Publish Date:Aug 22, 2024
నిరుద్యోగ సమస్య మీద బిఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడి కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయిన బర్రెలక్క మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది
కర్నె శిరీష అంటే గుర్తు పట్టడం కొంచెం కష్టంగానీ, అదే బర్రెలక్క అంటే అందరూ చాలా ఈజీగా గుర్తు పడతారు. ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయారామె. ఇక ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆమె గురించి చాలా మందికి తెలిసింది. నిరుద్యోగుల తరఫున ఎన్నికల బరిలో నిలిచిన బర్రెలక్కకు చాలా మంది మద్దతిచ్చారు కూడా. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు మార్మోగిపోయింది. అయితే, తాజాగా ఆమె తాలూకు ఓ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అందులో బర్రెలక్క కన్నీరు పెట్టుకుంటూ.. తాను ఏ తప్పు చేయలేదని, అతనెవరో కూడా తనకు తెలియదని చెప్పడం వీడియోలో కనిపించింది.
కన్నడకు చెందిన ఓ ప్రముఖ ఛానెల్ బర్రెలక్క.. తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఎవరో ఒక వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిందని వార్తలను ప్రసారం చేసింది. ఆ వార్తలలో తన ఫొటోలతో పాటు, పేరు కూడా ప్రస్తావించింది. పైగా బాధితుడు కూడా తనను ఆమె మోసం చేసిందని చెప్పడం గమనార్హం.
దాంతో ఇప్పుడీ వార్త నెట్టింట బాగా వైరల్‌గా మారింది. చివరికి బర్రెలక్క దృష్టికి కూడా వచ్చింది. దాంతో షాక్ అవ్వడం ఆమె వంతైంది. ఇలా తనపై సోషల్ మీడియాలో తప్పుడు వార్త హల్చల్ చేయడంపై ఆమె స్పందించింది. ఇదంతా ఫేక్ అని, ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదంటూ కన్నీటిపర్యంతమైంది. తాను ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ వీడియోను బర్రెలక్క పోస్ట్ చేసింది.
‘‘ఇప్పుడే ఓ వార్త చూశాను. ఇది ఏ ఛానెలో కూడా నాకు తెలియదు. ఏదో కన్నడ ఛానెల్ అని తెలుస్తుంది. ఇలాంటి తప్పుడు వార్తను ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఫేస్బుక్లో చాట్ చేసి డబ్బులు దోచుకుందని వార్తలు వేస్తున్నారు. అసలేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఆయనెవరో ముసలాయన.. అతనెవరో కూడా నాకు తెలియదు. కొందరు కావాలనే ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నారు. నా పేరు మీద ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చాలా నకిలీ ఖాతాలు ఉన్నాయి. అందులో ఎవరు ఇలాంటి పని చేశారో నాకు తెలియదు. నేనేం తప్పు చేయలేదు’’ అని బోరున ఏడ్చేసిందామె. ఇక ఈ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న ఛానెల్‌పై ఆమె అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, వారితో మాట్లాడిన ఆడియోను కూడా వినిపించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/video-is-going-viral-barrelakka-who-cried-in-the-vidio-39-183431.html
Publish Date:Oct 11, 2026
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
Publish Date:Oct 11, 2026
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది. కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ