చిన్నమ్మను కూడా గుర్తు పెట్టుకోండంటూ నాడు.. అంటే తెలంగాణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందిన రోజు  సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలను విజయశాంతి ట్వీట్ తెలంగాణ వాదులందరికీ గుర్తు చేసింది.

తెలంగాణ కోసం బీజేపీ అన్ని విధాలుగా అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ కు సహకరించిందని ఆ పార్టీ ఇప్పటికీ చెప్పుకుంటుంటుంది. మరి అటువంటి పార్టీ తెలంగాణను వ్యతిరేకించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఎలా అక్కున చేర్చుకుంటోందని తెలంగాణ వాసులు బీజేపీని నిలదీస్తున్నారు. విజయశాంతి తన ట్వీట్ ద్వారా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించినట్లేననీ, ఆయనకు తన నిరసనగళాన్ని గట్టిగా వినిపించినట్లేనని పరిశీలకులు అంటున్నారు.  ఇక ఆ తరువాత మణిపూర్ లో మహిళలపై జరుగుతున్న దారుణాలను గట్టిగా ప్రశ్నించారు. తద్వారా కేంద్రంలోని మోడీ సర్కార్ నిష్క్రియాపరత్వాన్ని నిలదీశారని పరిశీలకులు అంటున్నారు.

ఈశాన్య రాష్ట్రాల ఇన్ చార్జ్ మంత్రిగా ఉన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మణిపూర్ విషయాలు తనను ఎందుకు అడుగుతారంటూ మీడియా ఎదుట అసహనం వ్యక్తం చేసిన సమయంలోనే విజయశాంతి ధైర్యంగా మణిపూర్ ఘటనలపై కేంద్రం వైఖరిని తప్పుపడుతూ ట్వీట్ చేశారు.   మొత్తంగా విజయశాంతి కమలం పార్టీకి దూరం అవుతున్నారన్న సంకేతాలైతే బలంగా వస్తున్నప్పటికీ ఆ విషయంలో విజయశాంతి నుంచి అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు. తన అసంతృప్తిని దాచుకోకుండా బాహాటంగానే వెలిబుచ్చుతున్న విజయశాంతిపై చర్య  తీసుకునే ధైర్యం బీజేపీ చేయలేకపోవడానికి కారణం ఆమె వ్యక్తిత్వమేనని అంటున్నారు పరిశీలకులు. విజయశాంతి తన అసంతృప్తిని బాహాటంగా వెలిబుచ్చుతున్నారు. అదే సమయంలో ఆమెలాగే రాష్ట్ర పార్టీలో అసంతృప్తితో ఉన్న అనేక మంది సమయం కోసం ఎదురు చూస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా బీజేపీ రాష్ట్ర శాఖలో పరిస్థితి బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉందని అంటున్నారు. 

By
en-us Political News

  
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.