వైట్ ఫ్లాగ్ తో విజయ్ సాయి.. రెడ్ బుక్ తో లోకేష్...

Publish Date:Jan 28, 2025

Advertisement

నిన్నటి దాకా ఏ ఎక్స్ వేదికగానైతే తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారో..ఇప్పుడు అదే ఎక్స్ వేదికగా వారిపై పొగడ్తల వర్షం కురిపించి దగ్గరకావలని ప్రయత్నిస్తున్నారు విజయసాయి రెడ్డి. వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి.. ఇక ఇప్పుడు తన లాయలిటీని జగన్ నుంచి పూర్తిగా కూటమి పార్టీలవైపు మార్చేసుకున్నట్లు కనిపిస్తున్నది.

తన రాజీనామా ప్రకటన సందర్భంగా   తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ ల పట్ల తనకు మంచి అభిప్రాయముందనీ, రాజకీయంగా విభేదించానే తప్ప ఇరువురితోనూ తనకు మంచి సంబంధాలున్నాయనీ పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా ఆ తరువాత కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శకటంపై ప్రశంసల వర్షం కురిపించారు. రిపబ్లిక్ డే పరేడ్ లో ఆంధ్రప్రదేశ్  ఏటి కొప్పాక బొమ్మల శకటాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిందని ప్రశంసలు గుప్పించారు. ఇంకా పురాతన కళానైపుణ్యం, సంప్రదాయం,  స్థిరత్వాల పరిపూర్ణ సమ్మేళనంగా శకటాన్ని తీర్చి దిద్దారని పేర్కొన్నారు.  

కేసులు, అరెస్టు భయం, మరీ ముఖ్యంగా కాకినాడ పోర్టు, మద్యం కుభకోణం విషయాలలో పీకల్లోతు మునిగి ఉన్న విజయసాయి.. ఎలాగైనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గుడ్ లుక్స్ లో పడాలన్నప్రయత్నం చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అందుకే  తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని అవకాశం దొరికినా దొరక్కపోయినా, సందర్భం ఉన్నా లేకున్నా పొగడ్తల వర్షంలో ముంచెత్తి ఆకాశానికెత్తేసి మంచి మార్కులు కొట్టేయాలని చూస్తున్నారంటున్నారు.  

అయితే విజయసాయి గిమ్మిక్కులు తెలుగుదేశం, జనసేనలను ఇసుమంతైనా ప్రభావితం చేయడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్  నుంచి కూటమి నేతలందరూ కూడా విజయసాయి తన అక్రమాలు, అరాచకాలకు శిక్ష అనుభవించి తీరాల్సిందేనని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కాకినాడ పోర్టు వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరగాలనీ, దోషులకు శిక్ష పడాలని అంటున్నారు.  మొత్తం మీద విజయసాయి తన సమయాన్నంతా వైసీపీ వ్యతిరేక పార్టీల నేతలతో సత్సంబంధాలు ఏర్పరుచుకునేందుకే వెచ్చిస్తున్నారనీ, ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ చౌకబారు ట్రిక్స్ లా కనిపిస్తున్నాయనీ రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫ‌కేష‌న్ జారీ చేయ‌గానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.