‘వసంత’రాగంలో అమరావతి పాట.. సైకిలెక్కేయడానికేనా?

Publish Date:Mar 4, 2023

Advertisement

విశాఖ పరిపాలన రాజధానిగా చేసుకొని.. త్వరలోనే  ఇక్కడి నుంచే పాలన  ప్రారంభిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్  శుక్రవారం (మార్చి 3)  విశాఖపట్నం వేదికగా ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు సాక్షిగా ప్రకటించారు.  అయితే  ఉమ్మడి కృష్ణాజిల్లా  మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాత్రం మూడు రాజధానులనేది వైసీపీ విధానమైతే కావచ్చు కానీ తాను మాత్రం  ఏకైక రాజధాని అమరావతికే మద్దతిస్తానని విస్ఫష్టంగా చెప్పేశారు.

అదీ విశాఖ పరిపాలనా రాజధాని అని జగన్ ప్రకటించడానికి సరిగ్గా ఒకే ఒక్క రోజు ముందు అంటే గురువారం (మార్చి 2)న వసంత కృష్ణ ప్రసాద్ ఈ విషయం చెప్పారు. ఆయనేం జగన్ విశాఖ పరిపాలనా రాజధాని అని ప్రకటిస్తారని తెలియక  చెప్పిన మాట కాద. విశాఖ రాజధానిగా తాను త్వరలో పాలన ప్రారంభిస్తానని జగన్ గతంలో కూడా విస్పష్టంగా ప్రకటించారు. మూడు రాజధానులే తమ విధానమని గత మూడున్నరేళ్లుగా చెబుతూనే ఉన్నారు. అయినా వైసీపీ ఎమ్మెల్యే నిన్నగాక మొన్న తన మద్దతు అమరావతికేనని విస్పష్టంగా చెప్పారు. అది కూడా జగన్ మానస పుత్రిక లాంటి గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన గురువారం ( మార్చి 3)   కవులూరులో  పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన్ని గ్రామస్థులు అడ్డుకొని.. రాజధానిపై మీరు ఇలా సైలెంట్‌గా ఉంటే ఎలా? రాజధాని అమరావతిపై మీ అభిప్రాయం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానిపై గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో భూముల రేట్లు పడిపోయాయని వారు ఎమ్మెల్యే ఎదుటే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఆందోళనతో ఆయన ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయి.. అమరావతికే నా ఓటు అంటు క్లియర్ కట్‌గా వారికి స్పష్టం చేసినట్లు సమాచారం.

వసంత ఇలా అమరావతికి మద్దతుగా మాట్లాడటంతో ఆయన తెలుగుదేశం గూటికి చేరే యోచనలో ఉన్నారన్న ప్రచారం ఒక్క సారిగా జోరందుకుంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా వసంత కృష్ణ ప్రసాద్ ఇలా అమరావతికే నా మద్దతు అంటే చెప్పారో లేదో.. అలా పార్టీలో వసంత కృష్ణ ప్రసాద్ ప్రత్యర్థి వర్గం, అంటే  మంత్రి జోగి రమేష్ వర్గం వెంటనే రంగంలోకి దిగి విమర్శలు గుప్పించింది. సామాజిక మాధ్యమం వేదికగా ఈ విమర్శల పర్వం కొనసాగుతోంది. వీరికి దీటుగా వసంత వర్గం కూడా సామాజిక మాధ్యమంలో రిటార్డులు సంధిస్తోంది. ఒక విధంగా ఇరువురి వర్గాల మధ్యా సోషల్ మీడియా వేదికగా యుద్ధం జరుగుతోంది.  

కాగా వసంత వైసీపీతో బంధం తెంచుకుంటారన్న ప్రచారం జోరందుకోవడానికి ఆయన తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు వైసీపీపై ఇటీవల బహిరంగంగానే విమర్శలు గుప్పించడం, విజయవాడ ఎంపీ, తెలుగుదేశం నాయకుడు కేశినేని నానితో భేటీ కావడం కూడా కారణమేనని చెబుతున్నారు. ఇక వసంత కృష్ణ ప్రసాద్ కూడా పార్టీ లైన్ కు భిన్నంగా ఉయ్యూరు శ్రీనివాస్ కు మద్దతుగా మాట్లాడడాన్ని కూడా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అదెప్పుడంటే.. కొద్ది రోజుల కిందట  ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుంటూరులో చంద్రన్న కానుక కార్యక్రమంలో   జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మరణించారు..  దీంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై వైపీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్  ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ తనకు చాలా కాలంగా తెలుసునని.. మంచి వ్యక్తి అని.. తనకు స్నేహితుడు అంటూ మీడియా ముందుకు వచ్చి  చెప్పడమే కాదు.. ఇలా జన్మభూమికి ఎంతో కొంత సేవ చేస్తూన్న ఇలాంటి ఎన్నారైలపై కేసులు పెడితే.. భవిష్యత్తులో మరే ఎన్నారై జన్మభూమికి సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు రారని అన్నారు. ఇది కూడా ఆయన వైసీపీ లైన్ కు భిన్నంగా వెళుతున్నారనడానికి తార్కానంగా పరిశీలకులు చెబుతున్నారు.

ఇక ఇటీవలి కాలంలో వసంత కృష్ణ ప్రసాద్, పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ ల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వసంత కృష్ణ ప్రసాద్ సైకిల్ ఎక్కేస్తారన్న ప్రచారం జోరందుకుంది. అయితే వీరిద్దరి పంచాయతీ జగన్ వరకూ వెళ్లింది. దీంతో జగన్ వీరిద్దరినీ కూర్చో బెట్టి సమన్వయం కుదిర్చారు. మైలవరం టికెట్ వసంతకృష్ణ ప్రసాద్ కే అని స్పష్టం చేయడమే కాకుండా.. నియోజకవర్గాలలో జోక్యం వద్దని జోగి రమేష్ కు విస్పష్టంగా చేప్పారని అప్పట్లో పార్టీ శ్రేణులే చెప్పాయి. దీంతో ఇరువురి మధ్యా సమన్వయం కుదిరిందని అంతా అనుకుంటున్న సమయంలోనే రాజధాని విషయంలో వసంత కృష్ణ ప్రసాద్ ఇచ్చిన క్లారిటీ మళ్లీ ఆయన పార్టీ మార్పు చర్చను తెరమీదకు తెచ్చింది.

 ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ ను ప్రస్తావనకు తీసుకు వస్తున్నారు. ఆయన కూడా అమరావతి రైతుల న్యాయస్థానం టు దేవస్థానం పాదయాద్ర నెల్లూరులో ప్రవేశించిన సందర్భంగా వారిని కలిసి యోగక్షేమాలు తెలుసుకున్న తరువాతే జగన్ తో గ్యాప్ పెరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ అమరావతికి మద్దతుగా మాట్లాడటంతో ఆయనకు ఇక పార్టీలో కొనసాగే అవకాశాలు మృగ్యమైనట్లేనని అంటున్నారు.  

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.