సభలో వీడియోలు తీయొద్దు! ఎంపీలకు వెంకయ్య వార్నింగ్
Publish Date:Feb 3, 2021
Advertisement
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు, రెండు నెలలుగా సాగుతున్న రైతుల ఆందోళనపై పార్లమెంట్ దద్దరిల్లుతోంది. విపక్షాల ఆందోళనలో ఉభయ సభల్లో గందరగోళం నెలకొంటుంది. మంగళవారం రాజ్యసభలో విపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వెల్లోకి దూసుకొచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు ఎంపీలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రాజ్యసభలో కొందరు సభ్యులు వీడియోలు తీశారు. విపక్ష సభ్యుల ఆందోళలను రికార్డ్ చేశారు. ఆ వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. పలు టీవీ ఛానెళ్లలోనూ ప్రసారమయ్యాయి. రాజ్యసభలో జరిగిన పరిణామాల వీడియోలు వైరల్ కావడంపై రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంపీల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. సభలో ఎంపీలెవరూ మొబైల్ పోన్లతో వీడియోలు తీయవద్దని హెచ్చరించారు. చట్ట సభల కార్యకాలాపాలను వ్యక్తిగత మొబైల్ ఫోన్లలో చిత్రీకరించడం సభా నిబంధనలను ఉల్లంఘన కిందకు వస్తుందని వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. సభ నియమాలను పాటించి చట్టసభల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంపీలందరిపైనా ఉందని చెప్పారు. చట్ట సభల కార్యకాలాపాలను వ్యక్తిగత మొబైల్ ఫోన్లలో చిత్రీకరించడం సభా నిబంధనలను ఉల్లంఘన కిందకు వస్తుందని వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. సభ నియమాలను పాటించి చట్టసభల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంపీలందరిపైనా ఉందన్నారు. మొబైల్లో చిత్రీకరించిన వీడియోలు టీవీల్లోనూ ప్రసారం కావడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అవి అధికారిక వీడియోలు కానందున.. ఎవరూ ప్రసారం చేయకూడదని మీడియా సంస్థలకు కూడా వెంకయ్యనాయుడు విజ్ఞప్తిచేశారు.
http://www.teluguone.com/news/content/vice-president-venkaiah-naidu-fire-on-mps-who-came-from-well-39-109541.html





