బొట్టు పెట్టుకుని...ఫ్యాంటు షర్టు ధరించిన బ్రాహ్మణుడికి పదవి ఇచ్చిన విజయ్
Publish Date:May 10, 2026
Advertisement
తమిళ మార్కు ద్రవిడ సంప్రదాయాలకు టీవీకే విజయ్ చెక్ పెట్టేశారా? ఆయన ద్రవిడ జాతీయ వాదం ఇందుకు అంబేద్కరిజం అదనం.. కాగా.. గత సంప్రదాయానికి స్వస్తి పలికారా? అన్న చర్చకు తెరలేచింది. అదెలాగో చూస్తే.. కరుణానిధి, ఎంజీఆర్, పన్నీర్ సెల్వం, పళనిస్వామి, స్టాలిన్.. వీరంతా కూడా తమిళ ముఖ్యమంత్రులుగా చేశారు. వీరంతా కూడా తమిళ ద్రవిడ సంప్రదాయం ప్రకారం అడ్డపంచె కట్టుకునే కనిపించేవారు. ప్రమాణ స్వీకారానికి ముందు ప్రభుత్వంలోకి వచ్చినపుడు కూడా వారెప్పుడూ తమ ఓల్డ్ తమిళ ద్రవిడ కల్ట్ ని వదల్లేదెప్పుడూ.. తమిళ రాజకీయ చరిత్రలోనే తొలిసారి.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ద్రవిడ సంప్రదాయక ఆహార్యాన్ని వదిలి.. నార్మల్ ఫ్యాంట్ షర్ట్ తో పాటు పైన కోటు ధరించి కనిపించారు. 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి 2026 వరకూ ఇంత వరకూ వారు ఏ ఒక్క బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవులు ఇవ్వలేదు. జయలలిత సాక్షాత్ సీఎంగా ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారే అయినా.. ఆమె కూడా ఎప్పుడూ తన మంత్రివర్గంలో బ్రాహ్మణులను తీసుకోలేదు. ఎందుకంటే ద్రవిడ వాదం అంటే అది బ్రాహ్మణ భావజాలానికే వ్యతిరేకం అన్నదిక్కడ ప్రచారంలో ఉండటంతో దీన్నే ఫాలో అయ్యేవారు. కానీ తిరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖరన్ ఈ సంప్రదాయాన్ని కాదని తొలిసారిగా పీ. వెంకటరమణన్ అనే మైలాపూర్ కి చెందిన బ్రాహ్మణ ఎమ్మెల్యేకి తన కేబినేట్ లో చోటు కల్పించారు. లా గ్రాడ్యుయేట్ అయిన వెంకటరమణన్ 2000 సంవత్సరం నుంచి విజయ్ కు మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. బ్రాహ్మణ వ్యతిరేకత అనేది ఒక కాలం చెల్లిన సిద్ధాంతమని అంటారీయన. ఇక మూడవ ముఖ్యమైన అంశం జోసెఫ్ విజయ్ తన ప్రమాణ స్వీకారానికి బొట్టు పెట్టుకొని ప్రమాణ స్వీకారానికి హాజరు అయ్యాడు.. విజయ్ ఒక్కడే కాదు వాళ్ళ అమ్మ కూడా బొట్టుతోనే కనిపించారు. ఇవన్నీ ఇలా ఉంచితే ఆయన సహజీవనం చేస్తున్నారని ప్రచారం జరుగుతోన్న త్రిష సైతం బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారే. వీటన్నిటినీ బట్టీ చూస్తుంటే గత అరవై డెబ్భై ఏళ్లుగా తమిళనాడులో వస్తోన్న తమిళ కల్ట్ ద్రవిడ కల్చర్ కి అడ్డుకట్ట వేయబోతున్నారా? సరికొత్త రాజకీయాలకు మరింత తెరలేపనున్నారా? అన్నది తేలాల్సి ఉంది.
http://www.teluguone.com/news/content/vijay-36-219384.html





