విజయసాయి కొత్త పార్టీ పీఆర్ పీ: ఏపీ ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యమని ప్రకటన.!

Publish Date:Nov 11, 2026

Advertisement

రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి కొత్తపార్టీని అధికారికంగా ప్రకటించారు. తాను ఏర్పాటు చేసిన పార్టీ పెరును ఆయన ప్రకటించారు. విజయవాడ ఏ కన్నెన్షన్ వేదికగా బుధవారం (నవంబర్ 11) సరిగ్గా 11 గంటల 11నిముషాలకు ఆయన తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. తన  కొత్త పార్టీ పేరు పీఆర్పీ (పరివర్తన రాజనీతి పార్టీ)గా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. దీంతో ఏపీ రాజకీయాలలో మరో కొత్తపార్టీ ఆవిర్భవించింది.  

గతంలో వైపీపీలో కీలక నేతగా చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి, ఆ తరువాత ఆ పార్టీకీ, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన  రాజ్యసభ సభ్యత్వానికి  రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా సందర్భంగా ఇక రాజకీయాలకు దూరం, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించిన విజయసాయి రెడ్డి, ఆ నిర్ణయం మార్చుకుని, యూటర్న తీసుకుని మళ్లీ రాజకీయ ప్రవేశం చేశారు. 

 తన కొత్త రాజకీయ పార్టీ పేరు ప్రకటించిన ఆయన ఈ  సందర్భంగా పార్టీ జెండా, ఎజెండాను  ఆవిష్కరించారు. రాష్ట్రంలో కుల, మత రాజకీయాలకు స్వస్తి పలకడంతో పాటు, రెండు కుటుంబాల ఆధిపత్య రాజకీయాలకు ముగింపు పలకడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. 

దేశభక్తి, ప్రజా సంక్షేమం,  ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా పీఆర్పీ  పనిచేస్తుందని విజయసాయిరెడ్డి చెప్పారు. ముఖ్యంగా యువతను భావి నాయకులుగా తీర్చిదిద్దే ఫ్యాక్టరీగా తమ పార్టీ పని చేస్తుందన్న విజయసాయిరెడ్డి,  రాష్ట్రంలో కరువు కాటకాలు, కరెంటు కోతలు లేని పరిస్థితులను సృష్టించడం, ప్రతి ఎకరానికి సాగునీరు అందించడం తమ ధ్యేయమన్నారు.

ఇది కూడా చదవండి:  వైసీపీలో నన్ను బతకనివ్వలేదు.. 70కి పైగా అవమానాలు భరించా: విజయసాయి రెడ్డి
ఇక ఎన్నికల హామీల విషయంలోనూ ఆయన కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ అందించడం, చదువుల భారాన్ని తగ్గించి వంద శాతం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 

విజయసాయిరెడ్డి నూతన పార్టీ ప్రకటన రాష్ట్ర రాజకీయాలలో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న చర్చ మొదలైంది.  ఇప్పటికే పలువురు అసంతృప్త నేతలు ఆయన బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.  రానున్న రోజుల్లో ఈ కొత్త పార్టీ రాష్ట్ర రాజకీయాలపై చూపే ప్రభావంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు తెరలేచింది. 

మీకు నచ్చవచ్చు: విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే.!​

తెలుగుదేశం, వైసీపీ దొందూదొందే.. రాష్ట్రానికి చేసిందేమీ లేదు.. విజయసాయిరెడ్డి.!


[Vijayasai Reddy New Party PRP, Parivarthana Rajaneethi Party, Andhra Pradesh Politics, Vijayawada Convention Center, Gen Z Leaders, Telugu One]

By
en-us Political News

  
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం ఉన్నట్లు సృష్టించారు.. జీతం రాకపోయినా వేలల్లో జీతం అందుతున్నట్లు నకిలీ పే స్లిప్పులు తయారు చేశారు.
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న ఒక అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తెలంగాణ పోలీసు వ్యవస్థలోకి మరో కొత్త తరం అడుగుపెట్టింది.
ప్రధాని కావాలనుకోవడం తప్పా.. ప్రణబ్ కుమార్తె కౌంటర్.! 
ఉద్యోగం.. మంచి జీతం.. ఉచిత వసతి.. ఇవన్నీ ఆశ చూపించి యువతులను హైదరాబాద్‌కు రప్పించడం
వీసీ జానయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. గవర్నర్‌కు మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు.!
టెక్నాలజీ రంగంలో యువత తమ సృజనాత్మకతతో అద్భుతాలు సృష్టిస్తున్నారు.
యువకులపై హోటల్ సిబ్బంది, యాజమాన్యం అనుచరుల దాడి.!
రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత కాలంలో చర్చనీయాంశంగా మారిన పరిణామాలపై ప్రధాన రాజకీయ పార్టీలు బాధ్యతాయుతమైన వైఖరిని ప్రదర్శిస్తున్నాయి.
రాజకీయాలలో ఆధిపత్యం కోసం కుమ్ములాటలూ, తగాదాలు, విభేదాలు. అటువంటి కారణాలతోనే కేసీఆర్ కుటుంబం నుంచి కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంత రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) ఏర్పాటు చేశారు.  సరిగ్గా అటువంటి తాగాదాలతోనే వైఎస్ రాజశఖరరెడ్డి కుమార్తె, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు స్వయానా చెల్లెలు అయిన వైఎస్ షర్మిల అన్నతో వేరుపడి సొంత బాటలో నడుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.