విజయసారెడ్డి అప్రూవర్ గా మారిపోయినట్లేనా? వైసీపీకి ఇక దబిడి దిబిడేనా?

Publish Date:Apr 22, 2025

Advertisement

ఏపీ మద్యం కుంభకోణం విచారణ తుది దశకు వచ్చేసినట్లే కనిపిస్తోంది.  ఈ కేసులో  త్వరలోనే వైసీపీ పెద్దలందరికీ  నోటీసులు అందబోతున్నాయా? అన్న ప్రశ్నకు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే జవాబే వస్తున్నది.  వైసీపీ మాజీ ఎంపీ,  విజయసాయి రెడ్డి  ఈ కుంభకోణంలో కర్త, ఖర్మ, క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని తాను మొదటే చెప్పాననీ అంటున్నారు. అంతే  కాకుండా ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ తాను బయటకు లాగుతాననీ చెబుతున్నారు. తాను ఈ కేసుకు సంంబంధించినంత వరకూ విజిల్ బ్లోయర్ ను అని చెప్పుకుంటున్న విజయసాయి రెడ్డి అసలీ కుంభకోణానికి బీజం పడింది మాత్రం తన నివాసంలోనే అని అంగీకరిస్తున్నారు.  ఈ కుంభకోణం గురించి తనకు తెలిసిన ప్రతీ విషయాన్నీ పోలీసులకు, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు అందజేస్తానని చెబుతున్నారు. ఎంత కాదనుకున్నా విజయసాయి రెడ్డి మాటలు వైసీపీ నేతలకు చెమటలు పట్టిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ పార్టీలో నంబర్ 2గా.. ఒకానొక దశలో డిఫాక్టో సీఎంగా కూడా వ్యవహరించిన విజయసాయిరెడ్డికి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, కుంభకోణాల గురించి క్షుణ్ణంగా తెలుసునని పరిశీలకులు చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీలో, వైసీపీ ప్రభుత్వంలో విజయసాయికి తెలియని విషయమంటూ ఉండే అవకాశం లేదు.  కనుక మద్యం కుంభకోణంలో ఆయన బయటపెడతున్న, పెడతానంటున్న ప్రతి విషయమూ సంచలనాలను రేకెత్తిస్తుందనడంలో సందేహానికి తావు లేదు.  గత రెండు మూడు రోజులుగా ఆయన ట్వీట్లు, మాటలూ చూస్తుంటే.. విజయసాయి అప్రూవర్ గా మారిపోయారా అన్న అనుమానాలు కలుగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.   ఈ కేసులో కర్త, ఖర్మ, క్రియగా వ్యవహరించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే జగన్‌ కోటరీలో కీలకంగా వ్యవహరించిన ఏపీ ఇంటలిజన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా మరో కేసులో అరెస్టయ్యారు. గంటల వ్యవధిలోనే  ఈ ఇద్దరూ అరెస్టు కావడం కాకతాళీయమని భావించలేము. అలాగే ఇదే మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఏపీఎస్ బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరావు సహా పలువురిని విచారించారు. సిట్ వేగం చూస్తుంటే..ఒకరి వెంట ఒకరుగా   వైసీపీ పెద్దలందరినీ విచారణకు పిలవడానికి సిద్ధమైపోయినట్లే కనిపిస్తున్నది. ఇక ఈ కేసులో వైసీపీ పెద్దల విచారణకు విజయసాయిరెడ్డి వాంగ్మూలమే ఆధారమని పరిశీలకులు అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో నిందితులు, ఆరోపణలు ఎదుర్కొం టున్న వారూ అందరూ ఇప్పుడు సీన్ లోకి వచ్చేసినట్లే కనిపిస్తున్నది. రాజ్ కసిరెడ్డి అరెస్టుతో జగన్ వైసీపీ ముఖ్య నేతలతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో  అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. ఈ సమీక్షలో ప్రధానంగా మద్యం కుంభకోణంలో ఇంకా ఎవరెవరు విచారణను ఎదుర్కొనే అవకాశం ుందన్న అంశపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.   

ఇంత జరిగినా, జరుగుతున్నా.. వైసీపీ మాత్రం తమ ప్రభుత్వ హయాంలో మద్యం ఉత్పత్తి, అమ్మకాలూ అత్యంత పారదర్శకంగా జరిగాయని చెప్పుకుంటోంది. ఇప్పుడు తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించడం, సిట్ అరెస్టులు, విచారణలు అంటూ హడావుడి చేయడం అంతా రాజకీయ వేధింపుల్లో భాగమేనని ఆరోపిస్తున్నది. అయితే ఈ ఆరోపణలన్నీ వైసీపీలోని భయాన్నే చూపుతున్నాయనీ, వైసీనీ నేతల ప్రకటనలు, వ్యాఖ్యలు అన్ని మేకపోతు గాంభీర్య ప్రదర్శన కిందకే వస్తాయనీ పరిశీలకులు అంటున్నారు. విజయసాయి వాంగ్మూలం ఎఫెక్ట్ వైసీపీమీద గట్గిగానే పడిందనడానికి తాడేపల్లిలోని వైసీపీ కేంద్రకార్యాలయంలో జగన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడమే తార్కానమంటున్నారు. 

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.