కొత్త పార్టీయే..తిరుమల వేదికగా కన్ ఫర్మ్ చేసిన విజయసాయి.!
Publish Date:Aug 19, 2026
Advertisement
మాజీ ఎంపీ, రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే వ్యాపకం అని చాటిన విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయ అడుగులు ప్రారంభించారు. గత కొంత కాలంగా ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన బీజేపీలోకి చేరతారనీ, కాదు కాదు మళ్లీ వైసీపీ గూటికి చేరనున్నారంటూ పెద్ద ఎత్తున జరుగుతున్నచర్చోపచర్చలకు, ఊహాగాన సభలకు తెరదించుతూ ఆయన కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. బుధవారం (ఆగస్టు 19) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న విజయసాయి రెడ్డి దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై స్పష్టత ఇచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు కొత్త వేదికను సిద్ధం చేస్తున్నట్లు చెప్పిన విజయసాయి.. ప్రజల తరఫున నిలబడి వారి హక్కుల కోసం ప్రశ్నించే బలమైన గొంతుకగా తాను నూతన పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం, ప్రయోజనాలే ధ్యేయంగా తమ భవిష్యత్ రాజకీయ ప్రస్థానం ఉంటుందన్నారు. పార్టీ నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక ప్రక్రియను ఈ నెల్లోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించిన విజయసాయి.. పార్టీ పేరు, జెండా, విధానాలు, కార్యాచరణకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. గతంలో వైసీపీలో కీలక నేతగా, రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన విజయసాయిరెడ్డి, ఆ తరువాత వైసీపీ నుంచి బయటకు వచ్చి రాజకీయ సన్యాసం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇప్పుడు సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి క్రియాశీలం కానుండటం విశేషం. విజయసాయి ఏర్పాటు చేయనున్యన కొత్త రాజకీయ పార్టీ ఏపీ రాజకీయాల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. Vijayasai Reddy, New Political Party, Tirumala Srivari Darshan, AP Politics, Vijayasai Reddy Party Announcement
http://www.teluguone.com/news/content/vijayasai-reddy-25-229236.html





