Publish Date:Aug 18, 2026
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి సంబంధించి వైసీపీ అధినేత జగన్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలి సభ్యుడు తూమాటి మాధవరావును ఈ పదవికి వైసీపీ తరఫున అభ్యర్థిగా ఖరారు చేశారు. దీంతో మంగళవారం (ఆగస్టు 18) తూమాటి మాధవరావు శాసనమండలి కార్యదర్శికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. రాష్ట్ర శాసనమండలిలో వైసీపీకి సంఖ్యా బలం స్థానం ఉండటంతో.. డిప్యూటీ ఛైర్మన్‌గా ఆయన ఎన్నిక కావడం లాంఛనమే.
నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన వెంటనే, తూమాటి మాధవరావు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాధవరావును ఈ సందర్భంగా జగన్ అభినందించారు. ఈ సందర్భంగా శాసనమండలిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ ఆయనకు దిశానిర్దేశం చేశారు. తూమాటి మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా చూడాలని, పార్టీ ఎమ్మెల్సీలందరూ సమన్వయంతో వ్యవహరించాలని జగన్ ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్సీలను ఆదేశించారు.
Thumati Madhava Rao, YSRCP, AP Legislative Council, Deputy Chairman Nomination, YS Jagan Mohan Reddy, Andhra Pradesh Politics
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/thumati-madhava-rao-25-229222.html
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.