ఒంగోలు వెళ్లి మరీ జ్యోతిష్యుడితో విజయమ్మ భేటీ.. మతలబేంటి?

Publish Date:Oct 14, 2023

Advertisement

మాజీ సీఎం రాజశేఖరరెడ్డి సతీమణి, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్ టీపీ అధినేత్రి  ష‌ర్మిల మాతృమూర్తి వైఎస్ విజ‌య‌మ్మ తాజాగా ఓ జ్యోతిస్యుడిని కలిశారు. దీంతో ఇప్పుడు ఈ విషయం  రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒంగోలు స‌మీపంలో ప్ర‌ముఖ సిద్ధాంతిగా పేరున్న అద్దేపల్లి హనుమంతరావుని విజయమ్మ క‌లిసి చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

 అయితే, ఈ సిద్ధాంతి వద్ద సీఎం జగన్ మోహన్ రెడ్డి భవితవ్యం చెప్పించారా? లేక షర్మిల రాజకీయ భవిష్యత్ గురించి అడిగానా అన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఇక, వైఎస్ఆర్ కుటుంబంలోనే క్రిస్టియానిటీని బలంగా నమ్మే వారిలో విజయమ్మ ముందుటారు. ఎప్పుడు, ఎక్కడకి వెళ్లినా బైబిల్ చేతిలోనే ఉంచుకొనే విజయమ్మ ఒక్కసారిగా ఇలా జ్యోతిస్యులు, సిద్ధాంతుల వద్దకు వెళ్లడం ఆసక్తికర పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ విషయంపై రాజకీయవర్గాలలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది.  విజయమ్మ ప్రస్తుతం కుమార్తె షర్మిల వద్దనే ఉంటున్న సంగతి తెలిసిందే. కాగా, అల్లుడు అనిల్ కుమార్ ప్రఖ్యాత పాస్టర్ అనే సంగతి కూడా తెలిసిందే. అరచేతితో వర్షాన్ని ఆపడం, దీర్ఘకాలిక రోగాలను కూడా చిటికెలో నయం అయ్యేలా ప్రార్ధనలు చేసే అల్లుడు అనిల్ ఉండగా.. విజయమ్మ ఓ సిద్ధాంతి కోసం ఒంగోలు వరకూ వెళ్లడం ఆసక్తి కలిగిస్తోంది.

విజయమ్మ ఎందుకు వెళ్లారు?.. హిందూ సిద్ధాంతాలు, జాతకాలను కూడా ఆమె నమ్ముతారా అన్న విషయాలను అలా ఉంచితే.. ఆమె ఎవరు కోసం వెళ్లారంటే రాజకీయ వర్గాలు మాత్రం షర్మిల కోసమే అంటున్నాయి. షర్మిల వైఎస్సార్ టీపీ  భ‌విత‌వ్యం, అభ్య‌ర్థుల‌కు బీఫాంలు ఇచ్చే అంశాలపై విజయమ్మ జాత‌కాలు అడిగి తెలుసుకున్నట్లు చెప్తున్నారు. శుభ ఘడియలపై సిద్ధాంతితో చర్చించినట్లు తెలుస్తున్నది. సుమారు మూడు గంట‌ల‌పాటు ఆమె స‌ద‌రు సిద్ధాంతితో చ‌ర్చ‌లు జరపగా అనంతరం ఆమె తిరిగి మళ్ళీ హైద‌రాబాద్  చేరుకున్నారు. విజయమ్మ హైదరాబాద్ నుండి 350 కిమీ దూరం ఉన్న ఒంగోలుకు వచ్చి.. మళ్ళీ 350 కిమీ హైదరాబాద్ వెళ్లారు. కానీ, ఒంగోలు నుండి జగన్ నివాసం తాడేపల్లి గూడెం 250 కిలోమీటర్లు మాత్రమే. అయినా విజయమ్మ తాడేపల్లి వెళ్లకుండానే తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు.  దీంతో వైఎస్ కుటుంబంలో గొడవలు, సొంత తల్లే సీఎం జగన్ కు దూరంగా ఉండడంపై మరోసారి రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

కాగా, విజయమ్మ ఒంగోలు పర్యటన రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య‌ ఆస‌క్తికర చ‌ర్చకు దారి తీస్తుంది. రాజ‌కీయాల్లో ఉన్న వైఎస్ కుటుంబం తమ తాతల కాలం నుండే క్రిస్టియానిటీని బలంగా నమ్ముతారు. కుటుంబం అంతా జెరూసలేం వరకూ వెళ్లి ప్రార్ధనలు చేసి వస్తారు. అయితే, ఈ మధ్య కాలంలో వైఎస్ కుటుంబం కూడా సిద్ధాంతులు, మఠాల‌ను న‌మ్ముకుని ముందుకు సాగుతోంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో వైఎస్ జ‌గ‌న్ కూడా విశాఖ శార‌దా పీఠాన్ని న‌మ్ముకున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నిక‌ల‌కు ముందు జగన్ శారదా పీఠాన్ని సంద‌ర్శించి.. అక్క‌డే అభ్య‌ర్థుల విష‌యాన్ని పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామితో చ‌ర్చించారు. అప్పట్లో ఈ పర్యటన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దుమారం రేపింది. జగన్ శారదా పీఠం పర్యటన అనంతరం మాత్రమే వైసీపీ అభ్యర్థులను ప్రకటించారు.  

అలాగే ఇప్పుడు తొలిసారి సొంత పార్టీతో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్తున్న ష‌ర్మిల కూడా స్వాములు, మంత్రుల‌ను న‌మ్ముకున్నార‌నే ప్రచారం మొదలైంది. అయితే, ఇప్పుడు షర్మిల రాకుండా విజయమ్మను పంపించడం ఆసక్తిగా కనిపిస్తుంది. విజయమ్మ ఈ ఒంగోలు పర్యటనలోనే వైసీపీ కీలక నేతలను కొందరిని కలిసినట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. విజయమ్మ ఒంగోలు వెళ్ళగానే ముందుగా టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లగా.. ఆ తర్వాత మరో ముఖ్యనేత బాలినేని శ్రీనివాసరెడ్డి, కర్నూలు వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డిని కూడా కలిసినట్లు తెలుస్తున్నది. అయితే, జగన్ కు దూరంగా ఉంటున్న విజయమ్మ వైసీపీ ముఖ్య నేతలను కలవడంపై కూడా ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. 

By
en-us Political News

  
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.