పిఠాపురం తెలుగుదేశం ఇన్చార్జ్‌గా వర్మ తొలగింపు

Publish Date:May 7, 2026

Advertisement

ఏపీ రాజకీయాల్లో కీలక నియోజకవర్గాల్లో ఒకటైన పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ కీలక మార్పులు చేసింది. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మ (ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ)ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. త్వరలో నియోజకవర్గ పార్టీ వ్యవహారాల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ కమిటీ నియామకంపై కసరత్తును పార్టీ హై కమాండ్ ప్రారంభించింది. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేయనుంది. 

కూటమి రాజకీయాల నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన  తెలుగుదేశం హైకమాండ్..   క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు తగ్గకుండా ఉండేందుకే ఈ   మార్పులు చేసినట్లు పార్టీ  వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల నియోజకవర్గ పరిధిలో జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య ప్రొటోకాల్ వివాదం తీవ్ర  చర్చనీయాంశమైంది. పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో  వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.

ఇన్చార్జ్‌గా తనను తప్పించడంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. పలురకాల సమీకరణాలతో టీడీపీలో మార్పులు జరుగుతుంటాయని చెప్పుకొచ్చారు. ఫైనల్‌గా పార్టీ బాగుండేలా హై కమాండ్ చూడాలని అన్నారు. మంత్రి నారా లోకేశ్ తనతో మాట్లాడిన తర్వాతే పిఠాపురం టీడీపీలో నూతన కమిటీ ఏర్పాటును నిర్ణయించారన్న వర్మ.. టీడీపీలో నాయకులే ఇక్కడ నిర్వహణ చేస్తారని.. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను పూర్తిగా సహకరిస్తానని  స్పష్టం చేశారు. 

పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో పోటీ నుంచి  అయిష్టంగానే తప్పుకున్న వర్మ.. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేశారు. అప్పట్లో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని తెలుగుదేశం అధిష్టానం హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇంత వరకు వర్మకు ఎలాంటి పదవి దక్కకపోవడంతో ఆయన వర్గం అసంతృప్తితో ఉంది. ఆ క్రమంలో పిఠాపురంలో ఎప్పటికప్పుడు కూటమి పార్టీల మధ్య విభేదాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వర్మను ఇన్చార్జ్ పదవి నుంచి తప్పించడంతో ఈ పరిణామం ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

By
en-us Political News

  
ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఆయనకు పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్న చర్చ గత కొంత కాలంగా జనసేనలో అంతర్గతంగా సాగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా చేస్తున్న విమర్శలను, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం వెనుకబడిందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది.
నగర ప్రజల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ, నిధుల విడుదలే లక్ష్యంగా వీరిద్దరూ కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ చాలా సానుకూల వాతావరణంలో జరిగిందనీ, మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఆర్థిక అవరోధాలను అధిగమించడానికి ఇదొక కీలక ముందడుగని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం పేర్కొన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సమర్ధంగా, ఎఫెక్టివ్ గా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనిని మరొక మెట్టు పైకి తీసుకువెళ్లి ముందుకు తీసుకెళ్లి ఈజ్ ఆఫ్ లివింగ్ అనే భావనను తీసుకొచ్చారనీ, ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలలో ఎప్పటినుంచో అనేక అంతరాలు, ఘర్షణలు ఉన్నాయనీ, సాంకేతికత ద్వారా ఆ అవరోధాలను తొలగించాలనేదే మా ఆలోచన అన్నారు.
ఎక్స్‌ప్రెస్ అడ్డా వేదికపైకి విప్లవాత్మక మార్పులకు, పాలనా విధానాలకు కేంద్ర బిందువులుగా నిలిచే అత్యున్నత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారు. గతంలో ఈ వేదికపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆ లీగ్‌లో నారా లోకేష్ నిలవడం ఆయన స్థాయిని రుజువు చేస్తోంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
బిజెపి ఏపీలో తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగానే వైసిపికి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులతో బిజెపి అగ్రనాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.