తిరుమల లడ్డూ ప్రసాదం.. తప్పు చేసిందెవరు?.. పరిష్కారం ఏమిటి?

Publish Date:Feb 13, 2026

Advertisement

తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో  వాస్తవ వేదిక  12వ సంచిక గురువారం (ఫిబ్రవరి 12) విడుదలైంది.   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై  కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్   అర్ధవంతమైన  చర్చ జరిపారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం జగన్ హయాంలో సరఫరా అయినది అసలు నెయ్యే కాదని డోలేంద్ర ప్రసాద్ కుండ బద్దలు కొట్టారు.  

పామాయిల్‌తో పాటు రసాయనాలు కలిపిన నూనె  సరఫరా చేశారన్నారు. ఇప్పుడు వైసీపీ నాయకులు తెలివిగా నెయ్యిలో కల్తీ లేదని వాదిస్తూ ప్రజలను తొప్పుదోవ పట్టించడానికి చేస్తున్న ప్రయత్నం దొంగే దొంగ దొంగా అని అరుస్తున్న చందంగా ఉందని డోలేంద్ర ప్రసాద్ అన్నారు.  జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును వదిలి సుప్రీంకోర్టులో సీబీఐ విచారణ కోరడం  అలాంటిదేనని   కంఠంనేని రవిశంకర్ అన్నారు.  అపచారం చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు బుకాయిస్తున్నారన్నారు.  ఈ దశలో కంఠంనేని రవి శంకర్ గతంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమలకు ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు చాలు అన్న విషయాన్ని అప్పట్లో వైఎస్ ఏకంగా ఏడు కొండలు కాదు రెండు కొండలే అంటూ జీవో ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించి.. వైఎస్ఆర్ కుటుంబం తిరుమలపై   కక్ష కట్టిందా? అన్న ప్రశ్న సంధించారు.    ఈ సంచికలో ఇంకా పింక్ డైమండ్ అన్న రమణదీక్షితులు వ్యవహారంపై కూడా చర్చకు వచ్చింది. 

మొత్తంగా వైసీపీ హయాంలో  తిరుమల లడ్డూ తయారీలో అసలు నెయ్యిని వాడలేదనీ, నెయ్యిలా కనిపించేందుకు, పూసపూసలా నెయ్యి అనిపించేందుకు నూనెలో రసాయనాలు కలిపి సరఫరా చేశారని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు. దీనివల్ల తిరుమల లడ్డూ ప్రసాదం మూడు నాలుగు రోజులలోనే బూజు పట్టేవన్నారు.  ఈ విషయంలో తెలుగుదేశం డిఫెన్స్ లో పడటానికి, ల్యాబ్ రిపోర్టులు పూర్తిగా అధ్యయనం చేయకుండా చంద్రబాబు నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ అని ప్రకటించడమేనన్నారు.  ఇక నుంచైనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదంలో   కల్తీ నెయ్యి'అనడం మాని కల్తీ నూనె లేదా రసాయనాల మిశ్రమం అని పిలవాలని డోలేంద్ర ప్రసాద్ సూచించారు. ఎందుకంటే అసలు నెయ్యే లేనప్పుడు కల్తీ నెయ్యి అని ఎలా అనగలం అన్నారు. 

ఇక తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ఇంతటి అపచారం జరిగితే చిన్న జీయర్ స్వామి వంటి మతాధిపతులు, మఠాధిపతులు, హిందూ సంస్థలు ఎందుకు మౌనం వహిస్తున్నాయన్నారు. దర్యాప్తు సంస్థల విచారణలు, రాజకీయ ఆరోపణలు కాకుండా కంటే మతాధిపతులతో కూడిన కమిటీ విచారణ చేస్తే ప్రజలకు నమ్మకం కలుగుతుందని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు.   దేవుడికి అపచారం చేసిన వారు ఎవరూ బాగుపడలేదన్నారు.  జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్త హోమం నిర్వహించాలని, జగన్ తన హయాంలో జరిగిన తప్పుకు బహిరంగ క్షమాపణ కోరాలని డోలేంద్ర ప్రసాద్ అన్నారు.

వాస్తవ వేదిక పూర్తి చర్చను తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో వీక్షించండి

By
en-us Political News

  
రాజకీయాల్లో విలువలు పడిపోయాయి..అవనిగడ్డ ఎమ్మెల్యే ఆవేదన..!
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.