చెత్తగా ఆడాం.. ఓటమిపై టీమ్ ఇండియా స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్.!

Publish Date:Jul 8, 2026

Advertisement

క్రికెట్ లో గెలుపు, టములు సహజమే అయినా..  కొన్ని ఓటములు మాత్రం అభిమానులను, జట్టును కోలుకోలేని దెబ్బ తీస్తాయి. తాజాగా ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టుకు అలాంటి   చేదు అనుభవమే ఎదురైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 125 పరుగుల భారీ తేడాతో   ఘోరాతి ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది.

భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా ఇది  భారీ ఓటమి కావడం గమనార్హం. ఈ దారుణ వైఫల్యంపై టీమిండియా స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్ అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం  మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. జట్టు   ప్రదర్శన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, మైదానంలో ఆడిన తీరు చెత్తగా ఉందంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.   ఆటగాళ్ల బాధ్యతారాహిత్యాన్నిగట్టిగా విమర్శించారు.   పిచ్   200 పరుగులు సాధించే అంత సులువుగా ఏమీ లేదన్న శ్రేయస్ అయ్యర్.. టీమ్ ఇండియా బౌలర్లు ప్రణాళికలను   సరిగ్గా అమలు చేయలేదన్నాడు.  

ఇక 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటింగ్ విభాగం పేకమేడలా కూలిపోయింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ముఖ్యంగా పవర్‌ప్లేలోనే 4 కీలక వికెట్లను కోల్పోవడం జట్టును కోలుకోలేని దెబ్బ తీసిందని శ్రేయస్ అయ్యర్ విశ్లేషించాడు. పవర్‌ప్లే ముగిసేసరికే మ్యాచ్ పూర్తిగా ఇంగ్లాండ్ వైపు మలుపు తిరిగిందని, అంతటి ఒత్తిడిలో భారీ లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యంగా మారిందని చెప్పాడు.   

India vs England T20, Team India Loss, Trent Bridge T20, Shreyas Iyer Angry, Teluguone

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఆదివారం ఉదయం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తమిళ సినీ నటుడు ఆర్యపై చీటింగ్ కేసు నమోదైంది.
రంగారెడ్డి జిల్లాలో ఒక బాధ్యతాయుతమైన పోలీసు అధికారి ప్రవర్తించిన తీరు ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.
మారువేషంలో వచ్చిన మంత్రికి చేదు అనుభవం..
భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో తన అద్భుతమైన గాత్రంతో ఆరు దశాబ్దాల పాటు శ్రోతలను ఓలలాడించిన గానకోకిల ఎస్. జానకి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని దైవాలగూడ గ్రామంలో ఒకే ఒక్క అరగంట వ్యవధిలో ఆరుగురిని అత్యంత కిరాతకంగా నరికి చంపి
విశాఖపట్నం నగరంలో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రస్తుత సీజన్‌లో ఎల్ నినో పంజా విసరడం వల్ల రాయలసీమతో పాటు కోస్తాంధ్రలో అన్నపూర్ణగా పేరొందిన జిల్లాలపై తీవ్ర ప్రభావం పడింది. ఎండల తీవ్రతకు జలాశయాల్లోని నీరు ఆవిరైపోయే పరిస్థితులు తలెత్తాయి. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రధాన ప్రాజెక్టులు ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ వైపు నుంచి ఎగువ ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి.
తన సతీమణి సాధించిన ఈ గొప్ప విజయం పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో బ్రాహ్మణి చోటు దక్కించుకోవడం తనకు గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ఆమె భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహంతో ముందడుగు వేస్తూ, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి, ఆదర్శంగా నిలవాలని నారాలోకేష్ ఎక్స్ వేదికగా షేర్ చేసిన పోస్టులో ఆకాంక్షించారు.
భారతీయ మార్కెట్లో మిడ్, స్మాల్ క్యాప్స్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కొత్త త్రైమాసికంలో కల్యాణ్ జ్యువెలర్స్, టీసీఎస్ లలో ఇన్వెస్ట్ చేయడానికి నిపుణులు ఇస్తున్న బెస్ట్ స్ట్రాటెజీ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద మెగా డ్యామ్ కింద ప్రమాదకరమైన భూకంప రేఖ ఉన్నట్లు చైనా శాస్త్రవేత్తలే గుర్తించారు. ఈ ప్రాజెక్టుతో భారత్‌కు పొంచి ఉన్న ముప్పేంటి? పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
AMFI తాజా జూన్ డేటా ప్రకారం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఫ్లెక్సీ క్యాప్ కంటే మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. 30 నెలల తర్వాత జరిగిన ఈ మార్పునకు కారణాలు, వాటి రిటర్న్స్ వివరాలు ఇక్కడ చూడండి.
అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ముగిసిందని డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 90కి పైగా సైనిక స్థావరాలపై అమెరికా దాడులు చేయగా, ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. పెరిగిన ముడి చమురు ధరల వివరాలు మరియు తాజా పరిణామాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.