పేర్ని అడ్డంగా దొరికేశారా?.. ఇక అరెస్టే తరువాయా?

Publish Date:Jan 29, 2025

Advertisement

రేష‌న్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత‌, మాజీ మంత్రి పేర్నినాని అడ్డంగా దొరికిపోయినట్లే కనిపిస్తోంది. భారీ మొత్తంలో బియ్యం మాయం వెనుక పేర్ని నాని హ‌స్తం ఉన్న‌ట్లు పోలీసులు నిర్దార‌ణ‌కు వ‌చ్చారు. ఇదే విషయాన్ని పేర్నినాని కేసువిచారణ సందర్బంగా  ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. బియ్యం మాయం కేసులో పేర్ని నాని ప్రమేయానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొన్నారు. సాధారణంగా ఉద్యోగికి యజమాని ఖాతా నుంచి వేతనం సొమ్ములు వెడతాయనీ, కానీ  బియ్యం మాయం కేసులో మాత్రం గోదాము మేనేజన్ ఖాతా నుంచి పేర్ని నానికి సొమ్ములు బదిలీ అయ్యాయనీ, అది రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి అమ్మిన సొమ్మేననీ పోలీసుల విచారణలో తేలిందనీ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.  ఇరు పక్షాల వాదనలూ విన్న హైకోర్టు  తీర్పు రిజర్వ్ చేసింది. అయితే ఇప్పటికే పోలీసులకు తొందరపాటు చర్యలు వద్దంటూ ఇచ్చిన ఉత్తర్వ్యులను పొడిగించింది. 

అయితే ఈ కేసు విషయంలో పేర్ని నాని, ఆయన సతీమణి జయసుధ పూర్తిగా ఇరుక్కున్నట్లునని న్యాయ నిపుణులు అంటున్నారు. వైసీపీ హయాంలో పేర్ని నాని తన సతీమణి జయసుధ పేరిట గోదాములను నిర్మించి, వాటిని పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పేర్ని నాని సతీమణికి చెందిన గోదాములలో రేషన్ బియ్యం పెద్ద ఎత్తున మాయం అయ్యిందని అధికారుల తనిఖీలలో బయటపడింది. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు. తొలుత పేర్ని జయసుధ,  గోడౌన్ మేనేజర్  మ‌న‌స తేజ్‌, పౌర‌స‌ర‌ఫ‌రాల అధికారి కోటిరెడ్డితో పాటు మ‌రో ఇద్ద‌రిపై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. విచారణలో మాన‌స‌త్ తేజ్‌, కోటిరెడ్డితోపాటు మ‌రో ఇద్ద‌రి మ‌ధ్య దాదాపు పాతిక నుంచి 30 ల‌క్ష‌ల రూపాయల మేర లావాదేవీలు జ‌రిగిన‌ట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతే కాకుండాపేర్ని నాని కుటుంబ స‌భ్యుల బ్యాంకు ఖాతాల‌కు కూడా మాన‌స్ తేజ్ బ్యాంకు ఖాతా నుంచి ల‌క్ష‌ల్లో లావాదేవీలు జ‌రిగిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ పరిస్థితిలో  తేడా వ‌చ్చిన రేష‌న్ బియ్యం మొత్తానికి డ‌బ్బులు చెల్లిస్తామ‌ని పేర్ని నాని కుటుంబం అధికారుల‌కు లేఖ రాసింది. రూ.3.37 కోట్ల‌కుపైగా విలువైన బియ్యం మాయ‌మైంద‌ని అధికారులు అంచ‌నాకు వ‌చ్చారు. తొలుత రూ.1.70కోట్లు చెల్లించాల‌ని సూచించ‌గా.. పేర్నినాని కుటుంబం ఆ మొత్తాన్ని చెల్లించింది. మూడు రోజుల కిందట మరో రూ.1.67 కోట్లు చెల్లించాల‌ని అధికారులు పేర్ని నాని కుటుంబానికి నోటీసులు ఇచ్చారు.

కాగా ఈ కేసులో ఏ1గా ఉన్న జ‌య‌సుధ కోర్టును ఆశ్రయించడంతో ఆమెకు ముందస్తు బెయిలు లభించింది. అయితే విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఇక ఈ కేసులో ఏ2, ఏ3, ఏ4, ఏ5లుగా ఉన్న మాన‌స్ తేజ్‌, కోటిరెడ్డి, లారీ డ్రైవ‌ర్ మంగారావు, రైస్ మిల్ల‌ర్ ఆంజ‌నేయులును పోలీసులు అరెస్టు చేసి విచారించారు.  ఆ విచారణలో వీరు  గోదాములో బియ్యం మాయం వెనుక పేర్ని నాని ప్ర‌మేయం ఉంద‌ని  స్ప‌ష్టం చేశారు. దీంతో పోలీసులు పేర్ని నానిని ఈ కేసులో ఏ6గా చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.  దీంతో ఆయ‌న ముంద‌స్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లారు.    ఇప్పుడు కోర్టు తీర్పు రిజర్వ్ చేయడంతో రాజకీయ వర్గాలలో  నాని అరెస్టౌతారా, అవ్వరా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. న్యాయ నిపుణులు మాత్రం రేషన్ బియ్యం మాయం కేసులో నాని పూర్తిగా ఇరుక్కున్నారన్న అభిప్రాయమే వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.