విడదల రజినికి బిగుస్తున్నఉచ్చు!

Publish Date:Mar 5, 2025

Advertisement

మంత్రిగా ఉన్నప్పుడు ఇష్టానుసారం చెలాయించి, కలెక్షన్ క్వీన్ అనిపించుకున్న మాజీ మంత్రి విడదల రజినికి ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది. అక్రమ వసూళ్లలో ఆమెకు సహకరించిన అధికారులు కూడా కేసుల చట్రంలో చిక్కుకుంటున్నారు. స్టోన్‌ క్రషర్‌ ఓనర్లను బెదిరించి కోట్లు వసూలు చేసినట్లు రజిని అండ్ టీమ్‌పై సదరు బాధితులు ఫిర్యాదు చేశారు. దాంతో ఆమె విచారణకు  అనుమతి కోసం ఏసీబీ గవర్నర్‌కు లేఖ రాసింది. ఇప్పటికే ఆమెకు సహకరించిన ఐపీఎస్‌ అధికారి జాషువాపై విచారణకు గ్రీన్‌సిగ్నల్‌ లభించడంతో  త్వరలో కేసు నమోదవ్వడం ఖాయంగా కనిపిస్తున్నది. దాంతో అరెస్టుల పర్వంలో నెక్ట్స్ రజినినే అంటున్నారు.

పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలుచేశారన్న అభియోగాలతో వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని, ఐపీఎస్‌ అధికారి పల్లె జాషువాపైపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. రజిని అధికారంలో ఉన్నప్పుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని యడ్లపాడులోని స్టోన్‌క్రషర్ ఓనర్లను అయిదు కోట్లు డిమాండ్ చేసి రూ.2.20 కోట్లు ముక్కుపిండి వసూలు చేయించారంట.

ఈ అక్రమ వసూళ్లకు సంబంధించి ఐఏఎస్ అధికారి జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ ప్రకారం ఏసీబీ తాజాగా సీఎస్‌ అనుమతి తీసుకుంది. విడదల రజినిపై విచారణకు అనుమతి కోసం గవర్నర్‌కు లేఖ రాసింది. ప్రస్తుతం అది అక్కడ పెండింగ్‌లో ఉంది. ఒకటి, రెండు రోజుల్లో ఆమోదం లభించే అవకాశముందంటున్నారు. గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే కేసు నమోదు చేయనున్నారు. 

శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌ యజమానులను బెదిరించి, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న ఫిర్యాదులపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రూ.5కోట్లు డిమాండు చేసి.. రూ.2.20 కోట్లు వసూలు చేశారని, అందులో రజినికి రూ.2 కోట్లు, జాషువాకు రూ.10 లక్షలు, రజిని పీఏకు రూ.10 లక్షలు చెల్లించారని విజిలెన్స్‌ తేల్చింది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించగా.. కేసు నమోదు కోసం అవసరమైన అనుమతులు ఏసీబీ అధికారులు తీసుకుంటున్నారు. 

2020 సెప్టెంబరు 4న అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని పీఏ రామకృష్ణ... శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్‌క్రషర్‌ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే పిలుస్తున్నారని, వెంటనే రావాలని యజమానులకు హుకుం జారీచేశారంట. అప్పటికి రజినికి జగన్ ఇంకా మంత్రి పదవి ఇవ్వలేదు. ఎమ్మెల్యేగానే దందాలు మొదలు పెట్టిన రజినిని క్రషర్ ఓనర్లు కలవగా.. క్రషర్‌ కార్యకలాపాలు కొనసాగాలంటే తనకు రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండు చేశారంట. తర్వాత కొన్నాళ్లకే నాటి గుంటూరు జిల్లా రీజినల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారిగా ఉన్న పల్లె జాషువా క్రషర్‌లో తనిఖీలు చేశారు. అనేక అవకతవకలు ఉన్నాయని, రూ.50కోట్ల జరిమానా చెల్లించాలని యజమానులను బెదిరించారు.

కొన్నాళ్ల తర్వాత జాషువా వారికి ఫోన్‌చేసి విడదల రజిని చెప్పినట్లు చేస్తారా? లేదా రూ.50 కోట్ల జరి మానా విధించి.. క్రషర్‌ సీజ్‌ చేసేయాలా? అని బెదిరించారంట. కొన్నాళ్ల తర్వాత క్రషర్‌ యజమానులను తన కార్యాలయానికి పిలిపించుకుని, త్వరగా సెటిల్‌ చేసుకోవాలని హెచ్చరించినట్లు విజిలెన్స్ నివేదిక  పేర్కొంది .జాషువా నుంచి ఒత్తిడి పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్టోన్‌క్రషర్‌ యజమానులు డబ్బులు చెల్లించాల్సి వచ్చిందంట. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే క్రిమినల్‌ కేసులు పెడతామని, వ్యాపారం మూయించేస్తామని బెదిరించారంట. ఆ మేరకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ ప్రభుత్వానికి నివేదించడంతో దాని ఆధారంగానే ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేయనుంది. ఆ క్రమంలో అరెస్టుల పర్వంలో ఇప్పుడు విడదల రజిని వంతు వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది.

By
en-us Political News

  
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.