తెలుగుదేశం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి కోపం వచ్చింది. నెల్లూరు జిల్లా సమీక్షా సమావేశం నుంచి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వాకౌట్ చేశారు. తనకు సముచిత గౌరవం లభించలేదన్న ఆగ్రహంతో ఆయన సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. నెల్లూరు జెడ్పీ కార్యాలయంలో ఆదివారం (నవంబర్ 3) జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభించిన ఆర్డీవో సమావేశానికి వచ్చిన ప్రజా ప్రతినిథులకు బొకెలు అందజేశారు.
అయితే మంత్రులు, ఎమ్మెల్యేలకు బొకేలు అందించి సభకు పరిచయం చేసిన ఆర్డీవో, ఎంపీ వేమిరెడ్డిని మాత్రం విస్మరించారు. దీంతో వేమిరెడ్డికి ఆగ్రహం వచ్చింది. అంతే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎంత సముదాయించినా.. గౌరవం లేని చోట ఉండలేనంటూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా భర్తతో పాటు సమావేశం నుంచి వెళ్లి పోయారు. ఇదేమీ చిన్న విషయం కాదు. వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరడానికి కారణమే వైసీపీలో తనకు గౌరవం లభించడం లేదని. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలు సందర్భాలలో చెప్పారు.
వేమిరెడ్డి వంటి స్టేచర్ ఉన్న వ్యక్తులు పదవులు, హోదాల కంటే రెస్పెక్ట్ ఉండాలని భావిస్తారు. వైసీపీలో అలా రెస్పెక్ట్ దొరకలేదనే ఆయన పార్టీ వీడారు. ఇప్పుడు అదే పరిస్థితి తెలుగుదేశంలో కూడా ఆయనకు ఎదురౌతోందని భావిస్తున్నారు. ఎంపీనైన తనను అధికారులు గుర్తించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆయనను సముదాయించేందుకు ఆనం ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అధికారులు తనను అవమానించారనీ, ఇంకెప్పుడూ సమీక్షా సమావేశానికి వచ్చేది లేదని వేమిరెడ్డి కుండబద్దలు కొట్టేశారు. అంతా అయిపోయిన తరువాత ఆనం రామనారాయణరెడ్డి అధికారలు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటిది పునరావృతం కాకూడదని ఆదేశించారు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్ర పురోభివృద్ధి విషయంలో వంక పెట్టడానికి వీల్లేకుండా పని చేస్తున్నది. ఈ విషయంలో చంద్రబాబు చాలా స్పష్టంగా ఉన్నారు. ఎక్కడైనా నేతలూ అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తుంటే వెంటనే కరెక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో నేతలకు సముచిత గౌరవం దక్కే విషయంపై కూడా దృష్టి పెట్టాలి. నేడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి జరిగినట్లు మరో రోజు మరో నేతకు జరగకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో వేమిరెడ్డి విషయంలో జరిగింది పొరపాటు మాత్రమేననీ, మరోసారి పునరావృతం కాదనీ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయనకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. చిన్న విషయమే కదా అని వదిలేస్తే ముందు ముందు ఇదో ఆనవాయితీగా మారిపోయే ప్రమాదం ఉంది. ప్రొటోకాల్ ను ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vemireddy-walk-out-39-187841.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది