ముందున్నది.. మండే కాలం

Publish Date:Apr 10, 2023

Advertisement

ఇప్పటికే ఎండలు మండి పోతున్నాయి. ఉదయం పది కాదు, ఎదిమిది గంటలు దాటిన తర్వాతే గడపదాటి బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు ఎండ భయానికి వణుకుతున్నారు.  అయితే వృద్దులు, చిన్న పిల్లలు, ఇతర దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారిపై ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రయాణాలు చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని  సూచిస్తున్నారు.  

అదలా ఉంటే ఇంతటితో అయిపోలేదు, ముందున్నది మరింత మండే ఎండల కాలమని, భారత వాతావరణ శాఖ (ఐఎండి ) హెచ్చరించింది. రానున్న ఐదు రోజుల్లో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.  రానున్న రెండు రోజుల్లో మధ్యప్రదేశ్‌, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా వేడిగాలులు వీచే అవకాశమున్నట్లు   తెలిపింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే ఉత్తమమని హెచ్చరించింది. ఏప్రిల్‌- జూన్‌ మధ్య కాలంలో దేశంలోని ఆగ్నేయ ప్రాంతంతో పాటు, దక్షిణ భారతదేశంలో ఎండలు సాధారణ స్థాయికంటే ఎక్కువగా నమోదవుతాయని ఇటీవలే ఐఎండీ హెచ్చరించింది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అయితే ఈ ఉష్ణోగ్రతల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై అంతగా ఉండకపోవచ్చని పేర్కొంది. అయితే ఎండాకాలంలో తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అన్నిటికంటే ముఖ్యంగా ఎండకు దూరంగా ఉండడం అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.

మరోవైపు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల భూ ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. ఇది దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావం చూపెడుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.  వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..  ఫిబ్రవరి నెలలో భారత్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1901 తర్వాత ఇంత భారీగా   ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఇదే తొలిసారి. అయితే, పశ్చిమ ప్రాంతాల మీదుగా వీచిన గాలుల మూలంగా మార్చి నెలలో భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో అసాధారణ స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు అదుపులోకి వచ్చాయి. అయితే  ఉష్ణోగ్రతలు మరో సారి భగ్గుమనే అవకాశముందని ఐఎండీ  చెబుతోంది .అలాగే, ఎండల  నడుమ కురిసే అకాల వర్షాల ప్రభావంతో అంటూ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మండే ఎండల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు అన్నటికంటే ముఖ్యంగా ఎక్కువ మోతాదులో పరిశుభ్రమైన నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా మిగతా కాలాలలో తీసుకునే నీటి కంటే ఎండాకాలంలో  రెండింతలు అధికంగా నీరు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే అదే సమయంలో అదే పనిగా నీరు  తాగడం కూడా మంచిది కాదని, తక్కువ మోతాడులో ఎక్కువ సార్లు నీరు తాగడం ద్వారా దప్పిక దగ్గరకు రాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే కీరదోస, క్యారట్, బీట్‌రూట్ లాంటి పచ్చికూరగాయలను తీసుకోవడం అవసరమని అంటున్నారు.  తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోవాలనీ, విలువైన పోషకాలుండే పుచ్చకాయ, ద్రాక్ష, కర్భూజ లాంటి పండ్లరసాలను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మధ్య మధ్యలో చల్లని మజ్జిగ, కొబ్బరి నీరు తాగడం వల్ల దేహంలోని వేడి తగ్గడంతోపాటు విలువైన పోషకాలు లభిస్తాయి.

చర్మం తాజాగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే, సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మంపై ముడతలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ కిరణాలు చర్మంలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి కొల్లాజెన్‌ను దెబ్బతీస్తాయి. దీంతో చర్మంపై ముడతలు ఏర్పడతాయి. కనుక సాధ్యమైనంత వరకూ ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదని అంటున్నారు. అయితే, ఎండల నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఈ అన్నిటికంటే కూడా ఎవరి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని అంటున్నారు.

By
en-us Political News

  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.