విజయ డెయిరీ చైర్మన్ పదవికి చలసాని రాజీనామా.. తెలుగుదేశంలో అసలేం జరుగుతోంది?

Publish Date:Aug 8, 2026

Advertisement

తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది. పార్టీ వ్యవహారాలపై చంద్రబాబు దృష్టి పెట్టడం లేదా? కొందరు పార్టీ విషయాలు చంద్రబాబు వరకూ చేరకుండా చక్రం తిప్పుతున్నారా అన్న అనుమానాలు వెల్లువెత్తున్నాయి. విజయా డెయిరీ ఎన్నికల్లో  చోటు చేసుకున్న పరిణామాలు తెలుగుదేశం పార్టీలో సంచలనానికి కారణమయ్యాయి.  ఈ పరిణామాల పట్ల పార్టీ శ్రేణుల్లోనూ తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం అవుతోంది. విషయమేంటంటే.. విజయా డెయిరీ  ఎన్నికలలో చైర్మన్‌గా చలసాని ఆంజనేయులు ఏకగ్రీవంగా  ఎన్నికయ్యారు. అయితే ఆ ఎన్నిక జరిగిన గంటల వ్యవధిలోనే  ఆయనపై రాజీనామా చేయాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి.  ఈ ఉదంతం  తెలుగుదేశం పార్టీలోనూ, పాడి రైతుల్లోనూ కూడా హాట్ టాపిక్ గా మారింది. 

తాజాగా జరిగిన ఎన్నికలలో మొత్తం 15 మంది డైరెక్టర్లలో ఖాళీ అయిన మూడు స్థానాలకు చలసాని ఆంజనేయులు, పల్లాగాని రాంబాబు, గొంది నరేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే నిర్వహించిన చైర్మన్ ఎన్నికలో డైరెక్టర్లందరూ కలిసి చలసాని ఆంజనేయులను విజయ డెయిరీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా  ఎన్నుకున్నారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. 

అయితే..  ఎన్నిక ముగిసిన వెంటనే నాటకీయ పరిణామాలు మొదలయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి చలసాని ఆంజనేయులతో భేటీ అయి చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలిపారు. పార్టీయా,   చైర్మన్ పదవా తేల్చుకోవాలంటూ అల్టిమేటమ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ  పరిణామంలో  మనస్తాపానికి గురైన చలసాని ఆంజనేయులు  అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు.

అసలు ఆయనను రాజీనామా చేయాలంటూ తెలుగుదేశం హైకమాండ్ ఒత్తిడి తీసుకురావడానికి  గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సహా పలువురు తెలుగుదేశం నేతలు  చలసాని ఎన్నికను వ్యతిరేకించడమేనంటున్నారు.  విజయాడెయిరీ చైర్మన్ గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించిన వెంటనే.. ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే విధంగా ఎమ్మెల్యే ఆయన వర్గీయులు చేసిన ప్రయత్నాలను మెజారిటీ డైరక్టర్లు వ్యతిరేకించి..   ఏకగ్రీవంగా ఎన్నుకున్నరోజు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎమిటని నిలదీసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే.. పార్టీ హైకమాండ్ చలసాని రాజీనామాకు ఒత్తిడి చేయడం పార్టీలో సంచలనంగా మారింది.  

దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో  క్రియాశీలంగా పనిచేస్తున్న  సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు.  ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్  చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 1200 కోట్ల రూపాయల  టర్నోవర్‌తో పాడి రైతులకు ఏటా మూడుసార్లు బోనస్ ఇస్తూ లాభాల్లో నడుస్తున్న విజయ డెయిరీలో   రాజకీయ వివాదాలు సంస్థ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

ప్రజాస్వామ్యంగా బద్ధంగా ఎన్నుకున్న చైర్మన్ ను ఒక్క రోజులోనే రాజానామాకు ఒత్తిడి రావడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం తెలుగుదేశం వర్గీయులలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న నేతకు ఈ స్థాయిలో అవమానాలు ఎదురౌతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిసే ఇదంతా జరుగుతున్నాయా అన్న అనుమానాలు పార్టీ నేతలు, శ్రేణుల్లోనే వ్యక్తం అవుతున్నాయి.  

అదలా ఉంటే.. ఈ పరిస్థితుల్లోనూ చలసాని  పార్టీ హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి తన పదవికి రాజీనామా చేయడం.. పార్టీ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు అద్దంపడుతోందని అంటున్నారు.   పార్టీ అధిష్ఠానం ఆదేశాలను శిరసావహిస్తూ తాను విజయడెయిరీ న ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన చలసాని   పదవుల కంటే పార్టీ ప్రయోజనాలు, క్రమశిక్షణ, పార్టీ నాయకత్వ ఆదేశాలను అమలు చేయడమే తనకు ముఖ్యమని చలసాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.  మొత్తంగా ఈ వ్యవహారం తెలుగుదేశం శ్రేణులకే పార్టీ నాయకత్వం తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యేలా చేసిందని పరిశీలకులు అంటున్నారు. 

Vijaya Dairy Chairman Election, Chalasani Anjaneyulu, Krishna Milk Union, Yarlagadda Venkata Rao, Kollu Ravindra Kolusu Parthasarathy, halasani Resigb

By
en-us Political News

  
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న  స్థానిక  ఎన్నికల్లో  బీజేపీకి  ఏ పార్టీతోనూ  పొత్తులు పెట్టుకునే ఆలోచన  లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్‌కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్‌లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
రిజర్వేషన్ల విధానాన్ని అంబేడ్కర్ ఆశయాలు, దృక్పథానికి అనుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మోహన్ భగవత్.. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల విధానం ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రిజర్వేషన్లు కేవలం రాజకీయ ప్రాతిపదిక కాదనీ సామాజిక అనివార్యత అన్నారు.
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.