విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే.!

Publish Date:Oct 20, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన తన పార్టీ ప్రకటన ముహూర్తాన్ని అధికారికంగా ప్రకటించారు.

విజయసాయిరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్ 11వ తేదీన ఈ నూతన రాజకీయ వేదిక లాంఛనంగా ప్రారంభం కానుంది. సరిగ్గా అదే రోజు ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలోని ప్రతిష్టాత్మక ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు కొనసాగుతున్న రాజకీయ ధోరణులకు చెక్ పెట్టడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా రెండు ప్రాంతీయ పార్టీలు, రెండు కుటుంబాల చేతుల్లో సాగుతున్న దోపిడీ విధానాలకు చరమగీతం పలకడమే అజెండాగా ఈ కొత్త పార్టీని ప్రజల ముందుకు తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు.

కులం, మతం ఆధారంగా జరిగే రాజకీయాలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, ప్రస్తుత రాజకీయాల్లో వినిపిస్తున్న కక్షసాధింపులు, ఫ్యాక్షన్ పోకడలకు రాష్ట్ర ప్రజలను విముక్తులను చేయడమే తమ ధ్యేయమని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ఆకాంక్షలకే పెద్దపీట వేస్తామన్నారు.

నూతన పార్టీ సిద్ధాంతాలు  కార్యాచరణ ప్రణాళికను కూడా ఆయన ప్రాథమికంగా వివరించారు. రాష్ట్రంలో కరవు కాటకాలకు తావులేకుండా, విద్యుత్ కోతలు లేని బంగారు ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ఎకరా భూమికి రెండు పంటలకు సరిపడా సాగునీటిని అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రతి పేద కుటుంబానికి మేలు చేసేలా ప్రతి ఇంటికీ ఉచిత విద్యుత్ అందిస్తామని, రాష్ట్రంలోని యువతకు నూటికి నూరు శాతం ఉపాధి కల్పన దిశగా ప్రత్యేక విధానాలు రూపొందిస్తామని ఆయన హామీల వర్షం కురిపించారు. దేవుని ఆశీస్సులు, ప్రజల మద్దతుతో ఈ ప్రయాణం సాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

విజయసాయిరెడ్డి వంటి సీనియర్ నేత ప్రత్యక్ష రాజకీయాల్లోకి సొంత పార్టీతో వస్తుండటం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాబోయే రోజుల్లో ఈ పార్టీ ఏయే వర్గాలను ఆకట్టుకుంటుంది, ఏ రకమైన రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

 

 

[ Vijayasai Reddy, New Political Party, AP Politics, Vijayawada, Gen Z Leadership, Ex YSRCP Leader, YS Jagan, CM Chandrababu, Nara lokesh, TDP, YSRCP, Telugu News, Telugu One ]


 

By
en-us Political News

  
ప్రజల ప్రాణాలకు ముప్పు కలగకూడదని హెచ్చరించడమే ఆయన చేసిన నేరమైంది.
భారతీయ ఆర్థిక వ్యవస్థలో నల్లధనం అరికట్టేందుకు, అవినీతిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో పెద్ద నోట్ల రద్దు అంశం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఒక షాకింగ్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
దీపావళి పండుగ వేళ ఛత్తీస్‌గఢ్‌లో అత్యంత హృదయ విదారకరమైన ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది.
ఇటీకాల కాలంలో టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులతో పాటు ఉద్యోగుల పని వాతావరణంలోనూ విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
పండుగ వేళ నగరంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తెలుగు రాష్ట్రాల ప్రజలను వాతావరణ శాఖ మరోసారి అప్రమత్తం చేసింది.
హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల వేళ అపశ్రుతి చోటుచేసుకుంది.
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.