తండ్రి ఎమ్మెల్సీ.. కుమారుడు ఎమ్మెల్యే.!

Publish Date:Aug 20, 2026

Advertisement

తెలుగుదేశం సీనియర్ నాయకుడు వర్ల రామయ్య బుధవారం (ఆగస్టు 19) ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఎమ్మెల్సీగా, ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా ఏక కాలంలో  చట్టసభలలో ప్రతినిధులుగా ఉన్ననట్లైంది.

 రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే పలు  కుటుంబాలు రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆ జాబితాలోకి ఇప్పుడు  వర్ల కుటుంబం  చేరింది.వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా  పామర్రు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.  

వర్ల రామయ్య  తెలుగుదేశంలో  కీలకమైన నాయకుడిగా, విశ్లేషకుడిగా సేవలు అందిస్తున్నారు. గతంలో ఆయన  ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ,   విజయాన్ని అందుకోలేకపోయారు. అయినా  పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా నిలబడి, పార్టీ సిద్ధాంతాలను గట్టిగా వినిపించారు.

 ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన  వర్ల రామయ్య  సేవలకు గుర్తింపుగా, పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధతకు ప్రతిఫలంగానూ అధిష్టానం ఆయనను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక  చేసింది. ఈ నిర్ణయంతో ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి తగిన గౌరవం లభించిందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు సభ్యులు ఏకకాలంలో చట్టసభలలో సభ్యులుగా ఉండటం ఇదే ప్రథమం కాదు కానీ, ఇది అరుదుగా జరిగే విషయం.  

నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, నాగబాబు,  చింతకాయల అయ్యన్నపాత్రుడు, చింతకాయల విజయ్..  వంటి ఇలా తండ్రీ కొడుకులు ఒకే సమయంలో చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇప్పుడు వర్ల రామయ్య, వర్ల కుమార్ రాజా వారి సరసన చేరారు.   

Varla Ramaiah MLC, Varla Kumar Raja Pamarru MLA, AP Politics,  Father MLC Son MLA,  Andhra Pradesh, TeluguOne

By
en-us Political News

  
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.