రాములమ్మ హ్యాండ్! జంపింగేనా..? ఆపరేషన్ కమల్ 

Publish Date:Sep 7, 2020

Advertisement

సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో పోటికి విజయశాంతి నిరాకరించినట్లు తెలుస్తోంది. దుబ్బాక బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. రాములమ్మ ఇమేజ్ తో లబ్ది పొందాలని కాంగ్రెస్ ప్లాన్ చేసినట్లు, పోటీకి ఫైర్ బ్రాండ్ అంగీకరించినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఉపఎన్నికలో పోటీపై కాంగ్రెస్ కు రాములమ్మ హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం. పోటీ చేసే అంశంపై తెలంగాణ పీసీసీ నేతలు సంప్రదించినపుడు ఆమె నిరాసక్తత తెలిపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డీనే ఈ విషయాన్ని పార్టీ నేతలకు తెలిపినట్లు సమాచారం. విజయశాంతి నో చెప్పడంతో అభ్యర్థిత్వం కోసం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సహ ఇతర పేర్లను పీసీపీ పరిశీలిస్తున్నట్లు గాంధీభవన్ లో చర్చ జరుగుతోంది. 

 

కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి విజయశాంతి నిరాకరించడం వెనక పెద్ద కథే ఉందని తెలుస్తోంది. గతంలో బీజేపీలో పనిచేసిన విజయశాంతి.. మళ్లీ కమలం గూటి వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. బీజేపీ అగ్రనాయకత్వంతో ఆమె టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల ఆమె కేంద్ర సర్కార్ నిర్ణయాలను సమర్ధిస్తూ ట్వీట్లు కూడా చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక లోపే రాములమ్మ కాషాయ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. బండి సంజయ్ కు బాధ్యతలు ఇచ్చాకా పార్టీ కార్యక్రమాల్లో స్పీడ్ పెరిగింది. టీఆర్ఎస్ సర్కార్ టార్గెట్ గా బీజేపీ జనంలోకి వెళుతోంది. కేసీఆర్ పైనా తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది సంజయ్ టీమ్. హైకమాండ్ డైరెక్షన్ లో పార్టీలోకి వలసలు కూడా పెరిగాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ లోని అసమ్మతి నేతలకు గాలం వేస్తున్నారు కమలనాధులు. అందులో భాగంగానే తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న విజయశాంతిని పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం.

 

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రాములమ్మ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. చాలా గ్యాప్ తర్వాత మేకప్ వేసుకుని మహేష్ బాబు సినిమాలో కీ రోల్ పోషించారు. అయితే ఇటీవలే ఆమె రాజకీయాల్లో కొంత యాక్టివ్ అయ్యారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ట్వీట్లు చేస్తున్నారు. రాములమ్మ యాక్టివ్ కావడంతో దుబ్బాక నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయవచ్చని భావించారు.  ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన  ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది. అయితే టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ చెబుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో సత్తా చాటాలని చూస్తోంది. దుబ్బాకలో బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ కు పెద్ద షాకే. బీజేపీ సెకండ్ ప్లేస్ వచ్చినా హస్తానికి ఇబ్బందే. అందుకే రాములమ్మను పోటీ చేయించాలని పీసీసీ నేతలు భావించారు. రాములమ్మ బీజేపీ ఓట్లు చీలుస్తుందని,.. దాంతో కాంగ్రెస్ గెలవకపోయినా సెకండ్ ప్లేస్ లో అయినా ఉంటుందని అనుకున్నారు. కాంగ్రెస్ వ్యూహాన్ని ముందే  పసిగట్టిన బీజేపీ నేతలు.. రాములమ్మను తమ వైపు లాగేశారనే ప్రచారం జరుగుతోంది. విజయశాంతిని రాజ్యసభకు పంపాలని బీజేపీ చూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి త్వరలోనే కాంగ్రెస్ కు హ్యాండిచ్చి రాములమ్మ బీజేపీలో చేరవచ్చని తెలుస్తోంది.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.