Publish Date:Apr 20, 2022
విశాఖ జిల్లా. మొదటి నుంచీ జగన్ రాజకీయం వైజాగ్ చుట్టూనే తిరుగుతోంది. విశాఖను ఏకంగా ఎగ్జిక్యూటివ్ కేపిటలే చేయాలనుకున్నారు. గతంలో తల్లి విజయమ్మను సైతం విశాఖ నుంచే పోటీ చేయించి.. ఓడిపోయి పరువంతా పోగొట్టుకున్నారు. ఆ తర్వాత విజయసాయిని వైజాగ్‌కు ఫిక్స్ చేసి.. ఆ ప్రాంతంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆయన మాత్రం అవినీతి, కబ్జాలు, అరాచకాలతో విశాఖను ఆగమాగం చేశారు. పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేశారు. అలా, సాయిరెడ్డి చేతిలో చితికిపోయిన విశాఖలో వైసీపీని మళ్లీ పూర్వవైభవం దిశగా నడిపించే కీలక బాధ్యతలను కొత్త మంత్రి విడదల రజనీకి అప్పగించడం ఆసక్తికరంగా మారింది. ఎంతోమంది సీనియర్లు ఉండగా.. విశాఖ జిల్లా వైసీపీని రజనీ చేతిలో పెట్టడం వెనుక జగన్ వ్యూహం ఏమై ఉంటుందా అనే చర్చ జరుగుతోంది.
విడదల రజనీ. జస్ట్ ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే. పెద్దగా రాజకీయ అనుభవం కూడా లేదు. అలాంటి రజనీని.. ఎక్కడో చిలకలూరిపేట నుంచి తీసుకొచ్చి.. విశాఖ పగ్గాలు అప్పగించడం వెనుక జగన్ లెక్క వేరే ఉందని అంటున్నారు. ఆమె తొలిసారి ఎమ్మెల్యేనే అయినా.. మంత్రి పదవి వరకూ ఈజీగా ఎదగడం చూస్తుంటే రజనీ.. జబర్దస్త్ లీడర్ అని తెలిసిపోతోందిగా. చంద్రబాబును నాటిన మొక్క నంటూ రాజకీయాల్లోకి వచ్చి.. టీడీపీకి హ్యాండిచ్చి.. వైసీపీలోకి దూకి.. మర్రి రాజశేఖర్‌కు చెక్‌పెట్టి.. ఎమ్మెల్యేగా గెలిచి.. మూడేళ్లలోనే మంత్రి పదవి దక్కించుకోవడం మామూలు విషయమేమీ కాదు. ఆమె రాజకీయ చాతుర్యానికి మెచ్చే జగనన్న.. విశాఖ జిల్లాను విడదల చేతిలో పెట్టారని అంటున్నారు.
సోషల్ మీడియాను మేనేజ్ చేయడంలో రజనీ ఎక్స్‌పర్ట్. ఆకట్టుకునే కట్టు, బొట్టుతో.. ఆకర్షించే ప్రసంగాలతో.. ప్రజల అటెన్షన్ తనవైపే ఉండేలా చేయడం బాగా వంటబట్టించుకున్నారని చెబుతారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలు, ప్రసంగాలు, కార్యక్రమాలు అప్‌డేట్ చేస్తూ.. ప్రత్యేకంగా ప్రమోషన్ టీమ్‌ను పెట్టుకొని.. తనేదో హంగామా చేస్తున్నట్టు సీన్ క్రియేట్ చేస్తూ.. నిత్యం న్యూస్‌లో ఉంటూ.. ప్రజల నోళ్లలో తన పేరు వినిపించేలా.. తన గురించి చర్చ జరిగేలా చేస్తుంటారని అంటారు. ఈ రోజుల్లో ఇలాంటి మీడియా ప్రమోషనే కదా కావాల్సింది. ఆ టాక్‌టిస్ విశాఖ జిల్లాలో బాగా వర్కవుట్ అవుతుందనేది జగన్ అంచనా. విశాఖ నగరంలో యువత, చదువుకున్నవారు, సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎక్కువ. అర్బన్ కల్చర్ పీపుల్ విడదల రజనీ వంటి వారు ఈజీగా అట్రాక్ట్ అవుతారు. అలా, విశాఖలో రజనీ మేనియాని ఓట్ల రూపంలో మార్చుకోవడం సులువు. అందుకే, పార్టీలో ఎంతమంది సీనియర్లు ఉన్నా.. వారందరినీ కాదని విడదల రజనీని విశాఖ జిల్లా వైసీపీ ఇంఛార్జిగా నియమించారని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vidadala-rajini-as-vishaka-ycp-incharge-39-134681.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.