ఏపీ రాజకీయాల్లో కీలక నియోజకవర్గాల్లో ఒకటైన పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ కీలక మార్పులు చేసింది. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్గా మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మ (ఎస్వీఎస్ఎన్ వర్మ)ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. త్వరలో నియోజకవర్గ పార్టీ వ్యవహారాల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ కమిటీ నియామకంపై కసరత్తును పార్టీ హై కమాండ్ ప్రారంభించింది. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేయనుంది.
కూటమి రాజకీయాల నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన తెలుగుదేశం హైకమాండ్.. క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు తగ్గకుండా ఉండేందుకే ఈ మార్పులు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల నియోజకవర్గ పరిధిలో జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య ప్రొటోకాల్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
ఇన్చార్జ్గా తనను తప్పించడంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. పలురకాల సమీకరణాలతో టీడీపీలో మార్పులు జరుగుతుంటాయని చెప్పుకొచ్చారు. ఫైనల్‌గా పార్టీ బాగుండేలా హై కమాండ్ చూడాలని అన్నారు. మంత్రి నారా లోకేశ్ తనతో మాట్లాడిన తర్వాతే పిఠాపురం టీడీపీలో నూతన కమిటీ ఏర్పాటును నిర్ణయించారన్న వర్మ.. టీడీపీలో నాయకులే ఇక్కడ నిర్వహణ చేస్తారని.. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో పోటీ నుంచి అయిష్టంగానే తప్పుకున్న వర్మ.. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేశారు. అప్పట్లో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని తెలుగుదేశం అధిష్టానం హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇంత వరకు వర్మకు ఎలాంటి పదవి దక్కకపోవడంతో ఆయన వర్గం అసంతృప్తితో ఉంది. ఆ క్రమంలో పిఠాపురంలో ఎప్పటికప్పుడు కూటమి పార్టీల మధ్య విభేదాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వర్మను ఇన్చార్జ్ పదవి నుంచి తప్పించడంతో ఈ పరిణామం ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/varma-removed-as-pithapuram-tdp-incharge-25-219147.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.